ఘనంగా ‘అల్లుడు బంగారం’ షూటింగ్ ప్రారంభం

శ్రీ వెంకట లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ కుమార్, శ్రీ లక్ష్మీ హీరోహీరోయిన్లుగా.. వెంకట నరసింహ రాజ్ దర్శకత్వంలో లావణ్య చంద్రశేఖర్ నిర్మిస్తున్న ‘అల్లుడు బంగారం’ చిత్రం పూజా కార్యక్రమం హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నటుడు సుమన్ హీరోహీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా. కమెడియన్ పృథ్వి కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు సముద్ర తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం నటుడు సుమన్ మాట్లాడుతూ.. అల్లుడు బంగారం మూవీ ఇది ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్.. కరోనా స్టార్ట్ కాకముందు అంటే రెండు సంవత్సరాల క్రితమే దర్శక,నిర్మాతలు నాకు ఈ కథ చెప్పారు. వీరు చెప్పిన కథ మాకు ఎంతో నచ్చింది. రియల్ లైఫ్ లో ఫ్రెండ్స్ గా ఉన్న…

Read More