సుమంత్‌ ‘కపటధారి’ టీజర్‌ విడుదల చేసిన ప్యాన్‌ ఇండియా వెర్సటైల్‌ యాక్టర్‌ రానా దగ్గుబాటి

” ఈ ప్రపంచంలో ఏదీ ఊరికే జరగదు. అన్నిటికీ ఓ కారణం ఉంటుంది” అని అంటున్నారు హీరో సుమంత్‌. ఈయన కథానాయకుడిగా ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న థ్రిల్లర్‌`క‌ప‌ట‌ధారి`.  `సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం`, `ఇదంజ‌గ‌త్‌` చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న సుమంత్ ఇప్పుడు `క‌ప‌ట‌ధారి` అనే ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌లో న‌టిస్తున్నారు. క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ట‌యిన `కావ‌లుధారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ డిఫ‌రెంట్ పాయింట్‌తో రూపొందిన `కావ‌లుధారి` చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో డా.ధ‌నంజ‌యన్ నిర్మిస్తున్నారు. గురువారం రోజు ఈ సినిమా టీజర్‌ను టాలీవుడ్‌ హల్క్‌, ప్యాన్‌ ఇండియా వెర్సటైల్‌ యాక్టర్‌ రానా దగ్గుబాటి విడుదల చేశారు. టీజర్‌ చూస్తుంటే ప్రపంచంలో జరిగే ప్రతి విషయం వెనుక బలమైన కారణం ఉందనే పాయింట్‌ను బేస్‌ చేసుకుని కథను రూపొందించినట్లు కనిపిస్తుంది. అలాగే ఏదో…

Read More

చైతన్య కృష్ణ, పాయల్‌ రాజ్‌పుత్‌ ‘అనగనగా ఓ అతిథి’ ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి

తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌మెంట్‌తో అలరిస్తున్న హండ్రెడ్‌ పర్సెంట్‌ తెలుగు ఓటీటీ ‘ఆహా’. కోవిడ్‌ సమయంలో వరుస కొత్త చిత్రాలతో ఆకట్టుకున్న ఆహా ఇప్పుడు తమ ఓటీటీలో ‘అనగనగా ఓ అతిథి’  చిత్రాన్ని నవంబర్‌ 13న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ‘అనగనగా ఓ అతిథి’ పీరియాడికల్‌ మూవీ. కన్నడ చిత్రపరిశ్రమలో అవార్డ్ విన్నింగ్‌ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు దయాల్‌ పద్మనాభన్‌ తెలుగులో డైరెక్ట్‌ చేస్తున్న తొలి చిత్రమిది. ఓ కుటుంబ పేద‌రికంతో బాధ‌ప‌డుతుంటుంది. వారి కష్టాల‌ను దాట‌డానికి ఓ జ్యోతిష్యుడు చెప్పిన జాత‌కం అలానే వారి జీవితం లోకి వచ్చిన  అతిథి వ‌ల్ల కుటుంబ స‌భ్యుల‌కు అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. దురాశ, మోహం, అత్యాశ వంటి ఎలిమెంట్స్‌ను సూచించేలా ఇందులో పాత్రలు ఉంటాయి. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి విడుదల చేశారు. ఈ…

Read More

న‌వంబ‌ర్ 12న ఆకాశంనీహ‌ద్దురా విడుద‌ల

దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 12న ఆకాశంనీహ‌ద్దురా విడుద‌ల సంద‌ర్భంగా స్టార్ హీరో సూర్య‌, డైరెక్ట‌ర్ సుధ‌ కొంగ‌ర తెలుగు సినీ పాత్రికేయుల‌తో ముచ్చ‌టించారు. ఈ స‌మావేశంలో చ‌ర్చించిన కొన్ని ముఖ్యాంశాలుసూర్య – ఆకాశం నీ హ‌ద్దురా చిత్రం నాకు చాలా స్పెష‌ల్, ఎందుకంటే ఈ క‌థలో హీరో అంద‌రు అసాధ్యం అనుకున్నే దాన్ని సుసాధ్యం చేసి చూపిస్తాడు. ఇప్పుడు సాధ‌ర‌ణ ప్ర‌జ‌లు కూడా విమానం ఎక్కి తిరుగుతున్నారంటే దానికి కార‌ణం డెక్క‌న్ ఏయిర్ వేస్ ఫౌండ‌ర్ జీఆర్ గోపీనాథ్, ఆయ‌న వ్య‌క్తిగ‌త అంశాలు కొన్ని తీసుకొని ఈ క‌థ‌ను చాలా అద్భుతంగా తెర‌కెక్కించారు సుధ కొంగ‌ర‌, ఇది మ‌నంద‌రి క‌థ అందుకే అంద‌రికీ త‌ప్ప‌క న‌చ్చుతుంద‌ని అని నేను బ‌లంగా న‌మ్ముతున్నాను. సుధ కొంగ‌ర – సూర్య గారు చెప్పిన‌ట్లుగా ఈ సినిమా మా టీమ్ అంద‌రికీ ఎంతో…

Read More

సంప‌త్‌నంది స్క్రిప్ట్‌తో కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తున్న‌`ఓదెల రైల్వేస్టేష‌న్` సెంకండ్ షెడ్యూల్ ప్రారంభం.

శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బేన‌ర్‌లో `ఏమైంది ఈవేళ`‌, `బెంగాల్ టైగ‌ర్` వంటి సూప‌ర్‌హిట్‌ చిత్రాల‌ను అందించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో  శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ రాధామోహ‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాత‌ కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ` ఓదెల రైల్వేస్టేష‌న్`. ఈ చిత్రం ద్వారా అశోక్ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమ‌వుతున్నారు. హీరోగా ద‌య‌విట్టు గ‌మ‌నిసి, 8MM బుల్లెట్,  ఇండియా vs ఇంగ్లాండ్‌, మాయ‌బ‌జార్ 2016, వంటి హిట్ చిత్రాల‌తో పాటు  క‌న్న‌డ‌లో 25 చిత్రాల‌కు పైగా న‌టించిన వ‌శిష్ట సింహ తెలుగులో హీరోగా న‌టిస్తోన్న మొద‌టి సినిమా ఇది. ఈ చిత్రంలో ప‌ల్లెటూరి అమ్మాయిగా ఒక వైవిద్య‌మైన పాత్ర‌లో హీరోయిన్ హెభా ప‌టేల్ న‌టిస్తోంది.  ‘ఓదెల’ అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఓ వైవిధ్యభరిత క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ చిత్రం…

Read More

సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా గతం ట్రైలర్ ను ఆవిష్కరించిన అమెజాన్ ప్రైమ్ వీడియో

వెన్నులో వణుకు పుట్టించే సైకలాజికల్ థ్రిల్లర్ ‘గతం’ డైరెక్ట్ టు డిజిటల్ వరల్డ్ ప్రీమియర్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో నేడిక్కడ ప్రకటించింది. రచన, దర్శకత్వం కిరణ్. అమెరికాకు చెం దిన విద్యార్థులు, ఐటీ వృత్తినిపుణులచే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ రూపొందించబడింది. మ్యాంగో మాస్ మీడియాతో కలసి ఆఫ్ బీట్ ఫిల్మ్స్, ఎస్ ఒరిజినల్స్ దీన్ని నిర్మించాయి. భార్గవ పొలుదాసు, రాకేశ్ గలిబె, పూజిత కూరపర్తి ప్రధాన పాత్రల్లో నటించారు. లేక్ టాహో నేపథ్యంలో రూపుదిద్దుకున్న గతం సినిమా అంతా కూడా కోమా నుంచి కోలుకున్నా, తన గతం మర్చిపోయిన ఓ వ్యక్తి చుట్టురా తిరుగుతుంది. తాను ఎవరో తెలుసుకునేందుకు ఆ వ్యక్తి చేసిన పోరాటం ఆయన జీవితంలో ఊహించని భయంకర సాహసాలకు దారి తీస్తుంది. భారత్ మరియు 200 దే శాలు, టెరిటరీస్ లలో ప్రైమ్ సభ్యులు గతం ప్రీమియర్ ను పండుగ చిత్రాల విడుదల సందర్భంగా నవంబర్ 6న ఎక్స్ క్లూజివ్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోపై చూడవచ్చు ఈ సందర్భంగా ఆసక్తిదాయకమైన ఈ వెంచర్ గురించి డైరెక్టర్ కిరణ్ మాట్లాడుతూ, ‘‘దర్శకత్వం అంటే నాకెంతో ఇష్టం. ప్రయోగాలు చేయడం, వివిధ ఫార్మాట్స్ లో రూపొందించడంపై ఆసక్తి కనబరుస్తాను. గతం సినిమాతో కథ చెప్పే భారతీయ శైలిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని, ఏదో ఒక కొత్తదనాన్ని వీక్షకులకు అందించాలని నేను కోరుకుంటున్నాను. గతం కథాంశం అంతా కూడా ఒక ఆసక్తిదాయకమైన ప్రశ్న చుట్టూరా ఉంటుంది. జీవితం పున:ప్రారంభం అయితే ఏం పరిస్థితి అనేదే ఆ ప్రశ్న. ఈ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీక్షకులకు అందుబాటులోకి రావడం నాకెంతో ఆనందదాయకం’’ అని అన్నారు.

Read More