బ్రాందీ డైరీస్ సినిమా రివ్యూ

రివ్యూ : బ్రాందీ డైరీస్
తారాగణం : సునీత సద్గురు, నవీన్ వర్మ, కెవి శ్రీనివాస్, రవీంద్ర బాబు, దినేష్ మాడ్నె తదితరులు
సినిమాటోగ్రఫీ : ఈశ్వరన్ తంగవేలు
సంగీతం : ప్రకాష్ రెక్స్
ఎడిటర్ : యోగ శ్రీనివాస్
నిర్మాత : లెల్ల శ్రీకాంత్
దర్శకత్వం : శివుడు

కథ :
శేఖర్ డిప్యూటీ ఎమ్మార్వో. అవినీతి అంటే తెలియదు. దీంతో సంపాదించలేకపోతున్నాడని భార్యతో నిత్యం ఇబ్బందులు పడుతుంటాడు. శ్రీను సివిల్స్ కు ప్రిపేర్ అవుతుంటాడు. కానీ కెరీర్ లో స్థిరపడేందుకు ఇబ్బంది పడుతుంటాడు. వర్మ బాగా తెలివైనవాడు. ఏజ్ బార్ అయినా ప్రేమ పెళ్లి లేకుండా లైఫ్ ను గడిపేస్తుంటాడు. కోటి చెప్పుల దుకాణంలో పనిచేస్తుంటాడు. ఇక జాన్సన్ పనీపాట లేకుండా తిరుగుతుంటాడు. ఈ ఐదు పాత్రల మధ్య జరిగే కథే ఈ బ్రాందీ డైరీస్. వీళ్లంతా మందు కొట్టి తమ బాధలను, ఆనందాలను షేర్ చేసుకుంటుంటారు. ఆ క్రమంలో తనతో పాటు సివిల్స్ కు ప్రేపేర్ అవుతోన్న భవ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు శ్రీను. అయితే అతని తాగుడువల్ల వీరి లైఫ్ లో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. మరి అవేంటీ.. మందు వల్ల ఈ కథ ఏ తీరం చేరింది అనేది మిగతా కథ.

కథనంగా :
వీరు తాగుతూ మాట్లాడుకున్నా వారి నుంచి ఓ ఫిలాసఫీని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ముఖ్యంగా వర్మ క్యారెక్టర్ కు అందకు బాగా వాడుకున్నాడు. ఇక ఈ ఐదు పాత్రలకూ ఓ కథ ఉంటుంది. ఎమోషన్ ఉంటుంది. నేపథ్యం ఉంటుంది. ఆ ఐదు పాత్రలూ సమాజాన్ని రిప్రెజెంట్ చేస్తూ .. సినిమా చూస్తోన్న ప్రతి ఒక్కరూ తమను తాము ఐడింటిఫై చేసుకునేలా ఉంటుంది కథనం. ఈ విషయంలో దర్శకుడి టేస్ట్ కే కాదు.. కథనానికీ మంచి మార్కులు పడతాయి. ఈ కారణంగానే ఇది సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కంటే రియాలిటీగా ఎక్కువగా ఆకట్టుకుంటుంది. దర్శకుడు చేసిన మరో మంచి పని అన్ని పాత్రలనూ వీలైనంత ఎక్కువ సహజంగా రాసుకోవడం, చూపించడం. కొన్ని కథలను వాస్తవిక కోణంలో చూపడం అనేదే తెలివైన నిర్ణయం. దీనివల్లే మనకు కొన్ని పాత్రలను కాకుండా కొందరు మనుషుల లైఫ్ ను చూస్తున్న అనుభూతి కలుగుతుంది. మొత్తంగా బ్రాందీ నేపథ్యంలో ఐదుగురు వ్యక్తుల జీవితాల్ని స్పృశిస్తూ ఓ ఫిలాసఫీలాంటిది చెప్పే ప్రయత్నం చేసినా ఎంటర్టైన్మెంట్ కు ఏ కొదవా ఉండదు. ఆ విషయంలో యూత్ కు ఇంకా బాగా నచ్చే సన్నివేశాలు చాలానే ఉన్నాయి.
సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ ఆర్టిస్టులు. ప్రతి ఒక్కరూ ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. ఇదంతా తమ లైఫ్ కూడా అన్నట్టుగానే ఆ పాత్రలు ప్రవర్తిస్తాయి. నిజంగా ఇలాంటి కథలకు అలాంటి ఆర్టిస్టులు దొరికడం పెద్ద ఎసెట్. హీరోయిన్ గా చేసిన భవ్య బావుంది. తన నవ్వుకు కుర్రకారు పడిపోతారంతే.
టెక్నికల్ గానూ సినిమా బావుంది. సినిమాటోగ్రఫీ సూపర్బ్. మ్యూజిక్ కథకు తగ్గట్టుగా నేచురల్ గా కుదిరింది. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడు శివుడుకు మరిన్ని మంచి ఆఫర్స్ వస్తే ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాడు అనిపిస్తుంది. మొత్తంగా టైటిల్ ను చూసి ఇదేదో తాగుబోతు సినిమా అనుకోకుండా.. ఓ మంచి కథాబలం ఉన్న సినిమా చూడాలనుకుంటే మీ ఫస్ట్ ఛాయిస్ ఈ బ్రాందీ డైరీస్ కు వేయొచ్చు.. మంచి సినిమా చూసిన కిక్ గ్యారెంటీగా పొందుతారు.

రేటింగ్ – 3/5

Related posts

Leave a Comment