‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంలో ‘అమృత..’ సాంగ్‌ను విడుద‌ల చేసిన మెగాస్టార్ చిరంజీవి

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్‌.ఎల్‌.పి బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌`. సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమా నుండి ‘అమృత‌… ’ అనే సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. సాయితేజ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సాంగ్ విడుద‌లైంది. మెగాస్టార్ చిరంజీవి  ఈ సాంగ్‌ను ట్విట్ట‌ర్‌లో విడుద‌ల చేస్తూ  సాయితేజ్‌కు పుట్టిన‌రోజు అభినంద‌న‌లు తెలిపారు. ‘ఇదే నా బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్. ఈ బర్త్‌డేను స్పెష‌ల్ బ‌ర్త్‌డే చేసిన మావ‌య్య‌కు థాంక్స్‌. మీ ఆశీర్వాదాలకంటే నాకింకేం అక్క‌ర్లేదు. థాంక్యూ సోమ‌చ్ మామ‌య్య‌’ అంటూ సాయితేజ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.  మ్యూజిక్ సెన్సేషన్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీత సార‌థ్యంలో కాస‌ర్ల‌శ్యామ్ రాసిన ఈ పాట‌ను న‌కాష్ అజీజ్ పాడారు. ‘‘  బ‌ల్బు క‌నిపెట్టినోడికే బ‌తుకు సిమ్మ‌చీక‌టై పోయిందే…సెల్‌ఫోన్ కంపెనోడికే సిమ్ కార్డే బ్లాక్ అయ్యిపోయిందే..రూటు చూపే గూగులమ్మ‌నే ఇంటి రూటునే మ‌ర‌చిపోయిందే..రైటు టైము చెప్పే వాచీకే బ్యాడు టైమే స్టార్టై పోయిందే..అగ్గిపుల్ల నేనే మెల్ల‌గా కాల్చుతుంటే సొంత కొప‌నే ఫుల్లుగా అంటుకున్నాదే పాస్ట్ లైఫ్‌లో నేను చెప్పిన యెద‌వ మాటే..బ్రైటు ఫ్యూచ‌రే త‌గ‌లెడుతుందే..ఒగ్గేసి పోకే అమృత నేను త‌ట్టుకోక మందు తాగుతాఒట్టేసి చెప్తున్న అమృత నువ్వు యెల్లిపోతే ఒంట‌రైపోతా ..  ’’ అంటూ సాగే ఈ పాట హీరోయిన్ తనను విడిచిపెట్టి వెళ్లిపోతుందనే బాధతో హీరో పాడే పాట. ఈ పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే విడుదలైన ‘నో పెళ్లి ..’సాంగ్‌తో పాటు ‘హే ఇది నేనేనా..’ సాంగ్‌ల‌కు కూడా అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. 

న‌టీన‌టులు:సాయితేజ్‌, న‌భా న‌టేశ్ త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:ద‌ర్శ‌క‌త్వం:  సుబ్బునిర్మాత‌:  బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌ఆర్ట్‌:  అవినాష్ కొల్ల‌ఎడిట‌ర్‌:  న‌వీన్ నూలిసంగీతం: త‌మ‌న్‌సినిమాటోగ్ర‌ఫీ:  వెంక‌ట్ సి.దిలీప్‌

Related posts

Leave a Comment