‘బ్లూ ఐస్’ ట్రైలర్ మంచి రెస్పాన్స్ లభిస్తోంది, ఈ నెల 29న శ్రేయస్ ఈటీలో విడుదల – నిర్మాత మాదాల రామకృష్ణ !!!

డిజిటల్ వరల్డ్ లో ప్రస్తుతం మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు భారీ స్థాయిలో క్రేజ్ అందుతోంది. డబ్బింగ్ సినిమాలు కూడా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో ఎగబడి చూసేస్తున్నారు. ఇక సస్పెన్స్ థ్రిల్లర్ వండి చిత్రాలకు హై డిమాండ్ ఏర్పడుతోంది. అలాంటి సినిమా ఒకటి త్వరలో విడుదల కాబోతోంది. ఆఫ్రీన్ సిద్ధు, నాస్టియా రాయ్, నిశాంత్ వాలియా, ఆర్జే పృథ్వీ వంటి నటీనటులు నటించిన చిత్రం “బ్లూ ఐస్”. ఈ చిత్ర ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది

రాధా మాదవి ప్రొడక్షన్స్, రవళి చౌదరి సమర్పణలో మాదల రామకృష్ణ నిర్మించిన ఈ సినిమాకి రాజేష్ మూర్తి దర్శకుడు. సంగీతం ఎమ్.అనిరుధ్ అందించాడు. ఈ థ్రిల్లర్‌లో స్నేహితురాలు మర్మమైన పరిస్థితులలో చనిపోయినట్లు తెలుసుకున్న రోహిత్ హంతకుడిని తెలుసుకోవడానికి మోనికా సహాయం తీసుకుంటాడు. ఆమె, ఒక మనోరోగ వైద్యుడితో కలిసి, దారుణ హత్య రహస్యాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. ఇదే సినిమాలో అసలు పాయింట్. సినిమాలో థ్రిల్లింగ్ గా అనిపించే అంశాలు చాలానే ఉన్నాయి. ఇదివరకే రిలీజైన బ్లూ ఐస్ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాత మాదాల రామకృష్ణ మాట్లాడుతూ…
బ్లూ ఐస్ చిత్ర ట్రైలర్ కు విశేష స్పందన వస్తోంది. ఈనెల 29న శ్రేయస్ మా చిత్రం విడుదల కాబోతోంది. శ్రేయస్ యాప్ లో మా సినిమా చూడ్డానికి బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి, రోజుకు 150 నుండి 200 మంది బుక్ చేసుకుంటున్నారు. మరో కొత్త ట్రైలర్ ను విడుదల చెయ్యబోతున్నాము,

నటీనటులు:
ఆఫ్రిన్ సిద్దు, నాస్తియా రాయ్, నిశాంత్ వాలియ, ఆర్జె పృద్వి తదితరులు

టెక్నీషియన్స్:
బ్యానర్: రాధా మాధవి ప్రొడక్షన్స్
నిర్మాత: మాదాల రామకృష్ణ
సంగీతం: ఎమ్.అనిరుద్
దర్శకత్వం: రాజేష్ మూర్తి
పిఆరోఓ: మధు.విఆర్

Related posts

Leave a Comment