సుమంత్‌ ‘కపటధారి’ టీజర్‌ విడుదల చేసిన ప్యాన్‌ ఇండియా వెర్సటైల్‌ యాక్టర్‌ రానా దగ్గుబాటి

” ఈ ప్రపంచంలో ఏదీ ఊరికే జరగదు. అన్నిటికీ ఓ కారణం ఉంటుంది” అని అంటున్నారు హీరో సుమంత్‌. ఈయన కథానాయకుడిగా ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న థ్రిల్లర్‌`క‌ప‌ట‌ధారి`.  `సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం`, `ఇదంజ‌గ‌త్‌` చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న సుమంత్ ఇప్పుడు `క‌ప‌ట‌ధారి` అనే ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌లో న‌టిస్తున్నారు. క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ట‌యిన `కావ‌లుధారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ డిఫ‌రెంట్ పాయింట్‌తో రూపొందిన `కావ‌లుధారి` చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో డా.ధ‌నంజ‌యన్ నిర్మిస్తున్నారు. గురువారం రోజు ఈ సినిమా టీజర్‌ను టాలీవుడ్‌ హల్క్‌, ప్యాన్‌ ఇండియా వెర్సటైల్‌ యాక్టర్‌ రానా దగ్గుబాటి విడుదల చేశారు.
 టీజర్‌ చూస్తుంటే ప్రపంచంలో జరిగే ప్రతి విషయం వెనుక బలమైన కారణం ఉందనే పాయింట్‌ను బేస్‌ చేసుకుని కథను రూపొందించినట్లు కనిపిస్తుంది. అలాగే ఏదో హత్య కేసును ఇన్వెస్టిగేట్‌ చేసే పోలీసులతో ట్రాఫిక్‌ పోలీస్‌ ఆఫీసర్‌లా కనిపించే సుమంత్‌ జాయిన్‌ అవుతానని అడగటం, చివరకు కేసును ఇన్వెస్టిగేట్‌ చేస్తున్న పోలీసులు కేసులో ఇన్‌వాల్వ్‌ కావద్దని సుమంత్‌కు వార్నింగ్‌ ఇచ్చే సన్నివేశాలు ఎగ్జయిట్‌మెంట్‌ను పెంచుతున్నాయి. టీజర్‌ చివరలో వచ్చే ‘వాడి అసలు మొహం దాచుకోవడానికి వేషాలు మార్చే వ్యక్తి ‘ డైలాగ్‌తో పాటు టీజర్‌ బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తున్న “రంగులు మార్చే లోకంపాచికలాడే న్యాయంనీతీ నియమం మరిచి.. జీవితమంటే యుద్ధం పోరాడటమే లక్ష్యం.. కన్నులు కప్పి తిరిగేవాడేరా..” అనే సాంగ్‌ కూడా వేషాలు మార్చే ఓ వ్యక్తి గురించి చెబుతుంది. ఇంతకూ ఆ వేషాలు మార్చే వ్యక్తి ఎవరు? అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌. 
ఈ చిత్రానికి  డా.ధ‌నుంజ‌య‌న్ స్క్రీన్‌ప్లే అడాప్ష‌న్ చేస్తుండ‌గా.. బాషాశ్రీ మాట‌లు అందిస్తున్నారు. ప్ర‌వీణ్ కె.ఎల్ ఎడిట‌ర్‌గా, స్టంట్ సిల్వ స్టంట్ మాస్ట‌ర్‌గా , విదేశ్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా ఈ చిత్రానికి ప‌నిచేస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయని, సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. 
న‌టీన‌టులు:
సుమంత్‌, నందిత‌, పూజాకుమార్‌, నాజ‌ర్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, సంప‌త్ త‌దిత‌రులు

Related posts

Leave a Comment