‘1997’ తెలుగు మూవీ రివ్యూ

బ్యానర్ : ఈశ్వర పార్వతి మూవీస్
నిర్మాత: మీనాక్షి రమావత్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: డాక్టర్ మోహన్.
ఎడిటింగ్ : నందమూరి హరి
సంగీతం : కోటి
కెమెరా : చిట్టి బాబు
నటీనటులు : డా. మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి, బెనర్జీ, రవి ప్రకాష్, రామ రాజు తదితరులు…
జానర్ : క్రైం థ్రిల్లర్
విడుదల : 26-11-2021
రేటింగ్ : 3 / 5

డా. మోహన్ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘1997’. నవీన్‌చంద్ర, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, కోటి ప్రధాన పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. L

కథ : నిజాం పేట గ్రామంలో ఓ దొర హంగామా చేస్తుంటాడు. పైగా అతను ఆ ఊరికి ఎం ఎల్ ఏ. అతన్ని కాదని ఆ ఊరిలో ఎవరు ఏమి చేయరు. పైగా అతనికి పోలిసుల సపోర్ట్ ఫుల్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో గంగ అనే అమ్మాయి ఘోరంగా అత్యాచారానికి గురవ్వడంతో పాటు మరణిస్తుంది. ఆమె మరణాన్ని ఈత రాక నీళ్లలో మునిగి చనిపోయిందని చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. అయితే అదే గ్రామానికి ఏ ఎస్ ఐ గా వచ్చిన విక్రమ్ రాధోడ్ ( డా. మోహన్ ) నిజ నిజాలు తెలుసుకుని అసలైన దోషులను శిక్షించే ప్రయత్నం చేస్తాడు. ఈ నేపథ్యంలో దొర ( రామరాజు ) కు సపోర్ట్ చేస్తూ అయన అన్యాయాలను కప్పిపుచ్చే సి ఐ చారి ( శ్రీకాంత్ అయ్యంగార్ ) కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తాడు. అయితే న్యాయం అన్నది తక్కువ కులం , ఎక్కువ కులం అని కాకుండా అందరికి సమానంగా ఉండాలన్న లక్ష్యంతో రంగంలోకి దిగి గంగ ను మానభంగం చేసి చంపినా దోషులను టార్గెట్ చేస్తాడు విక్రమ్ రాధోడ్. మరి ఈ పరిస్థితుల్లో విక్రమ్ రాథోడ్ కు ఎదురైనా అడ్డంకులు ఏమిటి ? దొర అహంకారానికి, కామానికి బలైన గంగ కు న్యాయం జరిగిందా లేదా అన్నది అసలు కథ.

నటీనటుల ప్రతిభ :

ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది .. శ్రీకాంత్ అయ్యంగార్ గురించి. సి ఐ చారి పాత్రలో నెగిటివ్ షేడ్ లో అదరగొట్టాడు. ఇక హీరో విక్రమ్ రాధోడ్ పాత్రలో డా. మోహన్ అదరగొట్టాడు. ఏ ఎస్ ఐ గా అయన పరిధిలో చక్కగా నటించాడు. ముక్యంగా పోలీస్ అధికారిగా భిన్నమైన షేడ్ లో ఆకట్టుకున్నాడు. ఇక ఎంక్వయిరీ అధికారిగా హీరో నవీన్ చంద్ర పాత్ర ఉన్నది కొద్దీ సేపే అయినప్పటికీ ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. పోలీస్ అధికారిగా న్యాయం పక్కన నిలబడాలని చేసే ప్రయత్నం బాగుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కోటి డి జి పి గా బాగా చేసాడు. అలాగే దొర పాత్రలో రామరాజు నటన హైలెట్. అలాగే దొర కొడుకు రాంబాబు పాత్ర సినిమాకే ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి. మిగతా పాత్రల్లో ఎవరికీ వారు బాగా చేసారు.

టెక్నీకల్ హైలెట్ :

ఈ సినిమా విషయంలో టెక్నీకల్ అంశాల్లో ముందుగా చెప్పుకోవలసింది మ్యూజిక్ డైరెక్టర్ కోటి గురించి. ఈ సినిమాకు కోటి ఇచ్చిన ఆర్ ఆర్ ప్రధాన ఆకర్షణ. కథను డ్రైవ్ చేయడంలో కోటి ఆర్ ఆర్ సూపర్. అలాగే ఈ సినిమాకు మరో హైలెట్ ఫోటోగ్రఫి. చిట్టిబాబు అందించిన ఫోటోగ్రఫి బాగుంది. ఇక ఈ సినిమా విషయంలో మరో ముఖ్యమైన అంశం ఎడిటింగ్. సీనియర్ ఎడిటర్ నందమూరి హరి ఎడిటింగ్ బాగుంది. చాలా సీన్స్ అలా అలా పాస్ అయిపోతూ ఉంటాయి. ఇక దర్శకుడు , హీరో మోహన్ గురించి చెప్పాలంటే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న బార్నిన్గ్ ఇష్యు ని తీసుకుని దర్శకుడు మోహన్ చక్కటి ప్రయత్నం చేసాడు. నేటి సమాజంలో ఉన్న కులమతాల అసమానతలు , మహిళలపై జరుగుతున్నా దారుణాల నేపథ్యంలో ఈ కథను ఎంచుకున్నాడు దర్శకుడు. ఆలోచింప చేసే కథ, కథనంతో చక్కటి ప్రయత్నం చేసాడు. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.

విశ్లేషణ :

‘‘ఒక దొర అహంకారానికి బలైన ఓ అమాయకురాలి కథ ఇది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన కథ ఇది. సమాజంలో అసమానతలకి అద్దం పట్టేలా తెరకెక్కించే ప్రయత్నం చేసాడు దర్శకుడు.

Rating : 3/5

Related posts

Leave a Comment