ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ముఖ్యాంశాలు

అసెంబ్లీ ముందుకు ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ప్రతిపాదనలు సమర్పించిన యనమల రామకృష్ణుడు మొత్తం బడ్జెట్ అంచనా రూ. 2.26 లక్షల కోట్లు మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ, ఆంధ్రప్రదేశ్ ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ ముందుకు వచ్చింది. రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణడు, అమరావతి అసెంబ్లీలో తన మూడవ బడ్జెట్ ప్రతిపాదనలను సభ ముందుంచారు. ఏపీ ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ముఖ్యాంశాలు… * మొత్తం బడ్జెట్ అంచనా రూ. 2,26,177.53 కోట్లు.* రెవెన్యూ వ్యయం రూ. 1,80,369.33 కోట్లు.* రెవెన్యూ మిగులు రూ. 2,099.47 కోట్లు.* ఆర్థిక లోటు రూ. 32,390.68 కోట్లు.* ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ వన్ స్థానంలో ఉన్నాం.* స్వరాష్ట్రంలో మూడో బడ్జెట్ ప్రవేశపెట్టడం సంతోషంగా ఉంది.* ఎన్నో ప్రతికూలతల మధ్య విజయాలు సాధించాం.* చంద్రబాబు…

Read More

వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తుపెట్టుకోం. వైఎస్ జగన్

గత ఎన్నికల్లో మాదిరే వచ్చే ఎన్నికల్లోనూ ఎవరితో పొత్తుపెట్టుకోమని, ఒంటరిగానే పోటీ చేస్తామని వైసీపీ అధినేత జగన్ మరోసారి స్పష్టం చేశారు. తిరుపతిలో నిర్వహించిన ‘సమర శంఖారావం’లో ఆయన మాట్లాడుతూ, ‘హోదా’పై ఎవరు సంతకం పెడతారో వారికే తమ మద్దతిస్తామని మరోసారి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 25కు 25 ఎంపీ స్థానాలను మనమే గెలుచుకుందామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం చేశాయని, ఆ పార్టీలకు ఓటు వేయొద్దని సూచించారు. ఓటు వేయమని చంద్రబాబు డబ్బులిస్తే తీసుకోమని, ఓటు మాత్రం మనస్సాక్షి చెప్పినట్టు వేయాలని వ్యాఖ్యానించారు. చీకటి తర్వాత వెలుగు ఎలా వస్తుందో, అలాగే, వైసీపీ అధికారంలోకి రాబోతోందని జగన్ ధీమా వ్యక్తం చేశారు.

Read More

ఏ పార్టీ నుంచి పోటీ చేయాలో ప్రజలే నిర్ణయిస్తారు: విష్ణు కుమార్ రాజు

పార్టీ మారడంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆసక్తికర స్టేట్ మెంట్ ఇచ్చారు. ఓటమి భయంతోనే రాజకీయ నేతలు స్థానాలు మారుతుంటారని… తాను మాత్రం మళ్లీ విశాఖ నార్త్ నుంచే పోటీ చేస్తానని చెప్పారు. అయితే, తాను ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే విషయాన్ని ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల జ‌ల్లు కురిపించారు. పెన్షన్లు, రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వ పనితీరు బాగుందని కితాబిచ్చారు. తాను అజాత శత్రువునని, అన్ని పార్టీలవారితో మంచిగా ఉంటానని చెప్పారు. అమరావతిలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Read More

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 మంది ఐఎఎస్ అధికారులను బదిలీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12 మంది ఐఎఎస్ అధికారులను బదిలీ చేసింది. కీలకమై ఎక్సైజ్ శాఖ కమీషనర్ గా ముఖేష్ కుమార్ మీనాను నియమించింది. ఆ స్ధానంలో పనిచేస్తున్న పీ.లక్ష్మీనరసింహ్మను పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. అలాగే శ్రీనివాస్ శ్రీనరేష్ ను గనుల శాఖ కార్యదర్శిగా బదిలీ చేసి అక్కడ ఉన్న బీ.శ్రీధర్ ని పశు సంవర్ధక శాఖ కార్యదర్శిగా నియమించారు. సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఎం.రామారావుని శ్రీకాకుళం కలెక్టర్ గా బదిలీ చేశారు. శ్రీకాకుళం కలెక్టర్ గా ఇంత వరకూ విధులు నిర్వర్తించిన కే.ధనుంజయరెడ్డిని పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీ చేశారు. అలాగే క్రిష్ణా జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నా బి.లక్ష్మీకాంతం ని టీటీడీ జేఈఓగా బదిలీ చేసింది. అక్కడ పని చేస్తున్న పీ.భాస్కర్ ని సాంఘిక సంక్షేమ…

Read More