టెన్త్ క్లాస్ డైరీస్ సినిమా సమీక్ష

అవికా గోర్, శ్రీరామ్ జంటగా… ఎస్.ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ చిత్రంతో ప్రముఖ ఛాయాగ్రాహకులు ‘గరుడవేగ’ అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టొరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం పదండి…

కథ: సోమయాజి (శ్రీరామ్) విదేశాల్లో స్థిరపడ్డ సాఫ్ట్ వేర్ కంపెనీ యజమాని. అతనికి భార్య, పిల్లలు వుంటారు. మంచి కుటుబం, డబ్బు వున్న అతన్ని బాల్యంలో తన క్లాస్ మేట్ అయిన చాందిని(అవిక గోర్) మీద ఏర్పడిన ప్రేమ వెంటాడుతూనే ఉంటుంది. దాంతో కట్టుకున్న భార్యకు విడాకులు ఇచ్చేసి… తన బాల్య స్నేహితరాలుని కలవడానికి ఇండియాకు తిరిగి వచ్చేస్తాడు. తన బాల్య స్నేహితులు అయిన గౌరవ్ (వెన్నెల రామారావ్) హాఫ్ బాయిల్డ్ (శ్రీనివాస్ రెడ్డి), సౌమ్య (అర్చన వేద), నాగలక్ష్మి (హిమజ) సహాయం తీసుకుని ఒక రీ యూనియన్ చేయాలని నిర్ణయించుకుంటారు. అయితే ఈ కార్యక్రమానికి అందరూ హాజరవుతారు కానీ చాందిని మాత్రం రాదు. చాందిని రీ యూనియన్ కి ఎందుకు రాలేదు? చాందిని ఎక్కడికి వెళ్లింది? సోమయాజి… చాందినీని కలుసుకున్నాడా? వీరి బాల్య ప్రేమ ఫలించిందా? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!!!

కథ… కథనం విశ్లేషణ: క్లాస్ రూమ్ జ్ఞాపకాలు ఎప్పుడూ తీపిగుర్తులే. అందుకే టెన్త్ క్లాస్ లోపల క్లాస్ రూములో చేసే చిలిపి పనులు… అమ్మాయిలకు సైట్ కొట్టడం…. ప్రేమలో పడటం లాంటివన్నీ మధురానుభూతులు. అవి జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. నిజ జీవితంలో తన స్నేహితుల జీవితంలో జరిగిన అలాంటి తీపి గురుతుల సమాహారాన్ని నిర్మాత వెన్నెల రామారావు… కెమెరామెన్ కం డైరెక్టర్ గరుడ వేగ అంజితో కలిసి వెండితెర తెరమీద ఎంతో ఆహ్లాదకరంగా ఆవిష్కరించారు. తన స్నేహితుల జీవితంలో కలిగిన సంఘటనకు కాస్త డ్రామా… ఎమోషన్ జోడించి ఈ సినిమా ని అన్ని వర్గాల ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా తీశారు. బాల్యంలో కలిగే ఫస్ట్ క్రష్… జీవితాంతం వెంటాడుతూనే వుంటుందని… దాన్ని గెలిపించు కోవడానికి ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే సంఘర్షణ… దాని ఫలితంగా జరిగే అనర్థాలను ఎంతో ఎమోషనల్ గా… రియలిస్టిక్ చూపించారు. నిర్మాత తన నిజ జీవితంలో జరిగిన… చూసిన సంఘటన ఆధారంగా తయారు చేసుకున్న కథ.. దాని చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే ప్రేక్షకుల్ని బాగా ఎంగేజ్ చేస్తాయి. ఫస్ట్ హాఫ్ లో బాల్యం తాలూకు జ్ఞాపకాలను ఎంతో ఎంటర్టైనింగ్ గా… చూపించి సెకెండ్ హాఫ్ లో కథను సీరియస్ మోడ్ లో నడిపించాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ట్విస్ట్ సెకెండ్ హాఫ్ మీద మరింత ఆసక్తిని పెంచింది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్స్ మాస్ ను మెప్పించేలా వుంది. క్లైమాక్స్ సీన్ ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించేలా వుంది. టెన్త్ క్లాస్ డైరీస్ ని చూస్తే… ప్రతి ఒక్కరూ తమ బాల్యంలో విహరించి… ఆనాటి క్లాస్ రూమ్ మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకుని బాల్యంలో కాసేపు విహరించక తప్పదు.

హీరో శ్రీరామ్… మిడిల్ ఏజ్ ప్రేమికునిగా చాలా చక్కగా నటించారు. ప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీన్ బాగుంది. బాల్యంలో ఏర్పడిన ఫస్ట్ క్రష్ ని మరిచిపోలేని భగ్న ప్రమికుడిగా ఎంతో ఎమోషనల్ గా నటించి మెప్పించారు. హీరోయిన్ అవికగోర్ కూడా తన పాత్రకు మంచి న్యాయమే చేసింది. సెకెండ్ హాఫ్ మొత్తం సీరియస్ మోడ్ లో నటించి మెప్పించారు. నిర్మాత వెన్నెల రామారావు…. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల్ని నవ్వించారు. ఆయన పాత్ర కనిపించినప్పుడల్లా నవ్వులే నవ్వులు. అర్చన వేద తో పండించిన కామెడీ బాగా వర్క్ అవుట్ అయింది. పూల చుక్కలో కామిడీ పండించాడు. శ్రీనివాస్ రెడ్డి కామెడీ టైమింగ్ మెప్పిస్తుంది. ఆయన కాంబినేషన్లో భానుశ్రీ నటించిన సీన్స్ అన్నీ యూత్ ని ఆకట్టుకుంటాయి. సౌమ్య పాత్రలో అర్చన వేద… నాగలక్ష్మి పాత్రలో హిమజ నటించి మెప్పించారు. భానుశ్రీ కాసేపు వున్నా గ్లామర్ డాల్ గా యూత్ ను ఆకట్టుకుంటుంది. నాజర్ హీరోయిన్ తండ్రిగా… వూరికి పెద్దమనిషి గా కనిపించి ఒకే అనిపించుకున్నారు. మిగతా పాత్రలన్నీ తమ తమ పరిధిలో నటించి మెప్పించారు.

నిర్మాత వెన్నెల రామారావు రాసుకున్న కథ.. కథనాలను దర్శకుడు గరుడ వేగ అంజి… సిల్వర్ స్క్రీన్ పై ఎంతో ఎమోషనల్ గా… ఆహ్లాద కరంగా చూపించారు. తన డెబ్యూ మూవీతోనే దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆయనే అందించిన సినిమటోగ్రఫీ చాలా బాగుంది. సంగీతం బాగుంది. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి యాప్ట్ అయ్యాయి. నిడివి ఇంకాస్త క్రిస్పి గా వుంటే బాగుండేది. నిర్మాత వెన్నెల రామారావు తన స్నేహితులతో కలిసి… సినిమాను ఎంతో క్వాలిటీగా నిర్మించారు..

ఎమోషనల్ డ్రామా…. గో అండ్ వాచ్ ఇట్…!!!

రేటింగ్: 3/5

Related posts

Leave a Comment