బాలమిత్ర సినిమా సమీక్ష

చిత్రం : బాలమిత్ర

నటి నటులు : రంగ, శశికళ, కియారెడ్డి, అనూష, దయానంద రెడ్డి, మీసాల లక్ష్మణ్ తదితరులు

సంగీతం: జయవర్ధన్

సినిమాటోగ్రఫీ: రజిని

ఎడిటర్: రవితేజ

ఫైట్స్: వెంకట్ మాస్టర్

కొరియోగ్రఫీ: విగ్నేష్ శుక్లా

ఆర్ట్: భీమేష్

నిర్మాతలు: శైలేష్ తివారి, బొద్దుల లక్ష్మణ్

కథ, దర్శకత్వం: శైలేష్ తివారి

విడుదల తేది : 26-02-2021

సాధారణంగా ఎక్క్కువుగా సస్పెన్స్ థ్రిల్లర్ , కామెడి థ్రిల్లర్ అనే సినిమాలను చూశాం మరి ఈ బాలమిత్ర సినిమా ట్రైలర్ చూస్తే మాత్రం మంచి ఎమోషనల్ టచ్ తో కూడిన థ్రిల్లర్ గా రూపొందిందని చిత్ర దర్శకుడితో పాటు మూవీ యూనిట్ అంత తమ ప్రమోషన్స్ లో హైలెట్ గా చెప్తూ వచ్చారు. దాదాపుగా అంతా కొత్త వాళ్ళతో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథ : ఎటువంటి వైద్య సదుపాయాలు లేని గ్రామం లో ఒక మంచి హాస్పిటల్ నిర్మించాలనే ఆలోచన కలిగిన ఒక అమ్మాయి ఊహించని పరిస్థులలో చనిపోతుంది. ఆ చావుకు అర్జున్ (రంగ), దీక్ష (అనూష) & వైశాలి (కియా రెడ్డి) పాత్రలకు సంబంధం ఏమిటి? వారి పాత్రాలతో కథ ఎటువంటి మలుపులు తిరింగింది? చివరికి ఆ గ్రామంలో హాస్పిటల్ నిర్మించాలనే ఆశయం నెరవేరిందా అనే తదితర విషయలాను సినిమా చూసి తెలుసుకోవాలి.

కథ విశ్లేషణ : ఓ మెడికల్ కాలేజ్ లోవైద్య విద్యను చదువుతున్న అర్జున్ దీక్ష లు కొన్ని రోజుల పరిచయం తర్వాత ప్రేమలో పడుతాడు. తన ప్రేమను వ్యక్త పరచాలనే సమయంలో దీక్షను గుర్తు తెలియని వ్యక్తి ద్వారా అపహరణకు గురి అవుతుంది. అలా తన కోసం వెతుకుతున్న అర్జున్ కు తెలియని మనిషి నుండి కాల్స్ రావడం తను చెప్పిన మనుషులను చంపకపోతే దీక్షను చంపుతానుఅని బెదిరించడం ఇలా సాగిపోతుంది. దీక్షను కాపాడుకోవాలి అంటె తాను చెప్పిన గ్రామానికి వెళ్లి అక్కడ అసలు ఏమి జరిగింది అనేది తెలుసుకుంటాడు అర్జున్. సినిమా మధ్యలో వచ్చే ట్విస్ట్లను తేరా పై చూడాల్సిందే. ఆ థ్రిల్లింగ్ఎలిమెంట్స్ కి కథ కు చాలా సంబంధం ఉంటుంది. ఆ తర్వాత తను దీక్షను ఎలా కాపడుకోగలిగాడు? చివరికి ఆ గ్రామానికి వైద్య సదుపాయం ఎలా లభించింది సినిమా ఎలా సుఖాంతం అయ్యింది అనేది కథ.

నటి నటుల పెర్ఫార్మెన్స్ : అంతా కొత్త నటి నటులతో రూపొందించిన ఈ సినిమాలో హీరోగా చేసిన రంగ కి ఇది రెండవ సినిమా తన పరిది మేరా బాగానే చేశాడు.. హీరోయిన్స్ గా చేసిన అనుష, కియా రెడ్డిలకు మొదటి సినిమా. అనుభవం లేకపొయిన తమదైన నటనతో మెప్పించే ప్రయత్నం చేశారు. వేల్లిపోమాకే అనే పాట బాగుంది. శశి కాల, దయానంద్ రెడ్డి లక్ష్మణ్ మీసల తదితరులు తమ పాత్ర మేరా నటించారు. దర్శకుడు శైలేష్ తివారి అంతా నూతన నటి నటులతో చేసిన ఈ సినిమా ఓ మంచి చిన్న సినిమా ప్రయత్నం గా నిలుస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి తగట్టుగా ఉన్నాయి. జయవర్ధన్ మ్యూజిక్ & బ్యాగ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు అనుగుణంగా ఇచ్చాడు.

 రేటింగ్ : 3/5

Related posts

Leave a Comment