‘బుల్లెట్ సత్యం’ టైటిల్ & సాంగ్ లాంచ్..

సాయితేజ ఎంటర్టైన్మెంట్ పతాకం పై దేవరాజ్,సోనాక్షి వర్మ హీరో,హీరోయిన్ లుగా మదుగోపు దర్శకత్వంలో దేవరాజ్ నిర్మిస్తున్న ‘బుల్లెట్ సత్యం’ చిత్రం యొక్క టైటిల్, లిరికల్ వీడియో సాంగ్ ను హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో విడుదల చేసారు
.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత రాజకందుకూరి,డైరెక్టర్ వీర శంకర్,దేవి ప్రసాద్,సంజయ్ రెడ్డి లు చిత్రం యొక్క లిరికల్ సాంగ్ విడుదల చేసారు అనంతరం …

ముఖ్య అతిధి గా వచ్చిన.ప్రముఖ డైరెక్టర్ వీరశంకర్ మాట్లాడుతూ…
ఈ సినిమా టైటిల్ చాలా పాజిటివ్ గా ఉంది. ఈ చిత్రానికి రాంబాబు గారు చక్కటి సాహిత్యాన్ని అందించారు..మంచి సినిమాలకు మంచి లిరిక్ రైటర్ ఎంతో అవసరం…దేవరాజ్ గారు కరోనా టైం లో ముందుకు వచ్చి చిత్రాన్ని నిర్మించడమే కాక హీరోగా నటించారు.ఇలాంటి వారు ఇండస్ట్రీ కు ఎంతో అవసరం..డైరెక్టర్ మధు కు ఇది రెండవ చిత్రం..హీరోయిన్ గా చేసిన సోనాక్షి కి అల్ ద బెస్ట్ అని చెప్పారు…

దేవి ప్రసాద్ మాట్లాడుతూ. . “బుల్లెట్ సత్యం టైటిల్ చాలా బాగుంది..రాంబాబు మంచి పాటలు రాశారు..యాజమాన్య మంచి సంగీతం ఆదించారు..చిన్న మూవీ అయినా కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారు.. ఈ మూవీ కు మంచి విజయం దక్కాలని” అన్నారు.

ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ…”టైటిల్ చాలా క్యాచీ గా ఉంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ కథ..పాయింట్ బాగుండి రీజనబుల్ టేకింగ్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా” ఆదరిస్తారు.

సంజయ్ రెడ్డి మాట్లాడుతూ .. ‘జార్జ్ రెడ్డి’ లోని బుల్లెట్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఈ బుల్లెట్ సత్యం కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని అన్నారు..

చిత్ర నిర్మాత, హీరో దేవరాజ్ మాట్లాడుతూ .. “ఈ చిత్రం యొక్క కథ విలేజ్ బ్యాక్ డ్రాప్ సాగుతుంది..నేను ఈ చిత్రం లో మొదటిసారిగా హీరో గా నటించాను.మీరందరూ నన్ను ఆదరించి ఈ సినిమాను హిట్ చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

హీరోయిన్ సొనాక్షి వర్మ మాట్లాడుతూ .. నా పేరు సోనాక్షి వర్మ నేను ఇండస్ట్రీ కు వచ్చి నాలుగు సంవత్సరాలు అయ్యింది..నేను యాడ్ లు, షాట్ ఫిలిమ్స్ లో నటించాను..నా గ్రాడ్యుయేషన్ పూర్తి అయింది..నాకు తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. నన్ను గుర్తించి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ,దర్శక,నిర్మాత లకు నా కృతజ్ఞతలు.

మ్యూజిక్ డైరెక్టర్ యాజమాన్య మాట్లాడుతూ .. బుల్లెట్ సత్యం సాంగ్స్ పాటలు జనాల్లోకి బుల్లెట్ లాగా దూసుకు పోతున్నాయి.పాటల్లాగే.సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను” అన్నారు.

లిరిక్ రైటర్ రాంబాబు గోశాల మాట్లాడుతూ “ఈ చిత్రంలో అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.ఇందులో.ప్రతి పాట సందర్భానుసారంగా వచ్చాయి..ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావాలని” కోరుకుంటున్నాను.

డైరెక్టర్ మధు మాట్లాడుతూ .. “ఇది నాకు రెండవ చిత్రం..విలేజ్ బ్యాక్ డ్రాప్ కథ ఈ చిత్రం లోని సాంగ్స్ అన్ని బాగుంటాయి..వచ్చే నెల సినిమా థియేటర్లు ఓపెన్ అయితే గ్రాండ్ రిలీజ్ చేద్దామని చూస్తున్నాము..లేదా att ద్వారా రిలీజ్ చేద్దామని” అనుకుంటున్నాము. ఈ చిత్రం ఎక్కడా కూడా సినిమా టిక్ గా ఉండదు..రియాలిస్టిక్ గా ఉంటుంది..ఈ చిత్రం లో హీరో, హీరోయిన్లు చక్కగా నటించారు..ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్లందరికీ కృతజ్ఞతలు..

చంద్ర కిరణ్ మాట్లాడుతూ .. “ఈ సినిమాకు కొరియోగ్రాఫర్ గా చేసే అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు.” తెలిపారు.

నటీ నటులు :
దేవరాజ్, సోనాక్షి వర్మ,వినోద్ కుమార్,మోనా తాకుర్, సంజయ్ రెడ్డి,చంటి,ధన్ రాజ్,అప్పారావు,శివ లీల,సత్తెన్న,వాసు,రాకేష్,చేతన్.

టెక్నీషియన్స్

డైరెక్టర్ : మదు గోపు

నిర్మాత : పోతూరి పవిత్ర

మ్యూజిక్. : వినోద్ యాజమాన్య

డి ఓ పి. : G. L. బాబు

ఎడిటర్ : S. B.ఉద్ధవ్

కొరియోగ్రఫీ : చంద్ర కిరణ్
లిరిక్స్..రాంబాబు గోషాల

ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ

రచన-సహకారం : సంజయ్ బంగారపు

Related posts

Leave a Comment