‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంలో ‘అమృత..’ సాంగ్‌ను విడుద‌ల చేసిన మెగాస్టార్ చిరంజీవి

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌`. సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమా నుండి ‘అమృత‌… ’ అనే సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. సాయితేజ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సాంగ్ విడుద‌లైంది. మెగాస్టార్ చిరంజీవి  ఈ సాంగ్‌ను ట్విట్ట‌ర్‌లో విడుద‌ల చేస్తూ  సాయితేజ్‌కు పుట్టిన‌రోజు అభినంద‌న‌లు తెలిపారు. ‘ఇదే నా బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్. ఈ బర్త్‌డేను స్పెష‌ల్ బ‌ర్త్‌డే చేసిన మావ‌య్య‌కు థాంక్స్‌. మీ ఆశీర్వాదాలకంటే నాకింకేం అక్క‌ర్లేదు. థాంక్యూ సోమ‌చ్ మామ‌య్య‌’ అంటూ సాయితేజ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.  మ్యూజిక్ సెన్సేషన్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో…

Read More

‘నేక్ డ్’ ఫేమ్ ‘శ్రీ రాపాక’ కొత్త వెబ్ మూవీ ”ద లస్ట్, ఎ మర్డర్ మిస్టరీ”

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘నేక్ డ్’ ఫేమ్ ‘శ్రీ రాపాక’ నటిస్తున్న కొత్త వెబ్ మూవీ ”ద లస్ట్, ఎ మర్డర్ మిస్టరీ”. థర్డ్ ఐ సినిమాస్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. ‘ఎస్ కే ఎన్’ దర్శకత్వం వహిస్తున్నారు. అశోక్ షిండే ”ద లస్ట్, ఎ మర్డర్ మిస్టరీ” మూవీకి కథను అందిస్తూ నిర్మిస్తున్నారు. ఈ వెబ్ మూవీలో అమిత్ తివారీ, శ్రీ గగన్, ఛత్రపతి శేఖర్, ఆనంద్ భారతి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఎక్స్ ట్రా మారిటల్ అఫైర్స్ అండ్ క్రైమ్’ నేపథ్యంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే విధంగా ”ద లస్ట్, ఎ మర్డర్ మిస్టరీ” చిత్రం ఉండబోతోంది. ఈ మూవీ మేకింగ్ క్వాలిటీ ఆకట్టుకునేలా ఉంటుంది. ”ద లస్ట్, ఎ మర్డర్ మిస్టరీ” సినిమా ట్రైలర్ బుధవారం సాయంత్రం…

Read More

జిఎస్‌టి మూవీ లోగో పోస్ట‌ర్ లాంచ్‌

తోలుబొమ్మ‌ల సిత్రాలు బ్యాన‌ర్ పై కొమారి జాన‌కిరామ్ ద‌ర్శ‌క‌త్వంలో కొమారి జాన‌య్య‌నాయుడు నిర్మిస్తున్న చిత్రం జిఎస్‌టి (god saithan technology). ఈ చిత్ర లోగో పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ సినీజోష్ ఆఫీస్ లో లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో ద‌ర్శ‌కుడు జాన‌కిరామ్ మాట్లాడారు… తోలు బొమ్మ‌ల సిత్రాలు బ్యాన‌ర్ పై ఈ చిత్రం లోగోను లాంచ్ చేయ‌డం ఆనందంగా ఉంది అన్నారు. నేను మొద‌ట్లో ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశాను. జిఎస్‌టి నా మొద‌టి చిత్రం. నేను విద్యార్ధి ద‌శ‌లో ఉన్న‌ప్ప‌టినుంచి నా మ‌దిలో మెలుగుతున్న ఆలోచ‌న ఇది. దేవుడు, దెయ్యం, సైన్స్ వీటికి సొల్యూష‌న్ దొర‌క‌డం లేదు. ఏది నిజం ఏది అబద్ధం అని నా మ‌దిలో మెదిలే ప్ర‌శ్న ఇది. ఆ కోవ‌లోనే ఎన్నో దేవాల‌యాలు, ఎన్నో స్మ‌శానాలు…

Read More

ఇలాంటి సందేశాత్మక చిత్రాలు మరిన్ని రావాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

నవీన్ చంద్ర, నాగబాబు, జయప్రకాశ్ ముఖ్య పాత్రల్లో కరణం బాబ్జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విజన్ 2020. హనీ బన్నీ క్రియేషన్స్, మధు మృద్దు ఎంటర్ టైనేమెంట్స్, శ్రీ మిత్ర & మై విలేజ్ సమర్పణలో కుంట్లూరు వెంకటేష్ గౌడ్, కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ ఎక్సయిజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్, మాజీ డిజిపి గోపినాధ్ రెడ్డిలతో పాటు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ట్రైలర్ విడుదల చేసిన అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ .. ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంతగా పెరిగిందో , చెడు ప్రభావం కూడా అంతే పెరిగింది.…

Read More

తెలుగుతో పాటు హిందీ ప్రేక్షకుల నుంచీ ‘ఎక్స్‌పైరీ డేట్‌’కి మంచి స్పందన లభిస్తోంది!– మధు షాలిని

స్నేహా ఉల్లాల్, టోనీ లూక్, మధు షాలిని, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘ఎక్స్‌పైరీ డేట్’‌.  శంకర్ కె. మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. నిర్మించింది. తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిన మొట్టమొదటి బైలింగ్వల్ వెబ్ సిరీస్ ఇది. ‘జీ 5’లో అక్టోబర్ 2న హిందీ వెర్షన్, అక్టోబర్ 9న తెలుగు వెర్షన్ ఎక్స్ క్లూజివ్ గా విడుదలైంది. దీనికి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో తెలుగు మీడియాతో మధు షాలిని ప్రత్యేకంగా ముచ్చటించారు. – ‘ఎక్స్‌పైరీ డేట్‌’కి ఎటువంటి స్పందన లభిస్తోంది?తెలుగు, హిందీ బైలింగ్వల్‌ వెబ్‌ సిరీస్‌ ఇది. సౌతిండియన్‌ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎక్కువ పని చేశారు. అందుకని, హిందీలో సౌత్‌ సిరీస్‌ అని అనుకున్నారు. కానీ, సిరీస్‌ చూశాక చాలామంది మెసేజ్‌లు చేశారు. బావుందని మెచ్చుకున్నారు. కొంతమంది దర్శకులు…

Read More

తెలుగు న‌వ‌ల‌ని.. హాలీవుడ్ నిర్మాణ సంస్థ కొనుగోలు!

ప్రముఖ తెలుగు రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవల ఆనందో బ్రహ్మ నవల సినిమా హక్కులను అమెరికాలో స్థిరపడ్డ ప్రముఖ తెలుగు దర్శక నిర్మాత ముక్తేశ్‌ రావు మేక‌ సొంతం చేసుకున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో మూడు హాలీవుడ్ సినిమాలు నిర్మిస్తున్న ఆయన ఆనందో బ్రహ్మ నవలను తెరకెక్కించే ఆలోచనలో హక్కులు సొంతం చేసుకున్నారు. 1729 పిక్చ‌ర్స్ హాలీవుడ్ ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ మీద‌ ఈ సినిమాను నిర్మిస్తున్న‌ది. మనుషుల మధ్య సంబంధాలను, ఆత్మీయానుబంధాలను పలికించిన ఈ నవల త్వరలో చిత్రరూపంలో తెరపై అలరించనుంది. ఓం పల్లెటూరి యువకుడు పట్నం వస్తే.. అతడిని ఓ గృహిణి సేద తీరుస్తుంది. వారిద్దరి మధ్య ఉన్నది ఏంటి? ప్రేమా? ఆకర్షణా? అనుబంధమా? సెక్సా? అనే ఆకట్టుకునే కథనంతో యండమూరి ఈ నవల అల్లారు. ఆత్మీయానుబంధాల కలబోతగా కల ఈ నవలను…

Read More

బంజారా సినీ పరిశ్రమ ‘బంజారావుడ్’ ప్రారంభం!

భారతదేశం సంప్రదాయాలకు, వేశధారణకు పుట్టినిల్లు. అలాంటి భారతదేశంలో 15 కోట్ల 50 లక్షల మంది బంజారాలు ఉన్నారు. ఈ బంజారా ప్రజలు ప్రతి రంగంలో ముందున్నారు. అలాంటి వారు సినిమా రంగంలో కూడా ముందు ఉండాలనే ఉద్దేశంతో గోర్ జీవన్ సినిమాలు తనకంటూ ఒక స్థానం సంపాదించాలనుకున్న కెపిఎన్. చౌహన్ తన బంజారా ప్రజలకు ఒక సినిమా పరిశ్రమ కావాలంటూ కష్టపడి బంజారా ఫిలిం ఇండస్ట్రీని స్థాపించారు. ఇది ప్రతి బంజారా బిడ్డలు చెప్పుకోదగ్గ విషయం.8 నుండి 10 కోట్ల జనాభా ఉన్న ఏపి – టిఎస్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఉంది. అలాగే నాలుగు కోట్ల చిల్లర ఉన్న కెనడా ప్రజలకు కెనడా ఇండస్ట్రీ ఉంది. రెండు కోట్ల జనాభా ఉన్న భోజ్ పూరి ప్రజలకు సినిమా ఇండస్ట్రీ ఉంది. అలాంటిది దేశం మీద 15 కోట్ల…

Read More

నిర్మాత ప్రసన్న కుమార్ చేతుల మీదుగా “అన్నపూర్ణమ్మగారి మనవడు” ట్రైలర్ విడుదల!

ఎమ్మెన్నార్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించబడిన పదహారణాల తెలుగు సినిమా “అన్నపూర్ణమ్మ గారి మనవడు”. ఈ చిత్రానికి నిర్మాత ఎమ్మెన్నార్ చౌదరి గారు, దర్శకుడు నర్రా శివనాగేశ్వర రావు (శివనాగు). ఈ చిత్రం సెన్సార్ బోర్డ్ నుండి క్లీన్ సర్టిఫికెట్ పొంది విడుదలకి సిద్ధంగా ఉన్నది. లాక్ డౌన్ ఎఫెక్ట్ వల్ల విడుదల ఆగిపోయి, థియేటర్స్ ఓపెనింగ్ కోసం ఎదురు చూస్తున్న సినిమాలలో “అన్నపూర్ణమ్మగారి మనవడు” ఒకటి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకు రావటానికి దర్శక నిర్మాతలు కృషి చేస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఇటీవల నిర్మాత తుమ్ముల ప్రసన్న కుమార్, దర్శకుడు వి.సముద్ర, బెల్లంకొండా శివ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా తుమ్ముల ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ…ఎమ్.ఎన్.ఆర్ ఫిలింస్ పతాకంపై ఎమ్. ఎన్. ఆర్ చౌదరి నిర్మాతగా నర్రా…

Read More

మెప్పించే సస్పెన్స్ థ్రిల్లర్ “నిశ్శబ్దం”

స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన చిత్రం ‘నిశ్శ‌బ్దం’. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో ఈ రోజు అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా విడుదల అయింది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రాన్ని క్రితి ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ అసోసియేషన్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యానర్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ నిర్మించారు.  మరి ప్రేక్షకులును ఏ మేరకు త్రిల్ కు గురి చేసిందో చూద్దాం పదండి.. కథ : అనుష్క (సాక్షి), సోనాలి (షాలిని పాండే) ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అనుష్క తండ్రి నడిపిన ఆర్ఫాన్ స్కూల్ లోనే ఇద్దరు కలిసి పెరుగుతారు. ఇద్దరూ ఒకర్ని ఒకరు వదిలి ఉండలేరు. అయితే ఈ క్రమంలో సాక్షి జీవితంలోకి ఆంటోనీ (మాధవన్) రావడం సోనాలి తట్టుకోలేకపోతోంది. ఆ తరువాత జరిగిన…

Read More

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతున్న ”కళాపోషకులు”

శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరో హీరోయిన్స్ గా తెరకెక్కబోతున్న సినిమా కళాపోషకులు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి అయ్యాయి. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాలో లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. ఆ నలుగురు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విశ్వకార్తికేయ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవ్వడం విశేషం. ఈ సందర్భంగా నిర్మాత ఏమ్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ…‘కళాపోషకులు’ చిత్రాన్ని దర్శకుడు చలపతి పువ్వుల బాగా తెరకెక్కించాడు. మహావీర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించే విధంగా ఉండబోతొంది. నటీనటులు అందరూ బాగా చేశారు. కోవిడ్ 19 లాక్ డౌన్ తరవాత ప్రభుత్వ సూచనలు, చిత్రసీమ పెద్దల సలహాలు పాటిస్తూ చిత్రీకరణ మొదలు పెట్టీ…

Read More