వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై అడివి శేష్‌ హీరోగా ‘హిట్‌ 2’.. లాంఛనంగా ప్రారంభం


కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేయడానికి, కొత్త కాన్సెప్ట్‌ సినిమాలను తెరకెక్కించడానికి నిర్మాణంలో భాగమైన హీరో నాని వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేనితో కలిసి తొలి చిత్రంగా అ! సినిమాను రూపొందించి సూపర్‌ హిట్‌ కొట్టారు. రెండో చిత్రంగా ‘హిట్‌’ అనే సీట్‌ థ్రిల్లర్‌ను రూపొందించి సూపర్‌ డూపర్ హిట్‌ సాధించారు. రీసెంట్‌గా హిట్‌ సినిమాకు ఫ్రాంచైజీగా ‘హిట్ ‌2’ చిత్రాన్ని రూపొందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అనౌన్స్‌ చేసినట్టుగానే శనివారం ‘హిట్‌ 2’ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ‘ ది సెకండ్‌ కేస్‌’ సినిమా ట్యాగ్‌లైన్‌. హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శైలేష్‌ కొలను దర్శకత్వంలోనే హిట్‌ 2 సినిమా రూపొందనుంది. ముహుర్త సన్నివేశానికి హీరో నాని క్లాప్‌ కొట్టి స్క్రిప్ట్‌ను డైరెక్టర్‌ శైలేష్‌కు అందించారు. నిర్మాత ప్రశాంతి తిపిర్నేని కెమెరా స్విచ్‌ ఆన్‌ చేశారు.
`క్ష‌ణం, గూఢ‌చారి, ఎవ‌రు` వంటి వైవిధ్య‌మై క‌థా చిత్రాల్లో హీరోగా న‌టించిన త‌న‌కంటూ ఓ ప్రత్యేక‌మైన గుర్తింపు సంపాదించుకోవ‌డ‌మే కాకుండా ఇప్పుడు దేశ‌భ‌క్తితో నిండిన పాన్ ఇండియా మూవీ `మేజ‌ర్‌`లో న‌టిస్తున్న అడివిశేష్  కృష్ణ దేవ్‌ అలియాస్‌ కె.డి పాత్రలో నటిస్తున్న ‘హిట్‌ 2’ రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్‌ ఆఫీసర్‌ అమ్మాయి మిస్సింగ్‌ కేసుని ఎలా డీల్‌ చేశాడనే కాన్సెప్ట్‌తో హిట్‌ ‌(మోమిసైడ్‌ ఇంటర్‌వెన్షన్‌ టీమ్‌) సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు  ఆంధ్రప్రదేశ్‌ చెందిన హిట్‌ టీమ్‌ ఆఫీసర్‌ కృష్ణ దేవ్‌ అలియాస్‌ కె.డి ఈ ఎగ్జయిటింగ్‌ జర్నీని కంటిన్యూ చేయబోతున్నారు. మణికందన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సంగీతాన్ని అందించనున్నారు. 
నటీనటులు:అడివిశేష్‌, మీనాక్షి చౌదరి, రావు రమేష్‌, భాను చందర్‌, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, శ్రీకాంత్‌ మాగంటి, కోమలి ప్రసాద్‌ తదితరులు 
సాంకేతిక వర్గం: సమర్పణ:  నానిబ్యానర్‌:  వాల్‌పోస్టర్‌ సినిమానిర్మాత:  ప్రశాంతి తిపిర్నేనిరచన, దర్శకత్వం: డా. శైలేష్‌ కొలనుసినిమాటోగ్రఫీ:  మణికందన్‌సంగీతం: జాన్‌ స్టీవర్స్‌ ఎడురిఆర్ట్‌:  మనీషా ఎ.దత్‌ఎడిటింగ్‌:  గ్యారీ బి.హెచ్ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.వెంకట్ రత్నం(వెంకట్‌)

Related posts

Leave a Comment