“అంతేనా..ఇంకేం కావాలి” అంగరంగ వైభవంగా ప్రారంభమైంది

అమ్మ కిచ్చిన మాటను ,అమ్మాయి కిచ్చిన మాటను హీరో ఎలా నెరవేర్చుకొన్నాడు అనే కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం “అంతేనా..ఇంకేం కావాలి”.పవన్ కళ్యాణ్ బయ్యాను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ హై బ‌డ్జెట్‌తో శ్రీ వెంకటలక్ష్మి నరసింహ ప్రొడక్షన్ బ్యాన‌ర్‌పై వెంకట నరసింహా రాజ్ దర్శకత్వంలో రవీంద్ర బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ” ఝాన్వీ శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రం పూజా కార్యక్రమాలు సోమవారం రోజున హైద‌రాబాద్‌ లోని రామానాయుడు స్టూడియో లో సినీ అతిరధుల సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సీనియర్ నటులు మురళీ మోహన్ గారు హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నటుడు దగ్గుపాటి అభిరామ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్క్రిప్ట్ ను నటుడు ఘర్షణ…

Read More

జూలై 8 న “మా నాన్న నక్సలైట్”

చదలవాడ బ్రదర్స్ సమర్పణలో అనురాధ ఫిలిమ్స్ డివిజన్ పతాకం పై పీ. సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడిగా చదలవాడ శ్రీనివాస్ నిర్మించిన “మా నాన్న నక్సలైట్” చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులై 8న విడుదలకు సిద్ధంగా ఉంది. తొంభై వ దశకంలో ని సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాగే ఒక నక్సలైట్ తండ్రి కథ. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడైన రఘు కుంచే కొండరుద్ర సీతారామయ్య పాత్రను పోషించారు. నటుడు అజయ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అలాగే సుబ్బరాజు రాజకీయ నాయకుడు పాత్రలో నటించగా జర్నలిస్ట్ సూర్య ప్రకాష్ రావు పాత్రలో ఎల్ బి శ్రీరామ్ నటించారు. యువ జంటగా కృష్ణ బూరుగుల, రేఖ నిరోషా నటించిన ఈ చిత్రానికి సంగీతం అందించింది ప్రవీణ్ ఇమ్మడి.…

Read More