ప్ర‌ముఖ గాయ‌క‌లు శ్రీ ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంగారి మ‌ర‌ణం న‌న్ను తీవ్ర దిగ్బ్రాంతికి లోను చేసింది – అల్లు అర్జున్


ప్ర‌ముఖ గాయ‌క‌లు, సంగీత ద‌ర్శ‌కులు, వ్యాఖ్యాత‌, న‌టుల శ్రీ ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంగారి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఎస్పీబాలుగారు మ‌ర‌ణం యావత్ భార‌తీయ సినీ ప్ర‌పంచానికి తీరని లోటు, అయిదు ద‌శాబ్ధాల‌కి పైగా ఆయ‌న గాత్రంతో ఎన్నో కోట్ల మంది సంగీత ప్రియుల్ని అల‌రించారు. దాదాపుగా 40000 పైగా పాట‌లు ఆల‌పించడం. రెండు, మూడు ద‌శాబ్ధ‌ల‌కు పైగా తెలుగు, క‌న్న‌డ‌, తిమిళ సినీ సంగీతానికి మ‌కుటంలేని మ‌హారాజుగా వ్య‌వ‌హ‌రించడం అనిత‌ర సాధ్యం. ఎస్పీ బాలుగారు సినీ నేప‌థ్య‌గానం విష‌యంలో అందుకున్న రివార్డులు, అవార్డులు నెల‌కొల్పిన రికార్డులు అందుకోవ‌డం మ‌రెవ్వ‌రి త‌రం కాదు అని క‌చ్ఛితంగా విశ్వ‌సిస్తున్నాను. నేను న‌టించిన సినిమాల‌కి ఆయ‌న నేప‌థ్య‌గానం అందిచ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను, బాలుగారు మ‌ర‌ణం న‌న్ను తీవ్ర దిగ్బ్రాంతికి లోను చేసింది, ఆయ‌న ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని ఆ దేవుడు మ‌నఃస్పూర్తిగా కోరుకుంటూ, వారి స్నేహిత‌లుకు, స‌న్నిహితుల‌కి, కుటుంబ స‌భ్యుల‌కి నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను అని అన్నారు. ఇదే విష‌యాన్ని క్లుప్తంగా  ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా కూడా తెలియ‌జేశారు అల్లు అర్జున్

Related posts

Leave a Comment