అవికాగోర్- అనురాగ్ కొణిదెన జంట‌‌గా జెమిని FX మూవీ ప్రారంభం

ప్ర‌ఖ్యాత జెమిని FX సంస్థ టాలీవుడ్ లో ఎంద‌రో ప్ర‌తిభావంతుల్ని ప్రోత్స‌హిస్తూ ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల్ని నిర్మించిన సంగ‌తి తెలిసిందే. కొంత గ్యాప్ త‌ర్వాత తాజాగా‌ న‌వ‌త‌రాన్ని ప్రోత్స‌హిస్తూ వ‌రుస‌గా సినిమాల్ని నిర్మించేందుకు ముందుకు వ‌చ్చింది. ఈ సంస్థ‌లో అవికా గోర్ క‌థానాయిక‌గా .. అనురాగ్ కొణిదెన క‌థానాయ‌కుడిగా కొత్త సినిమా నేడు హైద‌రాబాద్ లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. స‌త్యం ద్వార‌పూడి ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తుండ‌గా.. జెమిని ఎఫ్.ఎక్స్ స‌మ‌ర్ప‌ణ‌లో క్రిషి క్రియేష‌న్స్ ప‌తాకంపై కోటేశ్వ‌ర‌రావు నిర్మిస్తుండ‌గా.. అవికాగోర్ బ్యాన‌ర్ ఈ చిత్రానికి స‌హ‌నిర్మాణ సంస్థ‌‌గా వ్య‌వ‌హ‌రించడం విశేషం.

నాయ‌కానాయిక‌ల‌పై ముహూర్త‌పు స‌న్నివేశానికి సి.క‌ళ్యాణ్ క్లాప్ కొట్టి ప్రారంభించారు.
అనంత‌రం మీడియా స‌మావేశంలో జెమిని సీఈవో చిత్ర స‌మ‌ర్ప‌కులు
పీవీఆర్ మూర్తి
మాట్లాడుతూ-జెమిని సంస్థ నుంచి కొత్త ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించాల‌నే ప్ర‌య‌త్న‌మే ఇది. ఈ సంస్థ తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో ఎన‌లేని సేవ‌లు చేస్తోంది. నేటి‌త‌రం న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల్ని ప్రోత్స‌హిస్తూ కంటెంట్ ఉన్న సినిమాల్ని నిర్మించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం. త‌మిళం క‌న్న‌డ‌లో హిట్ట‌యిన మంచి సినిమాని తెలుగు‌లో రీమేక్ చేస్తున్నాం.. అవిక క‌థానాయిక‌గా ఫ్యామిలీ యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిస్తున్నాం. అభిరుచి ఉన్న నిర్మాత‌లు న‌టీన‌టులు టెక్నీషియ‌న్ల‌ను ప్రోత్స‌హిస్తాం.. అని తెలిపారు.

అవికా గోర్ మాట్లాడుతూ.. నిర్మాణ సంస్థను ప్రారంభించి నిర్మాత‌గా సినిమా తీయ‌డం జెమినితో క‌లిసి ప‌ని చేయ‌డం సంతోషంగా ఉంది. ఈ ఏజ్ లో ఈ ఘ‌న‌త న‌న్ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. తెలుగు ప్రేక్ష‌కులు న‌న్ను ఎంతో అభిమానించారు.. ప్రేమించారు. నా సినిమాల్ని తెలుగు ఆడియెన్ బాగా ఆద‌రించారు. ఆస్వాధించారు. వారంద‌రికీ థాంక్స్. ఈ సినిమా నాకు చాలా స్పెష‌ల్. నా టీమ్ లేకుండా ఏదీ లేదు. తెలుగు ఆడియెన్ కామెడీ ల‌వ్ చిత్రాల్ని విశేషంగా ఆద‌రిస్తారు. ఆ త‌ర‌హా ప్ర‌య‌త్న‌మే ఇది. నా టీమ్ ఎప్పుడూ చిరున‌వ్వుల‌తో పాజిటివ్ గా ప్రోత్స‌హిస్తున్నారు అని అన్నారు.

హీరో అనురాగ్ మాట్లాడుతూ.. ఇంత పెద్ద అవ‌కాశం ఇచ్చిన జెమిని సంస్థ‌కు ధ‌న్య‌వాదాలు. ప్రోత్స‌హించిన‌ ద‌ర్శక‌నిర్మాత‌ల‌కు థాంక్స్. ఇప్ప‌టివ‌ర‌కూ అన్నిప‌నులు విజ‌య‌వంతంగా సాగాయి. మంచి వినోదాత్మ‌క చిత్రం చేస్తున్నాం. మూర్తి గారి నుంచి మంచి స‌పోర్ట్ ఉంది.. అని అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు శ‌క్తికాంత్ మాట్లాడుతూ- ఇది ఒక మంచి అవ‌కాశం. జెమినితో ప‌ని చేయడం అదృష్టం. నా డ్రీమ్ నిజ‌మవుతోంది.. అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ-జెమిని స‌మ‌ర్ప‌కులు మూర్తి గారి ఆశీస్సుల‌తో ప్రోత్సాహంతో ముందుకు వెళుతున్నాం. అవిక గోర్ నాయిక‌గా ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ చేస్తున్నాం. నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన జెమిని సంస్థ‌కు ఎంతో రుణ‌ప‌డి ఉంటాను అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ-మార్చి 4 నుంచి తొలి షెడ్యూల్ చిత్రీక‌రిస్తాం. జూన్ 7 నుంచి రెండో షెడ్యూల్ పూర్తి చేస్తాం. ఆగ‌స్టు లో సినిమాని రిలీజ్ చే‌స్తాం అని తెలిపారు.

సంగీత ద‌ర్శ‌కుడు శ‌క్తి కాంత్ సార‌థ్యంలో ప్ర‌తిభావంతులైన‌ గాయ‌నీ గాయ‌కులతో ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం చేస్తున్నాం..యువ ప్ర‌తిభ‌ను వెలికి తీస్తామ‌ని జెమిని ఎఫ్‌.ఎక్స్ మూర్తి ఇదే వేదిక‌పై తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ర‌ఘు, క‌ళ: వెంక‌టేశ్వ‌ర‌రావు.
కో డైరెక్టర్ : పగడాల మధుసూదన్ రావు

Related posts

Leave a Comment