ప్రేమకు అర్థం చెప్పే దేవరకొండలో విజయ్ ప్రేమ కథ

చిన్న సినిమా శక్తి టాలీవుడ్ కు తెలియంది కాదు. కంటెంట్ బాగున్న ఎన్నో చిన్న సినిమాలు ప్రేక్షకాదరణ పొంది ఘన విజయం సాధించాయి. కొత్తగా ఉండి ఆకట్టుకుంటే చాలు చిన్న చిత్రానికి తిరుగులేదు. ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాల్లో ప్రేక్షకుల్లో ఆసక్తిరేపిన సినిమా దేవరకొండలో విజయ్ ప్రేమ కథ. ట్రైలర్స్, పాటలతో ఆకట్టుకున్న ఈ సినిమా…థియేటర్లోనూ మెప్పించిందా..లేదా సమీక్షలో చూద్దాం..

కథేంటంటే…

దేవరకొండ గ్రామ పెద్ద సీతారామయ్య (నాగినీడు). అంతా అమ్మాయిగారు అని ముద్దుగా పిల్చుకునే ఆయన కూతురు దేవకి (మౌర్యాని). సీతారామయ్యకు కూతురే లోకం. ఆమెను ప్రాణంగా చూసుకుంటాడు. అయితే పరువు, గౌరవాల దగ్గరకు వస్తే కూతురు కంటే అవే ఎక్కువ అంటాడు. అలాంటి వ్యక్తి తన కూతురు ఓ పేదింటి కుర్రాడిని ప్రేమిస్తే అంగీకరిస్తాడా, తనకు కూతురే లేదు అంటూ ప్రేమికుడితో సహా కూతుర్ని ఊరు నుంచి వెలివేస్తాడు. ఇలా దేవకి, ఆమె ప్రేమించిన యువకుడు ఆటో డ్రైవర్ విజయ్ (విజయ్ శంకర్) ఊరి పొలిమేరలకు వెళ్లిపోతారు. ఆటో ఒక్కటే వారికి జీవనాధారం. దేవకి చదువులు కొనసాగిస్తుండగా, విజయ్ పోషణ బాధ్యతలు తీసుకుంటాడు. జీవితాల్లో ఎదిగి, తమ తల్లిదండ్రులు గర్వించేలా చేయాలనేది వారి కోరిక. ఈ లక్ష్యాన్ని చేరుకునేలోపే ఈ జంటకు ఒక తట్టుకోలేని నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏంటి, ఆ విషయం తెలిశాక ఎలా గుండె ధైర్యంతో వ్యవహరించారు, చివరకు ఏమైంది అనేది మిగిలిన కథ.

రివ్యూ చూస్తే..

కుల, మతాలు, ఆస్తులు, అంతస్తులు వంటి సామాజిక తేడాల వల్ల ప్రేమ కథల్లో ఇబ్బందులు వస్తుంటాయి. ఇవి చాలా వరకు సినిమాల్లో మనం చూసి ఉంటాం. కానీ ఈ ప్రేమ కథకు దర్శకుడు వెంకటరమణ ఎస్. ఒక కొత్త అంశాన్ని జత చేసి దాన్నే కీలకంగా మార్చేశాడు. అది మంచి సందేశం అవడం వల్ల దేవరకొండలో విజయ్ ప్రేమ కథకు ఓ ప్రత్యేకత వచ్చింది. లేకుంటే ఈ సినిమా ఏడాదికి వచ్చే వంద లవ్ స్టోరీల్లో ఒకటిగానే మారిపోయేది. విజయ్ శంకర్ హీరోగా మంచి మాస్ సాంగ్ తో ఎంట్రీ ఇస్తాడు. అతను ఫిజిక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటాయి. ఊరిలో ఓ ఆటో డ్రైవర్ ఎలా బిహేవ్ చేస్తాడో అలాగే కనిపించాడు. మౌర్యాని పెద్దింటి అమ్మాయిలా చక్కగా నటించింది. పెళ్లయ్యాక ఓ ఆడ పిల్ల భర్తే సర్వస్వం అనుకుంటుంది. మౌర్యాని ఈ మెచ్యూరిటీ తన ఫర్మార్మెన్స్ లో చూపించింంది. కూతురిగా, భార్యగా, కాబోయే తల్లిగా మౌర్యాని చూపిన నటన సినిమా మొత్తానికి హైలైట్.

కొత్త ప్రయత్నం హీరో హీరోయిన్లు, దర్శకుడు చేస్తేనే సరిపోదు..మంచి టెక్నికల్ టీమ్ సపోర్ట్ ఉండాలి. సంగీత పరంగా ఆ సహకారం సదాచంద్ర అందించారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ సినిమాను బలంగా మార్చాయి. ఇతర కీలక పాత్రల్లో శివన్నారాయణ, నాగినీడు, రచ్చ రవి, గోవిందరావు లాంటి నటులు తమ సత్తా చాటారు. శివన్నారాయణ, రచ్చ రవి తమ కామెడీతో సినిమాలోని ఎమోషన్ ను బ్యాలెన్స్ చేశారు. మొత్తంగా ఓ మరుపురాని ప్రేమ కథను చూసిన ఫీలింగ్ ఈ చిత్రంతో తప్పక కలుగుతుంది.

రేటింగ్ 3/5

Related posts

Leave a Comment