‘ఎనిమి’ ట్రైలర్ విడుదల

యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. వాడు వీడు తరువాత మరోసారి ఎనిమీ అంటూ ఈ ఇద్దరూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌కు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇక ఈ ఎనిమి సినిమా విశాల్‌కు 30, ఆర్యకు 32వ సినిమా కావడం విశేషం.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 100 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో సినిమా ఎలా ఉండోబోతోందో చూపించారు. బరిలోకి దిగితే మీ ఇద్దరు శత్రువులు.. ఆ తరువాత మిత్రులు అంటూ ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్‌తో ఈ సినిమా కథ ఏంటో అర్థమైంది. అయితే ఆర్య విశాల్‌కు ఎందుకు శత్రువుగా మారాల్సి…

Read More

‘జై భజరంగి’ థియేటర్లలో మాత్రమే చూడాల్సిన చిత్రం :నిరంజన్ పన్సారి

‘బాహుబలి’, ‘కె.జి.యఫ్’ సినిమా స్థాయిలో వస్తున్న మరో అద్భుత భారీ చిత్రం ‘జై భజరంగి 2’. ‘కరుండా చక్రవర్తి’ డా.శివ రాజ్ కుమార్ హీరోగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం కన్నడ, తెలుగు భాషలలో లో ఒకే సారి అక్టోబర్ 29న విడుదల అవుతుంది. కన్నడ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న డా.శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘భజరంగి’ 2013 లో కర్ణాటక రాష్ట్రం లో 212 థియేటర్లలో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలం సృటించింది. ఆ చిత్రానికి కొనసాగింపుగా కన్నడలో ‘భజరంగి 2’ తెలుగులో ‘జై భజరంగి’ గా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో విడుదల అవుతుంది. ఈ సందర్భంగా ఈ రోజు అక్టోబర్ 23 న ఉదయం ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్ లో ఈ చిత్రానికి…

Read More

తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామ‌ర్స్ ఎన్నికల నోటిఫికేష‌న్ విడుద‌ల‌

తెలంగాణ సినీ ప‌రిశ్ర‌మకు అండ‌గా, కార్మికుల సంక్షేమ స‌హ‌కారం కోసం ఏర్పాటైన తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ గ‌త 7 సంవ‌త్స‌రాలుగా విజ‌యవంతంగా ముందుకు సాగుతోంది. 8000 మంది సినీ కార్మికుల‌తో, 800 ప్రొడ్యూస‌ర్స్‌తో, 400 టీ మా ఆర్టిస్టులతో అభివృద్ధి ప‌థంలో ముందుకు న‌డుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు టిఎఫ్‌సిసి ద్వారా 140 సినిమాలు సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ అయ్యాయి. నిర్మాత‌ల‌కు అత్యంత సులువుగా ప్రాసెస్ జ‌రిపే సంస్థ‌గా టిఎఫ్‌సిసి ప్రాచుర్యం పొందింది. ఇక‌ ప్ర‌స్తుతం 30 మందితో కూడిన‌ టిఎఫ్‌సిసి పాల‌క‌ క‌మిటీ గ‌డువు ముగియ‌నుండ‌టంతో న‌వంబ‌ర్ 14న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు.ఈ సంద‌ర్భగా డా.ల‌య‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ…తెలంగాణ ఫిలించాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ స్థాపించి ఏడేళ్లు…

Read More

‘తెలంగాణ దేవుడు’ నవంబర్ 12న విదుదల

మ్యాక్ లాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై హరీష్ వడత్యా దర్శకత్వంలో మొహహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. ఉద్యమనాయకుడి పాత్రలో పబ్లిక్ స్టార్‌ శ్రీకాంత్‌ నటించగా.. జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్నారు. సంగీత, బ్రహ్మానందం, సునీల్‌, సుమన్‌, తనికెళ్ల భరణి వంటి 50 మంది అగ్ర నటీనటులు నటించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని నవంబర్ 12న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ శుక్రవారం చిత్రయూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. చరిత్ర సృష్టించిన వ్యక్తి పాత్రలో చేయడం నిజంగా గర్వంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు. కరోనా లాక్‌డౌన్ కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. నవంబర్…

Read More