ఆకట్టుకుంటోన్న ‘మిస్‌ ఇండియా’ ట్రైలర్‌…. నవంబర్‌ 4న నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా విడుదల

‘మహానటి’ సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించుకున్న స్టార్‌ హీరోయిన్‌ కీర్తిసురేశ్‌. ఈమె టైటిల్‌ పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ ‘మిస్‌ ఇండియా’. నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై మహేశ్‌ కొనేరు ఈ చిత్రాన్ని నిర్మించారు. కీర్తిసురేష్‌ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌లో హై బడ్జెట్‌తో రూపొందిన ‘మిస్‌ ఇండియా’ నటిగా ఆమెను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తూ నవంబర్‌ 4న ప్రముఖ డిజిటల్‌ మాధ్యమం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. తెలుగుతో పాటు ఈ సినిమా తమిళం, మలయాళంలోనూ విడుదలవుతుంది. దసరా సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం చిత్రయూనిట్ విడుదల చేసింది. ట్రైలర్‌ను చూస్తే… 
సాధారణంగా పిల్లలు డాక్టరో, పోలీసో, లాయరో కావాలని కలలు కంటారు. కానీ.. ఆ కలలను నేరవేర్చుకునేవారు మాత్రం అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన అమ్మాయి సంయుక్త. చిన్నప్పట్నుంచి బిజినెస్‌ రంగంలో రావాలనుకునే సంయుక్త దిగువ మధ్యతరగతి అమ్మాయి. ఇంట్లో అన్నయ్య, తను పనిచేస్తే కానీ.. ఇల్లు గడవడం కష్టం. అలాంటి కుటుంబానికి చెందిన సంయుక్త .. తనకు ఎదురైన సవాళ్లను దాటి ‘మిస్‌ ఇండియా’ అనే పేరుతో చాయ్‌ వ్యాపారాన్ని స్టార్ట్‌ చేస్తుంది. అదే రంగంలోని మరో పెద్ద వ్యాపారవేత్త(జగపతిబాబు) ఆమెకు అడ్డుగా నిలుస్తాడు. ఆమె ఏం చేస్తుంది? ఎలా నెంబర్‌ వన్‌గా ఎదిగి ‘మిస్‌ ఇండియా అంటే పేరు కాదు.. ఓ బ్రాండ్‌ ‘ అనేలా చేస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్‌ ఉంది. సినిమా ప్రతి విజువల్‌ రిచ్‌గా, ఫ్రెష్‌ లుక్‌తో కనిపిస్తుంది. మరో వైపు తమన్‌ నేపథ్య సంగీతం సన్నివేశాలను మరో లెవల్‌లో ఎలివేట్ చేస్తున్నాయి. 
ఈ సందర్భంగా కీర్తిసురేశ్‌ మాట్లాడుతూ – “తను జీవితంలో ఏం కావాలకున్నాదో అలాంటి కలను సాకారం చేసుకోవడానికి సంయుక్త అనే అమ్మాయి చేసిన ప్రయాణమే ‘మిస్‌ ఇండియా’. ఈ చిత్రాన్ని దర్శకుడు నరేంద్ర, నిర్మాత మహేశ్‌ కొనేరు అందంగా మలిచారు. ఇలాంటి సినిమా ఎంతో మంది మహిళలకు స్ఫూర్తి నిస్తుందని, వారి కలలను, ప్యాషన్‌ను నిజం చేసుకోవడానికి ఉత్తేజాన్ని ఇస్తుందని భావిస్తున్నాను. భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి ఎంజాయ్‌ చేయవచ్చు. ఇలాంటి బలమైన కంటెంట్‌ ఉన్న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించడానికి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కావడం చాలా సంతోషాన్నిస్తుంది” అన్నారు. 
నటీనటులు:కీర్తి సురేశ్‌, జగపతిబాబు, నదియా, రాజేంద్ర ప్రసాద్‌, వీకే నరేష్‌, భానుశ్రీ మెహ్రా, పూజిత పొన్నాడ, కమల్ కామరాజు తదితరులు 
సాంకేతిక వర్గం:నిర్మాత:  మహేశ్‌ ఎస్‌.కొనేరుదర్శకత్వం:  వై.నరేంద్రనాథ్‌ రచయితలు:  తరుణ్‌ కుమార్‌, వై.నరేంద్రనాథ్‌స్క్రీన్‌ప్లే:  వై.నరేంద్రనాథ్‌సంగీతం: ఎస్‌.ఎస్‌.తమన్‌

Related posts

Leave a Comment