మన నందమూరి ఫాన్స్ గోపీచంద్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా బాలయ్య పుట్టిన రోజు వేడుకలు

నందమూరి బాలకృష్ణ 61వ జన్మదిన వేడుకలను యిన్నమూరి గోపీచంద్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హీరోగానే కాక, ఎమ్మెల్యేగానూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తోన్న బాలయ్య నుంచి స్ఫూర్తి పొంది అభిమానులు కూడా అదే తరహాలో ఆయన బర్త్ డే వేడుకలను నిర్వహించారు. ఇందుకోసం హైదరాబాద్ కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్ ఆవరణలో 500మంది నిరుపేదలకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ను అందించారు. బాలయ్య వీరాభిమాని అయిన యిన్నమూరి గోపీచంద్ ఫ్రెండ్ సర్కిల్ ఈ కార్యక్రమాన్ని మంచి సేవాతత్పరతతో నిర్వహించి శెభాష్ అనిపించుకుంది.బాలకృష్ణ జన్మదిన వేడుకలతో పాటు ఉచిత వ్యాక్సిన్ పంపకం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు మందడి శ్రీనివాసరావు, నార్నే శ్రీనివాసరావు పాల్గొన్నారు. వీరితో పాటు బాలకృష్ణ తర్వాతి చిత్ర…

Read More

విక్రమ్’లోని పడిపోయా పడిపోయా పాటను విడుదల చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్

‘విక్రమ్’ చిత్రంలోని “పడిపోయా పడిపోయా….” అంటూ సాగే రెండవ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ విడుదల చేశారు. *నాగవర్మ బైర్రాజును హీరోగా పరిచయం చేస్తూ, హరిచందన్ దర్శకత్వంలో* ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. *హీరో నాగవర్మ బైర్రాజు సరసన *దివ్యాసురేశ్ కథానాయికగా నటించింది.** కాగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో *శనివారం ఈ చిత్ర హీరో, నిర్మాత నాగవర్మ బైర్రాజు పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను హైదరాబాద్ లో విడుదల చేశారు.* * అనంతరం ముఖ్య అతిథి *శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ,* “ఒకప్పుడు ప్రముఖ హీరో నాగార్జున గారు “విక్రమ్” అనే పేరు గల చిత్రంతో పరిచయమయ్యారు. అదే టైటిల్ తో వస్తున్న హీరో నాగవర్మకు కూడా ఈ తొలి చిత్రం మంచి విజయాన్ని అందించి……

Read More

మా “తీరం” చిత్రంలోని పాటలు ఎస్.పి. బాలు గారికి అంకితం- దర్శక-నిర్మాత అనిల్ ఇనమడుగు!!

గాన గంధర్వుడు స్వర్గీయ శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా.. “తీరం” చిత్రంలోని పాటలన్ని ఆయనకు అంకితం చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.. తీరం చిత్రంలోని ఆయన పాడిన చివరి పాట “అసలేంటీ ప్రేమా” పాటతోబాటు, చిత్రంలోని మిగిలిన 8 పాటలను కూడా ఎస్.పి. బాలూ గారికి అంకితం చేశారు. ఆయన సృతికి అంకితం చేసిన ఈ పాటలను ఏ ఆడియో కంపెనీకీ అమ్మకుండా, శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులకోసం పూర్తి ఉచితంగా “ఫ్రీ టు ఎయిర్” గా విడుదల చేశారు. ఈ సందర్బంగా జూన్ 4న హైదరాబాద్ జూబ్లీహిల్స్ సినెటేరియా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో “తీరం” సినిమా హీరో శ్రావణ్ వైజిటి, మరో హీరో మరియు దర్శకులు అనిల్ ఇనమడుగు, హీరోయిన్ క్రిష్టెన్ రవళి, సినెటేరియా అధినేత వెంకట్ బులెమోని, సినెటేరియా…

Read More

రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న “తీరం” మోషన్ పోస్టర్ విడుదల!!

అకి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు, క్రిష్టెన్ రవళి, అపర్ణ హీరో, హీరోయిన్లుగా  అనిల్ ఇనమడుగు దర్శక,నిర్మాతగా రూపొందిస్తున్న రొమాంటిక్  థ్రిల్లర్ చిత్రం “తీరం”. ఈ చిత్రం టైటిల్,  మోషన్ పోస్టర్ ను మే 30న హైదరాబాద్  ఫిలిం నగర్లోని దైవ సన్నిధానంలో చిత్ర యూనిట్ ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో  తీరం సినిమా హీరో మరియు దర్శకులు అనిల్ ఇనమడుగు, హీరోయిన్ క్రిష్టెన్ రవళి, సినెటేరియా అధినేత వెంకట్ బులెమోని, మై విలేజ్ షో అనిల్, అజయ్ సన్నపు, విజయం పన్నేరు, అజస్ జాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత అయిన అనిల్ ఇనమడుగు మాట్లాడుతూ- ‘ పూర్తి స్థాయి సంగీతం మరియు సస్పెన్స్ తో  కూడిన రొమాంటిక్  ప్రేమకథాచిత్రంగా తీరం సినిమాని రూపొందించాం.  సినిమా అంతా  ఒక హృద్యమైన…

Read More

అల‌జ‌డి సృష్టిస్తున్న ఇంట్రో ఆఫ్ కృష్ణ‌లంక వీడియో…

రంగు సినిమాతో ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన ముద్ర‌ను వేసిన కార్తికేయ ద‌ర్శ‌క‌త్వంలోపరుచూరు రవి, నరేష్ మేడి,ఆదర్శ్,పెద్దిరాజు, ప్రతీక్ష,అనిత భట్ నటీనటులుగా సోహ్లా ప్రొడక్షన్స్ , చేతన్ రాజ్ ఫిలిమ్స్ లు కలసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం కృష్ణలంక. నిర్మాత పూనా సోహ్లా పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇంట్రో ఆఫ్ కృష్ణ‌లంక వీడియోని విడుద‌ల చేసింది టీం.టీజ‌ర్ లు, ట్రైల‌ర్ ల‌కు భిన్నంగా ప్ర‌తి క్యారెక్ట‌ర్ యెక్క ఎమోష‌న్ ని ప‌లికించిన ఈ మూడు నిముషాల వీడియో లో అన్ని పాత్ర‌లు తీరు తెన్నుల‌ను ప‌రిచ‌యం చేసాడు ద‌ర్శ‌కుడు. హైటెక్నిక‌ల్ వాల్యూస్ తో నిర్మించిన కృష్ణ‌లంక, ప్రేమ‌కు ప‌గ‌కు మ‌ద్య జ‌రిగే యుద్దాన్ని ప‌రిచ‌యం చేసింది. ప‌రుచూరి వెంక‌టేశ్వ‌రావు కుమారుడు ప‌రుచూరి ర‌వి పాత్ర ఈ సినిమాలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. అంతా కొత్త వారితో కార్తికేయ ఈ సినిమాను…

Read More

సంజయ్ రావ్ హీరోగా నేహా ఆర్ట్ ప్రొడక్షన్స్ చిత్రం !

ఓ పిట్టకథ సినిమాలతో హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ హీరోగా వి.ఎస్. ఫణీంద్రన్ దర్శకత్వంలో నేహా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై ప్రొడ్యూసర్ కమ్మరి.రవికుమార్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెo.1 చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో షూటింగ్ మొదలు కాబోతుంది. సంజయ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా రోహిణి ముంజల్, సాధన నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో రాజా రవీంద్ర, ప్రబాస్ శ్రీను, హేమ, ప్రగతి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం అయ్యే ఈ సినిమా గురించి నిర్మాత రవికుమార్ మాట్లాడుతూ … ప్రతి ఒక్కరి జీవితంలో అవసరమైనది ప్రేమా? పెళ్ళా? అనే కధాంశంతో, లవ్ అండ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ గా తెరకెక్కించే సన్నాహాలు చేస్తున్నాము, కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గిన తరువాత…

Read More

సంజయ్ రావ్ హీరోగా ”గుట్టు చప్పుడు” చిత్రం మోషన్ పోస్టర్ మరియు ఫస్ట్ లుక్ విడుదల

ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు , ఓ పిట్ట కథ ఫేమ్ సంజయ్ రావ్ హీరోగా కొత్త దర్శకుడు మణీంద్రన్ దర్శకత్వంలో డాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత లివింగ్ స్టన్ నిర్మిస్తున్న చిత్రం గుట్టు చప్పుడు. నేడు మే 29న హీరో సంజయ్ రావ్ పుట్టిన రోజు సందర్బంగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ ని సంతోషం స్టూడియోలో ఆవిష్కరించారు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యుల మధ్య హీరో సంజయ్ రావ్ కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం .. చిత్ర హీరో సంజయ్ రావ్ మాట్లాడుతూ .. నా పుట్టినరోజున ఇలా టీం సభ్యుల సమక్షంలో వేడుక జరుపుకోవడం.. అలాగే ఫస్ట్ లుక్ విడుదల చేయడం చాలా కొత్తగా ఉంది .. గుట్టు…

Read More

నిర్మాతగా ఈ ఏడాది పెద్ద సక్సెస్‌ కొడతాను– యం. రాజశేఖర్‌ రెడ్డి

తమిళంలో మంచి విజయాలు సొంతం చేసుకున్న ‘ప్రేమలో పడితే’, ‘నకిలీ’ చిత్రాలను తెలుగులోకి అనువదించి నిర్మాతగా తొలి అడుగులను వేశాను. తర్వాత ప్రముఖ దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వంలో ‘శైవం’ చిత్రాన్ని నిర్మించి పెద్ద విజయాన్ని రుచి చూశాను, తెలుగులో ‘త్రిపుర’ చిత్రాన్ని తెరకెక్కించటంతో పాటు ‘దిల్‌’ రాజు నిర్మాతగా వేణుశ్రీరామ్‌ దర్శకత్వంలో విడుదలైన చిత్రం ‘ఓ మై ఫ్రెండ్‌’ చిత్రాన్ని ‘శ్రీధర్‌’ అనే పేరుతో తమిళంలో విడుదల చేశాను. తెలుగులో మంచి సినిమాగా పేరు తెచ్చుకున్న ‘కేరాఫ్‌ కంచెరపాలెం’ చిత్రాన్ని తమిళంలో ‘కేరాఫ్‌ కాదల్‌’ గా రీమేక్‌ చేసి ఫిబ్రవరి 12న విడుదల చేశాను అన్నారు నిర్మాత రాజశేఖర్‌ రెడ్డి. మే 29 రాజశేఖర్‌ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ–‘‘ నేను ఎప్పుడు తెరముందుకు రావటానికి ఇష్టపడను. ఈ సారి ఎందుకు మీడియా ముందుకు రావాల్సి…

Read More

నిర్మాణానంతర కార్యక్రమాల్లో అనగనగా ఒక రౌడీ

వైవిధ్యమైన చిత్రాలతో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం అనగనగా ఒక రౌడీ మను యజ్ఞ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏక్‌దోత్రీన్ ప్రొడక్షన్స్ పతాకంపై గార్లపాటి రమేష్, డా.టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు.చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది. సుమంత్ కెరీర్‌లో ఇదొక వైవిధ్యమైన చిత్రం. సుమంత్ పాత్ర పూర్తి రొటిన్‌కు భిన్నంగా వుంటుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఆయన పాత్ర తప్పకుండా నచ్చుతుంది.వాల్తేరు శీనుగా, విశాఖపట్నం రౌడీగా ఆయన అభినయం అందర్ని అలరించే విధంగా వుంటుంది. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో ఐమా నాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అని తెలిపారు. మధునందన్, ధన్‌రాజ్, కళ్యాణ్ చక్రవర్తి, హైపర్ ఆది, మిర్చి కిరణ్, ప్రభ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి…

Read More

నల్లమల లాంటి స్వచ్ఛమైన క్యారెక్టర్ లో అమిత్

పలు సూపర్ హిట్ చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించి పేరు తెచ్చుకున్నారు అమిత్ తివారీ. తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ తో కుటుంబ ప్రేక్షకులందరికీ మరింత దగ్గరయ్యారీ నటుడు. అమిత్ తివారీ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం నల్లమల. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో ఇన్నోవేటివ్ స్టోరీ, స్క్రీన్ ప్లే తో ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు రవి చరణ్. నల్లమల అటవీ ప్రాంతపు వాస్తవ ఘటనలు ఈ కథలో చూడబోతున్నాం. నల్లమల నుంచి హీరో అమిత్ తివారీ లుక్ ను తాజాగా విడుదల చేశారు. ఈ లుక్ లో అమిత్ ఇంటెన్స్ గా కనిపిస్తున్నారు. అతని కోపానికి, ఉద్వేగానికి కారణమేంటి అనేది సినిమాలో చూడాలి. నల్లమల ప్రాంతపు జీవన విధానం అమిత్ క్యారెక్టర్ రూపురేఖల్లో కనిపిస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు రవి చరణ్ మాట్లాడుతూ…నల్లమల భూమి…

Read More