తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్ కుమార్ గెలుపు

ఆదివారం జరిగిన తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ ఎలక్షన్స్ లో అధ్యక్షుడు గా వల్లభనేని అనిల్ కుమార్ గెలుపొందారు. ఫిలిం ఫెడరేషన్ లో మొత్తం 72 ఓట్లు ఉండగా..వీటిలో 66 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఓట్లలో వల్లభనేని అనిల్ కు 42, కొమర వెంకటేష్ కు 24 ఓట్లు వచ్చాయి. 18 ఓట్ల ఆధిక్యంతో వల్లభనేని అనిల్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. కోశాధికారిగా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు. 66 ఓట్లలో ఆయనకు 42 ఓట్లు వచ్చాయి. పీఎస్ ఎన్ దొర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఫిలిం ఫెడరేషన్ నూతన అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడుతూ…దర్శకరత్న దాసరి గారు ఫిలి ఫెడరేషన్ ఏ ఆశయాలతో కొనసాగించారో, అవే ఆశయాలతో మేము సినీ కార్మిక వర్గాన్ని సంక్షేమ బాటలో తీసుకెళ్తాం. సినీ కార్మిక ఐక్యత…

Read More

తెలంగాణ రాష్ట్ర డిఐజి సుమతి చేతుల మీదుగా సుంద‌రాంగుడు టీజ‌ర్ లాంచ్‌

    ఎమ్ ఎస్ కె ప్ర‌మిద శ్రీ  ఫిలింస్ ప‌తాకంపై  అనిశెట్టి వెంక‌ట సుబ్బారావు స‌మ‌ర్ప‌ణ‌లో బీసు చంద‌ర్ గౌడ్‌, ఎమెఎస్‌కె రాజు నిర్మాత‌లుగా  కృష్ణ సాయి,  మౌర్యాని హీరో హీరోయిన్లుగా ఎమ్‌.విన‌య్ బాబు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న  రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ సుంద‌రాంగుడు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు  జ‌రుగుతున్నాయి.  ఇటీవ‌ల చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ తెలంగాణ రాష్ట్ర డిఐజి సుమతి చేతుల మీదుగా ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో కృష్ణ సాయి పాల్గొన్నారు. టీజ‌ర్ రిలీజ్ చేసిన అనంత‌రం తెలంగాణ రాష్ట్ర డిఐజి సుమతి మాట్లాడుతూ…కృష్ణ సాయి హీరోగా న‌టించిన సుంద‌రాంగుడు టీజ‌ర్ ఆక‌ట్టుకునే విధంగా ఉంది.  టీజ‌ర్ లో కృష్ణ సాయి న‌ట‌న బావుంది. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మ‌రియు ఇత‌ర సాంకేతిక నిపుణులంద‌రికీ ఈ…

Read More

ఆమోజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న “శుక్ర”

ఈ ఏడాది థియేటర్లలో రిలీజైన చివరి సినిమా “శుక్ర”. మైండ్ గేమ్ నేపథ్యంలో థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. చిన్న చిత్రాల్లో పెద్ద విజయంగా నిలిచింది. “శుక్ర” సినిమాలో అరవింద్ కృష్ణ, కొత్త అమ్మాయి శ్రీజితా ఘోష్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి చిత్రంతో దర్శకుడిగా మెప్పించారు సుకు పూర్వజ్. నిర్మాతలు అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె లకు లాభాలు తెచ్చిపెట్టిన “శుక్ర” తాజాగా అమోజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం అమోజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది “శుక్ర”. థియేటర్లలో ఈ యూత్ ఫుల్ థ్రిల్లర్ ను మిస్ అయిన వారు అమోజాన్ లో చూసి ఎంజాయ్ చేయమని చిత్ర బృందం ప్రేక్షకులను రిక్వెస్ట్ చేస్తోంది.

Read More

జూబ్లీ హిల్స్ స్కాం లో అసలు నిజాలు ఏంటి..!!

ఒక వ్యక్తి ఎదుగుతుంటే తొక్కేయడం మన బడా బాబులకు అలవాటే.. ఒకడు మంచి పని చేసిన, ప్రజల్లో ఆదరణ దక్కించుకుంటున్న ఎందుకో ఎక్కడలేని అసూయా, ఈర్ష్య ద్వేషాలు వస్తాయి.. అలాంటి వ్యక్తి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. NTV founder Tummala Narendra Chowdary మీడియా రంగంలో ఎనలేని సేవలందించిన విషయం మనకు తెలిసిందే. జర్నలిజానికి నిలువెత్తు రూపంగా ఆయనని అభివర్ణిస్తారు పాత్రికేయులు.. అలాంటి అయన పై బురదచల్లే ప్రయత్న చేస్తున్నారు.. అయన ఎదుగుదలను ఓర్వలేక అక్రమ కేసులు దౌర్జన్యంగా బనాయించి అయన ఇమేజ్ ని తగ్గించే ప్రయత్న చేస్తున్నారు.. ప్రధానంగా ఓ స్కాం లో అయన పేరు ఎక్కువగా వినపడుతుంది.. అదే జూబ్లీ హిల్స్ స్కాం.. ఇప్పటివరకు క్లీన్ చీట్ గా ఉన్న చౌదరి గారి పేరు తెర మీదకు హఠాత్తుగా రావడానికి అనేక కారణాలున్నాయి.…

Read More

సూప‌ర్‌స్టార్ మ‌హేష్, స్టార్‌డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో హారిక హాసిని క్రియేషన్స్ భారీ చిత్రం

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అత‌డు 16ఏళ్లుగా, ఖ‌లేజా 11ఏళ్లుగా ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్ని అల‌రిస్తూనే ఉన్నాయి. రిపీటెడ్‌గా ఈ ఎవ‌ర్‌గ్రీన్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌ని చూసి ఎంజాయ్ చేస్తున్నవారంద‌రూ ఈ సూప‌ర్ కాంబినేష‌న్‌లో రాబోయే కొత్త సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. 11ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో మ‌రో బిగ్గెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ రాబోతుంద‌న్న న్యూస్ ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎంతో ఆస‌క్తిని రేపుతోంది.సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో హారిక హాసిని క్రియేషన్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ‌(చిన‌బాబు) ఒక భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన‌రోజైన మే31న పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం అయ్యే ఈ చిత్రం 2022 స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా రిలీజ‌వుతుంది. ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాల‌తో మ‌హేష్-త్రివిక్ర‌మ్‌ల హ్యాట్రిక్ మూవీగా రూపొందే ఈ చిత్రానికి…

Read More

OTT లో కొత్త సినిమా

రానా సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం విరాట పర్వం చిత్ర దర్శకుడు వేణు అడుగుల చేతుల మీదుగా శ్రీ శివ భవాని సినిమా ప్రొడక్షన్స్ రెండవ చిత్రం ” iam మీరా ” టీజర్ విడుదల చేశారు ఇందులో ప్రిన్స్ దివ్యంగాన హీరో హీరోయిన్స్ గా చిత్ర డైరెక్టర్ గోపాల కళా కృష్ణ జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన గుగ్గిళ్ల శివ ప్రసాద్ నిర్మాణంలో అనుభవం ఉన్న నిర్మాతగా గత చిత్రం జాబిల్లీ కోసం ఆకాశ మల్లె చిత్రం చేశాను , ఇది నాకు రెండవ చిత్రం ” iam మీరా ” సస్పెన్స్ ద్రిల్లర్ మూవీ (మూవీ) చాల బాగా వచ్చింది ఈ చిత్రం త్వరలో OTT లో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో.. హీరో గా ప్రిన్స్ , హీరోయిన్ దివ్యంగానా తదితరులు…

Read More

డబ్బింగ్ ఆర్టిస్ట్ ను ఆదుకున్న “మనం సైతం”

నిరంతర సేవా కార్యక్రమం మనం సైతం మరో ఆపన్నురాలికి అండగా నిలిచింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆరాధన పెండెం ఇటీవల రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు, చేయి విరిగి తీవ్రంగా గాయపడ్డారు. ఆమె పరిస్థితి తెలుసుకున్న మనం సైతం నిర్వాహకులు కాదంబరి కిరణ్ ఆరాధన కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. మనం సైతం సంస్థ నుంచి 25 వేల రూపాయలను ఇవాళ ఆరాధన పెండెం కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కష్టకాలంలో తమను ఆదుకున్న మనం సైతం కాదంబరి కిరణ్ గారికి ఆరాధన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నిస్సహాయులను, పేదలను ఆదుకునేందుకు ఒక జీవనదిలా మనం సైతం సేవా కార్యక్రమం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా మనం సైతం ఫౌండర్ కాదంబరి కిరణ్ అన్నారు.

Read More

సంపత్ కుమార్ సమర్పిస్తోన్న ‘లాల్ బాగ్’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

రాజమౌళి, ఎన్టీఆర్ ల మూవీ యమదొంగ ఫేమ్ మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘లాల్ బాగ్’. ఐటి బ్యాక్ డ్రాప్ లో సాగే థ్రిల్లర్ జానర్ లో రాబోతోన్న ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో అనువదిస్తున్నారు. సంపత్ కుమార్ సమర్పణలో సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్ బ్యానర్ పై రాజ్ జకారియా నిర్మిస్తోన్న ఈ మూవీ తెలుగు టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.చాలా రోజుల తర్వాత మమతామోహన్ దాస్ ఓ బలమైన పాత్రలో కనిపించబోతోందీ చిత్రంతో. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే అంశాలతో వస్తోన్న ఈ మూవీలో మమతా మోహన్ దాస్ తో పాటు నందినిరాయ్, సిజోయ్ వర్ఘిస్, రాహుల్ దేవ్…

Read More

శుక్ర సినిమా సమీక్ష

థ్రిల్లర్ మూవీస్ సరిగ్గా కుదిరితే సూపర్ హిట్ దక్కినట్లే. కొత్త దర్శకులు తమ ఇన్నోవేటివ్ ఆలోచనలతో ఇలాంటి థ్రిల్లర్ సినిమాలను ఆకట్టుకునేలా తెరకెక్కిస్తుంటారు. అలా డెబ్యూ డైరెక్టర్ సుకు పూర్వజ్ రూపొందించిన చిత్రమే శుక్ర. థ్రిల్లర్ లో ఓ పార్ట్ అయిన మైండ్ గేమ్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ జంటగా నటించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన శుక్ర సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం కథ విశాఖ నగరంలో థగ్స్ అనే మాఫియా ముఠా వరుస నేరాలకు పాల్పడుతుంటుంది. డబ్బున్న కుటుంబాలను హతమార్చి లూటీలు చేస్తుంటారు. నగరం నేరమయంగా ఉన్నప్పుడు ఇక్కడికి భార్యతో కలిసి వస్తాడు విల్లి.విలియమ్ అలియాస్ విల్లి (అరవింద్ కృష్ణ) ఒక బిజినెస్ మెన్. సొంత కంపెనీ నడుపుతుంటాడు. అతని అందమైన వైఫ్ రియా (శ్రీజిత…

Read More

ఆస్ట్రేలియా లో ఘనంగా ప్రారంభం అయిన అగ్రజీత

రాహుల్ కృష్ణ మరియు ప్రియాంక నోముల హీరో హీరోయిన్ గా సందీప్ రాజ్ దర్శకత్వం లో సందీప్ రాజ్ ఫిలిమ్స్ మరియు వాసవి త్రివేది ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం అగ్రజీత. ఈ చిత్రాన్ని ఆస్ట్రేలియా దేశంలో డాండెనాంగ్ సిటీలోని శివ విష్ణు ఆలయం లో ఘనంగా ప్రారంభించారు. ఈ అగ్రజీత చిత్రాన్ని ఆద్యంతం ఆస్ట్రేలియా లోనే చిత్రీకరిస్తారు. ఈ సందర్భంగా దర్శకుడు సందీప్ రాజ్ మాట్లాడుతూ “అగ్రజీత ఒక భిన్నమైన కథ. ఒక జీవి మరణం అనంతరం తన జ్ఞాపకాలను అణువు ద్వారా మరో జీవి లోకి వెళ్లే ఒక శాస్త్రీయ కథ. మంచి కథ తో మంచి గ్రాఫిక్ విలువలతో చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఈ చిత్రాన్ని మొత్తం ఆస్ట్రేలియా దేశంలోనే చిత్రీకరిస్తాం. రాహుల్ కృష్ణ మరియు ప్రియాంక నోముల హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు.…

Read More