ఏప్రిల్ 28న ఏం జరిగింది..? సినిమా రివ్యూ

రివ్యూ : ఏప్రిల్ 28న ఏం జరిగింది..?
తారాగణం : రాజా రంజిత్, షెర్రీ అగర్వాల్, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, ఛమ్మక్ చంద్ర
సంగీతం : సందీప్ కుమార్
సినిమాటోగ్రఫీ : సునిల్ కుమార్ ఎన్
నిర్మాణం : విజి ఎంటర్టైన్మెంట్స్
దర్శకత్వం : వీరాస్వామి.జి

కొత్తదనం ఉన్న కథలకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమా అంటే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో థ్రిల్లర్స్ చూసినా.. వాటిని సరిగ్గా ప్రెజెంట్ చేస్తే ఎప్పుడు వచ్చినా హిట్ గ్యారెంటీ అనిపించుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. తమ సినిమా కూడా అలాంటిదే అనిపిస్తూ వచ్చిన మూవీ ఏప్రిల్ 28న ఏం జరిగింది..? ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రూపొందిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలైంది.

కథగా చూస్తే.. విహారి(రంజిత్) సినిమా కథ రచయిత. సినిమా పరిశ్రమలో మంచి రచయితగా పేరుంటుంది. అయితే అతను ఎక్కువగా ఒకే నిర్మాతకు కథలు అందిస్తుంటాడు. అలాంటి నిర్మాతకు వైవిధ్యమైన సినిమాలు చేస్తాడు అనే పేరున్న ఓ పెద్ద దర్శకుడు సినిమా చేస్తా అంటాడు. కానీ కథను నిర్మాతనే చూసుకోమంటాడు. ఆ దర్శకుడి టేస్ట్ కు అనుగుణమైన కథ రాయమని విహారికి చెబుతాడు సదరు నిర్మాత. అయితే విహారికి సరైన పాయింట్ తట్టదు. దీంతో ఏదైనా వెకేషన్ కు వెళితే కొత్త థాట్స్ వస్తాయని ఫ్యామిలీతో కలిసి బయలుదేరతాడు. మధ్యలో కార్ రిపేర్ అవుతుంది. ఓ పోలీస్ సాయంతో ఓ గెస్ట్ హౌస్ కు చేరతాడు. అక్కడికి వెళ్లాక విహారికి రకరకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. మరి అవేంటీ.. అతనికే ఎందుకు ఎదురవుతున్నాయి..? చివరగా విహారి మంచి కథ రాశాడా లేదా అనేది మిగతా కథ.

హారర్ అయినా థ్రిల్లర్ అయినా ఆడియన్స్ ను సీట్ లో కదలకుండా కూర్చోబెట్టేసి సస్పెన్సే. ఆ సస్పెన్స్ ను మెయిన్టేన్ చేస్తూ ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి కథనం రాసుకున్నా దర్శకుడు అండ్ టీమ్. ఇలాంటి కథల్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటే ప్రేక్షకులకు నచ్చుతుందో అన్నీ ఉన్నాయి. ప్రధానంగా ప్రతి అరగంటకూ వచ్చే ఓ ట్విస్ట్ ఇంప్రెస్ చేస్తుంది. సాధారణంగా ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చివర్లో ఉంటాయి. కానీ ఏప్రిల్ 28న ఏ జరిగింది చిత్రంలో ఫస్ట్ హాఫ్ లోనే బోలెడు థ్రిల్లింగ్ అంశాలుంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. అలాగే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ ఆడియన్స్ ను తల తిప్పుకోకుండా చేస్తాడు దర్శకుడు.
ఇక ఈ సినిమాకు ప్రధాన బలం రైటింగే. బాగా రాసుకున్నారు. ఆర్టిస్టులు కూడా బాగా చేశారు. అన్నిటికీ మించి ఈ తరహా సినిమాల్లో కనిపించే అనవసర బూతు సన్నివేశాలు, మాటలు లేవు. క్లీన్ గా ఉంటుంది. ప్రధాన పాత్ర చేసిన రంజిత్ నటన ఆకట్టుకుంటుంది. హీరోగానే కాకపోయినా ఫ్యూచర్ లో మంచి పాత్రలకు ట్రై చేయొచ్చు. హీరోయిన్ ఓకే. తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాలకు ఇలాంటి పాత్రలు కొత్తేం కాదు. అంచేత వాళ్లు పాత్రల్లో ఒదిగిపోయారు. ఛమ్మక్ చంద్ర కామెడీ నవ్విస్తుంది.
ఫైనల్ గా ఏప్రిల్ 28న ఏం జరిగిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

రేటింగ్ : 3/5

Related posts

Leave a Comment