స్వార్థం లేని సేవకు, త్యాగానికి అమ్మే శాశ్వత చిరునామా

ఆదిశక్తిగా శక్తికి మూలమై…అమృత మూర్తిగా మాతృమూర్తియై.. కనిపించని దేవునికి కనిపించే ప్రతిరూపమైన అమ్మలకు రాష్ట్ర గిరిజన, మహిళా – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు జీవితంలో అత్యంత సంతోషాన్నిచ్చే అమ్మతనం కన్న గొప్పది ఈ ప్రపంచంలో ఏదీ లేదని, అలాంటి అమ్మల కోసం ఏమి చేసినా ఆ రుణం తీరిపోనిదన్నారు. స్వార్థం లేని సేవకు, త్యాగానికి అమ్మే శాశ్వత చిరునామా అన్నారు. అలాంటి అమ్మలను కడుపున పెట్టుకుని చూసుకునేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వంగా పనిచేస్తుందన్నారు. మహిళల రక్షణ, సమగ్ర వికాసం, సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తూ వారి అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం అడుగడుగునా చేస్తూనే ఉందన్నారు. ఆడపిల్ల అమ్మ గర్భంలో ఉన్నప్పటి నుంచి పెళ్లి…

Read More

రెడ్ జోన్ లో పని చేస్తున్న పోలీస్ సిబ్బందికి

ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆయుష్ రక్ష కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. రెడ్ జోన్ లో పని చేస్తున్న పోలీస్ సిబ్బందికి, వైద్య సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి ఆయుష్ రక్ష కిట్స్ ను అందజేయనున్నారు. 20 వేల కిట్స్ ను మొదటి దఫా పంపిణీ చేయనున్నారు. ఈ రోజు BRKR భవన్ లోని మంత్రి కార్యాలయంలో ఆయుష్ రక్ష కిట్స్ ని పోలీస్ అధికారులకు అందించారు. హైదరాబాద్ సెంట్రల్ జోన్ జాయింట్ CP విశ్వప్రసాద్, IPS, బాలనాగాదేవి IPS, ఐజిపి హోమ్ గార్డ్స్, ఏసిపి సైఫాబాద్ వేణుగోపాల్ రెడ్డి లకు మంత్రి ఈటల రాజేందర్ గారు కిట్స్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయుర్వేద అతి ప్రాచీనమైన వైద్య శాస్త్రం. కరోనాను ఎదుర్కొనేందుకు ఆయుష్ కమీషనర్…

Read More

సౌత్ కోస్ట్ జోన్ గా నామకరణం

ఢిల్లీ : ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికైన రైల్వే జోన్ ని మంజూరు చేస్తూ ఈరోజు కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ 13లోని 8వ ఆర్టికల్ ప్రకారం సౌత్ కోస్ట్ జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూస్ గోయల్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రకటించారు. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ గా నూతన రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. టాస్క్ ఫోర్స్ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకుని ఈ నూతన రైల్వే జోన్ ప్రకటించారు. మార్చి 1వ తేదీన విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉన్న నేపథ్యంలో దానికి రెండు రోజుల ముందే విశాఖకు రైల్వే జోన్ మంజూరు చేసినట్లు రైల్వే మంత్రి ప్రకటించడం విశేషం. రైల్వే జోన్ కి సంబంధించి పీయూష్…

Read More