“ఛలో ప్రేమిద్దాం” సినిమా రివ్యూ


ఆర్టిస్టులు : సాయి రోనక్, నేహా సోలంకి, పోసాని, సిజ్జు, నాగినీడు తదితరులు
నిర్మాత : ఉదయ్ కుమార్
దర్శకత్వం : సురేష్ శేఖర్ రేపల్లె

ట్రైలర్ తో ఆకట్టుకుని మంచి ప్రేమకథా చిత్రం అనిపించుకున్న సినిమా ఛలో ప్రేమిద్దాం. ఇవాళ థియేటర్స్ లో విడుదలైంది. టైటిల్ తో పాటు మెయిన్ లీడ్ చేసిన కపుల్ బావున్నారు అనిపించుకున్న ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం..

కాంతారావు(సాయి రోనక్) స్టూడెంట్. సిటీలో చదువుతూ అక్కడే తన సహధ్యాయిని మధు(నేహా)ని ప్రేమిస్తాడు. ఓ సారి ఇద్దరు కలిసి మధు అక్క పెళ్లికి వెళతారు. ఆ ఊరి పెద్ద అయిన మధు తండ్రికి శతృవులు ఎక్కువ. వారి నుంచి కాపాడేందుకు అతని అనుచరులు ప్రయత్నిస్తుంటారు. అయితే రావు అక్కడికి వెళ్లాక అతని శతృవులను మారుస్తుంటాడు. దీంతో ఓ సారి సడెన్ గా కాంతారావుపై హత్యాయత్నం కేస్ పెడతారు కొందరు. మరోవైపు అతని లవ్ మధును కిడ్నాప్ చేసి చంపుతామని బెదిరిస్తుంటారు. మరి ఈ గొడవ నుంచి కాంతారావు ఎలా బయటపడ్డాడు. తన ప్రేయసిని కాపాడుకున్నాడా లేదా అనేది కథ.

ఓ మంచి ప్రేమకథకు మంచి జంట కుదరడం ముఖ్యం. ఈ సినిమాలో అది కుదిరింది. సాయి రోనక్, నేహా సోలంకి జంట చూడముచ్చటగా ఉంది. అందుకే సినిమా ఆరంభంలోనే మంచి ఫీల్ క్రియేట్ అవుతుంది. వీరి మధ్య వచ్చే సన్నివేశాలను కూడా కొత్త రాసుకున్నాడు దర్శకుడు. ఎప్పుడైతే కథ విలేజ్ లోకి ఎంటర్ అవుతుందో.. అక్కడి నుంచి కొత్త మలుపులు తిరుగుతూన లవ్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయిన.. విలన్స్ ను మార్చేందుకు హీరో వేసే ఎత్తులు.. వాటి రిజల్ట్స్ అన్నీ ఫన్నీగానూ ఆకట్టుకునేలానూ కనిపిస్తాయి. దీంతో మాగ్జిమం బోర్ అనే మాటే రాకుండా సాఫీగా సాగిపోతుంది సినిమా. హీరోయిన్ ఛలాకీగా ఉంటూ కావాల్సినంత ఎంటర్టైన్ చేస్తుంది. అలాగే పోసాని పాత్రతో కూడా మంచి కామెడీ రాబట్టారు. సెకండ్ హాఫ్ లో శశాంక్, నాగినీడు పాత్రలు ఎంటర్ అయ్యాక కాస్త సీరియస్ మోడ్ లోకి వెళ్లినా.. ఆ టెంపోని మెయిన్టేన్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా చూసుకున్నాడు దర్శకుడు. అతను రాసుకున్న డైలాగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టోరీ ఉన్నా.. సెకండ్ హాఫ్ సగం నుంచి సినిమా యాక్షన్ మోడ్ లోకి వెళుతుంది. చివరగా విలన్ ఎవరు అనే ట్విస్ట్ రివీల్ చేయడంతో ఆడియన్సెస్ కూడా ఊహించని ఆ ట్విస్ట్ కు సర్ ప్రైజ్ అవుతారు. మొత్తంగా ఓ మంచి సినిమా చూశాం అనే ఫీల్ తోనే ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకు వస్తాడు.
ఇక ప్రధాన పాత్రల్లో నటించిన సాయి రోనక్, నేహా సోలంకి ఇద్దరూ చాలా బాగా నటించారు. ఈ ఇద్దరి జంట కూడా చాలా బావుంది. ఇతర పాత్రల్లో పోసాని, హేమ, నాగినీడు, శశాంక్, సిజ్జు వంటి వారు ఆకట్టుకుంటారు. మంచి నటన చూపించారు.
సినిమాటోగ్రఫీ బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. దర్శకుడు ఎడిటింగ్ పరంగా మరికొన్ని కట్స్ చేయించాల్సి ఉంది. దర్శకుడుగా తొలి సినిమా అయినా శేఖర్ బాగా రాసుకున్నాడు తీశాడు కూడా.

ఓవరాల్ గా : ఛలో చూసేద్దాం..

రేటింగ్ : 3/5

Related posts

Leave a Comment