“అప్పుడు.. ఇప్పుడు” సినిమా సమీక్ష

యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ మూవీస్ కి మంచి ఆదరణ ఉంది. అందుకే దర్శకులు కూడా ఇలాంటి చిత్రాల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రేమ కథలను ఎన్ని కోణాల్లో నైనా వెండితెరపై ఆవిష్కరించిన అవి ఎప్పుడూ ప్రేక్షకాదరణ పొందుతూనే ఉంటాయి. ప్రేమకు మరణం లేనట్టు ప్రేమ కథలకు పులిస్టాప్ లేదు. తాజాగా మరో ప్రేమకథా చిత్రం “అప్పుడు.. ఇప్పుడు” పేరుతో విడుదల అయింది. ఇందులో సుజన్, తనీష్క్ రాజన్ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని యు.కె.ఫిలింస్ బేనర్ పై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మించారు. చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే విడుదల అయింది. ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం పదండి.

కథ: అర్జున్ ( సుజన్ ) చదువు పై పెద్దగా ఆసక్తి లేని కుర్రాడు… ఎంత చదువుకున్నా ఏమి ప్రయోజనం.. ఒకేటే జీతం, ఒకటే జీవితం , అందుకే కొడితే జాక్ పాట్ కొట్టాలని ఆలోచించే కుర్రాడు. కాస్త ఎక్కువ చలాకీతనం ఉన్న ఈ కుర్రాడు అంటే వాళ్ళ నాన్నని హడల్ .. ఇద్దరు ఫ్రెండ్స్ ని వెనకేసుకొని అల్లరిచిల్లరగా తిరుగుతుంటాడు. అలాంటి సమయంలో అనుకోకుండా ఓ పెద్ద సమస్యవల్ల రెండు ఊర్లుగా విడిపోయిన ఊరిలోకి వచ్చి చేరతాడు. ఈ క్రమంలో ఆ వురి నాయకుడు, జెడి పిటిసి అయిన వ్యక్తి కూతురు ( తనిష్క్ ) ని చూసి ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో ఆ వూరు విడిపోవడానికి కారణం ఏమిటి? అసలు నాయకుల ముసుగులో ఉన్న రెండు గ్రామాల నాయకులూ చేస్తున్న మోసాన్ని కనిపెడతాడు .. ఈ క్రమంలో అతనికి ఎదురైనా సంఘటనలు ఏమిటి ? ప్రేమించిన అమ్మాయి ఇతనికి దక్కిందా లేదా ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

విశ్లేషణ: ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన సుజన్ చాలా యాక్టీవ్ గా కనిపించాడు. ముక్యంగా అతని ఎనర్జీ బాగా వర్కవుట్ అయింది. అయితే కొన్ని విషయాల్లో ఇంకాస్త ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. హీరోగా నటన,డాన్స్, యాక్షన్ అన్ని అంశాలు చక్కగా చేసాడు. ఇక హీరోయిన్ తనీష్క్ ఇప్పటికే రెండు మూడు సినిమాలు చేసింది. ఆమె అందం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. సినిమాలో అటు ట్రెడిషనల్, ఇటు మోడరన్ డ్రెస్ లో కనబడి అదరగొట్టింది. ముక్యంగా హీరో , హీరోయిన్స్ ల కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఇక మరో ముఖ్య పాత్రలో నటించిన శివాజీరాజా పాత్రకు ప్రాముఖ్యత ఉన్నా కూడా ఆయనను సరిగ్గా వాడుకోలేదు. ఇక మిగతా నటీనటులు శ్రీనివాస్ పేరుపురెడ్డి, మాధవి, జబర్దస్త్ అప్పారావు తదితరులు వారి వారి పాత్రల్లో చక్కగా నటించారు.
ఫీల్ గుడ్ కామెడీ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు కళ్యాణ్ సమి విజువల్స్, పద్మనావ్ భరద్వాజ్ సంగీతం మంచి అసెట్. అలాగే డైలాగ్స్ అక్కడక్కడా ఆకట్టుకున్నాయి. అయితే ఆర్ ఆర్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటె బాగుండేది. పద్మనావ్ అందించిన సాంగ్స్ బాగున్నాయి. ముక్యంగా రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ అదిరింది. ఎడిటింగ్ విషయంలో కూడా కత్తెరకు పనిచెప్పాల్సిన అవసరం ఉంది. ఇక దర్శకుడు చలపతి పువ్వల గురించి చెప్పాలంటే ఓ సరికొత్త నేపథ్యంలో ఉన్న ప్రేమ కథను ఎంపిక చేసుకున్నప్పటికీ దాన్ని తెరకెక్కించే విషయంలో కాస్త తడబడ్డాడు. ఎక్కువగా కామెడీ పై ఫోకస్ పెట్టడంతో కథ సైడ్ అయింది. కామెడీ విషయంలో కూడా జాగ్రత్త పడిఉంటే బాగుండేది. అయితే తాను అనుకున్న కథ, కథనాలను చక్కగా డ్రైవ్ చేసాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ “అప్పుడు .. ఇప్పుడు” అనే టైటిల్ విషయంలో కాస్త కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తుంది .. కథ విషయంలో ఏ కోణంలో దర్శకుడు ఈ టైటిల్ పెట్టాడు అన్న విషయానికి క్లారిటీ మిస్ అయింది. తప్పితే ఓ మంచి ప్రేమకథ చిత్రంగా కొత్త హీరోతో తెరకెక్కించిన ఈ సినిమా ఇది. గ్రామీణ నేపథ్యంలో సాగే చక్కని సినిమా ఇది. గో అండ్ వాచ్ ఇట్..!!!
రేటింగ్: 3/5

Related posts

Leave a Comment