స్వార్థం లేని సేవకు, త్యాగానికి అమ్మే శాశ్వత చిరునామా

ఆదిశక్తిగా శక్తికి మూలమై…అమృత మూర్తిగా మాతృమూర్తియై.. కనిపించని దేవునికి కనిపించే ప్రతిరూపమైన అమ్మలకు రాష్ట్ర గిరిజన, మహిళా – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు జీవితంలో అత్యంత సంతోషాన్నిచ్చే అమ్మతనం కన్న గొప్పది ఈ ప్రపంచంలో ఏదీ లేదని, అలాంటి అమ్మల కోసం ఏమి చేసినా ఆ రుణం తీరిపోనిదన్నారు. స్వార్థం లేని సేవకు, త్యాగానికి అమ్మే శాశ్వత చిరునామా అన్నారు. అలాంటి అమ్మలను కడుపున పెట్టుకుని చూసుకునేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వంగా పనిచేస్తుందన్నారు. మహిళల రక్షణ, సమగ్ర వికాసం, సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తూ వారి అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం అడుగడుగునా చేస్తూనే ఉందన్నారు.


ఆడపిల్ల అమ్మ గర్భంలో ఉన్నప్పటి నుంచి పెళ్లి చేసుకుని మళ్లీ తల్లి అయ్యే వరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యకరమైన శిశువుకు జన్మనివ్వడానికి ఆరు నెలల నుంచి గర్భం దాల్చిన మూడు నెలల వరకు నెలకు 2000 చొప్పున 12వేల రూపాయలు, ఆడపిల్ల పుడితే అదనంగా 1000 రూపాయలు, గర్భిణీ స్త్రీని ప్రభుత్వ ఆస్పత్రికి జాగ్రత్తగా తీసుకెళ్లడానికి అమ్మ ఒడి పథకం, ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవం అయితే కేసిఆర్ కిట్ ఇవ్వడం, ఆ తర్వాత ఆడపిల్లల విద్య కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ విద్యాలయాలు, పెళ్లీడుకు వచ్చిన పేదింటి అమ్మాయి తల్లిదండ్రులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం కింద 1,00,116 రూపాయలు ఇచ్చి ఆదుకుంటుందన్నారు. ఆడపిల్ల రక్షణ కోసం షీ టీమ్స్, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్స్, భరోసా కేంద్రాలు, సఖీ కేంద్రాలు నిర్వహిస్తున్నామన్నారు. మహిళల పేరు మీదే రేషన్ కార్డులు, భూముల రిజిస్ట్రేషన్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు కల్పించామని, ఆర్ధిక వికాసం కోసం స్త్రీ నిధి ఏర్పాటు చేశామని, డ్వాక్రా రుణాలు ఇస్తున్నామని తెలిపారు.
తల్లీ, బిడ్డల సంరక్షణ కోసం అంగన్ వాడీలలో ఆరోగ్య లక్ష్మీ పథకం అమలు చేస్తున్నామని, దీనిలో తల్లి కోసం టీకాలు, గుడ్లు, పాలు, మధ్యాహ్న భోజనం ద్వారా పోషకాహారం, వైద్య సాయం అందిస్తున్నమని, అదేవిధంగా పుట్టిన బిడ్డల నుంచి ఆరేళ్ల వరకు వారి ఆరోగ్యం కోసం బాలామృతం, గుడ్లు, పాలు ఇస్తున్నామని, కిండర్ గార్డెన్ ప్రీ స్కూల్ నిర్వహిస్తూ వారి సమగ్ర వికాసానికి కృషి చేస్తున్నామన్నారు

Related posts

Leave a Comment