హృదయాలను హత్తుకునే కావ్యం లాంటి ప్రేమకథ… డియర్ మేఘ

హృదయాలను హత్తుకునే ప్రేమకథ… డియర్ మేఘ

అందమైన… సున్నితమైన ప్రేమకథ… డియర్ మేఘ

కథ.. తుంగభద్ర.. గరుడ వేగ… చీకటి గదిలో చితక్కకొట్టుడు చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ క్రేజ్ ని సంపాదించుకున్న అదిత్
అరుణ్… ఇప్పుడు “డియర్ మేఘ” అంటూ. లై, రాజ రాజ చోర మూవీస్ తో ఆకట్టుకున్న మేఘా ఆకాష్… టైటిల్ రోల్ పోషించింది.
మరో కుర్ర హీరో అర్జున్ సోమయాజులు ఓ కీలకమైన పాత్ర పోషించారు. ట్రయాంగిల్ లవ్ స్టొరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి
దర్శకత్వం వహించారు.
వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై తొలి చిత్రంగా “డియర్ మేఘను” నిర్మించారు నిర్మాత అర్జున్ దాస్యన్. ఈ
చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సున్నితమైన… అందమైన ప్రేమకథ ఎలా ఆకట్టుకుందో చూద్దాం.

కథ: మేఘ(మేఘా ఆకాష్),.అర్జున్(అర్జున్ సోమయాజులు) ఇద్దరూ క్లాస్ మేట్స్. మేఘా.. అర్జున్ ని చాలా గాఢంగా ప్రేమిస్తూ
ఉంటుంది. అయితే ఆ విషయం.. అర్జున్ ముందు వెల్లడించడానికి చాలా భయపడిపోతూ ఉంటుంది. చివరకు ధైర్యం తెచ్చుకొని అర్జున్
కి అసలు విషయం చెబుతుంది. అయితే అర్జున్ కూడా మేఘాను తెగ ఇష్టపడుతూ… ఆమెను ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని ప్రయత్నించే
పలు సందర్భాలను మేఘాకు వివరిస్తాడు. ఇలా ఒకరినొకరు బాగా ఇష్టపడి ప్రేమించుకున్న జంట జీవితం ఎలాంటి మలుపు తిరిగింది?
మేఘా జీవితంలోకి అదిత్ ఎలా వచ్చాడు? అతన్ని మేఘ ఎందుకు ప్రేమిస్తుంది? అర్జున్.. అదిత్ ల లవ్ స్టొరీలకు ఎండ్ కార్డ్ ఎలా
పడింది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడండి.

విశ్లేషణ:
కొన్ని కథలు రిలీజ్ కు ముందే ఆసక్తిని పెంచుతాయి. అలాంటిదే ఈ డియర్ మేఘ. దియా అనే టైటిల్ తో కన్నడలో వచ్చి ఆల్రెడీ హిట్
అయిన ఈ కథను తెలుగులోనూ అంతే ప్రతిభావంతంగా తెరకెక్కించారు. అయితే ఇది రెగ్యులర్ లవ్ స్టోరీల్లాంటి సినిమా కాదు. కంప్లీట్
ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ. ఫంకీ డైలాగ్స్, రొటీన్ సాంగ్స్, సీన్స్ కనిపించవు. అదే డియర్ మేఘను ప్రత్యేకంగా చూపిస్తుంది.
ఇంతకు ముందు ఎన్నో ట్రైయాంగిల్ లవ్ స్టోరీస్ చూసినా.. ఈ మూవీలోని ఎమోషన్ గతంలో చూసి ఉండము.
పరిమితమైన పాత్రలతో అనవసర సన్నివేశాలు లేకుండా చెప్పాలనుకున్న పాయింట్ ను సూటిగా చూపించిన సినిమా డియర్ మేఘ.
ఎన్ని ప్రేమకథలు చూసినా తొలిప్రేమ ఎప్పటికీ మరచిపోలేనిది. టీనేజ్ లోకి అడుగుపెట్టగానే ప్రతి మనసూ ప్రేమలో పడుతుంది. ఆ ప్రేమ
సక్సెస్ కాకపోయినా మర్చిపోవడం జరగదు. అలా టీనేజ్ లోనే లవ్ లో పడి తన ప్రేమను చెప్పలేకపోయిన ఓ అమ్మాయికి మూడేళ్ల
తర్వాత అవతలి వ్యక్తే వచ్చి ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం లేకుండా అతను అనూహ్యంగా
దూరమవుతాడు. ఆ ఒంటరి తనం నుంచి బయటపడేందుకు మేఘ చేసిన ప్రయాణం మరో మలుపు తీసుకుంటుంది. ఆ మలుపులోనూ
తన ప్రేమను మర్చిపోలేని ఆమె చివరికి ఏం చేసింది అనేది అత్యంత హృద్యంగా తెరకెక్కించాడు దర్శకుడు.
ఇంత గొప్ప ప్రేమకథను తమదైన నటనతో మరో మెట్టుపైకి తీసుకువెళ్లారు మేఘా ఆకాశ్, అదిత్ అరుణ్, అర్జున్. ముఖ్యంగా మేఘా
ఆకాశ్ కిది కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. మొదట్లో ఛలాకీగా పరిచయమై ఆ తర్వాత తనూ ఎమోషనల్ అయ్యే పాత్రలో అదిత్
అదరగొట్టాడు. అర్జున్ సైతం తన పాత్రను బాగా పోషించాడు. తల్లికొడుకుల మధ్య వచ్చే సీన్స్ అన్నీ వెరీ టచింగ్ గా ఉంది. మొత్తంగా ఈ
మధ్య కాలంలో వచ్చిన ది బెస్ట్ ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ డియర్ మేఘ.

టెక్నికల్ గానూ డియర్ మేఘ ఆకట్టుకుంటుంది. హరి గౌర బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. నేపథ్య సంగీతం సహజంగా కుదిరింది.
సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. ప్రతి ఫ్రేమ్ అందంగా కనిపిస్తుంది. ఎడిటింగ్ చాలా క్రిస్పీగా ఉంది. నిర్మాత అర్జున్ దాస్యం నిర్మాణ
విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఇక దర్శకుడు విషయం ఉన్నవాడు. ఆల్రెడీ గతంలోనే ఓ స్వీయ ప్రయత్నంతో ఆకట్టుకున్నాడు.
డియర్ మేఘ రీమేక్ ను పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశాడు. మొత్తంగా ఈ వీకెండ్ కు డియర్ మేఘ ఓ మంచి ఛాయిస్ అని ఖచ్చితంగా
చెప్పొచ్చు.

హృదయాలను హత్తుకునే కావ్యం లాంటి ప్రేమకథ… డియర్ మేఘ

రేటింగ్: 3/5

Related posts

Leave a Comment