ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాభవాన్ని తెలిపే డాక్యుమెంటరీ చిత్రం ప్రారంభం…

ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాభవాన్ని తెలిపే డాక్యుమెంటరీ చిత్రం ప్రారంభం…ఆంధ్రా విశ్వవిద్యాలయం 1926వ సంవత్సరం.లో మద్రాస్ యాక్ట్-1926 ప్రకారం స్థాపించబడింది. ప్రతిష్టాత్మక మైన ఆంధ్రా యూనివర్సిటీ ఏర్పడి 97 సంవత్సరాలు పూర్తిచేసుకుని, శత వార్షికోత్సవ దిశగా వెళుతున్న సందర్భంగా విశ్వ విద్యాలయ విశిష్టత, పూర్వ వైభవాన్ని,ప్రాశస్త్యాన్ని నేటి తరానికి తెలియజేయాలన్న సంకల్పంతో ” మైటీ ఆంధ్రా యూనివర్సిటీ మార్చింగ్ టువార్డ్స్ మార్క్ ఆఫ్ సెంటినరీ” పేరుతో ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ నిర్మాణానికి శ్రీకరం చుట్టారు.ఈ మహత్తర కార్యక్రమంలో భాగంగా డాక్యుమెంటరీ ఫిల్మ్ పోస్టర్ ను ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గౌరవ శ్రీ పి.వి.జి.డి.ప్రసాద రెడ్డి గారు తన ఛాంబర్ లో ఈరోజు ఆవిష్కరించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావులు నడయాడిన నేల, చదువుల తల్లి ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ప్రాశస్త్యాన్ని తెలియజేసేలా డాక్యుమెంటరీ నిర్మాణానికి ముందుకు వచ్చిన…

Read More