ఔట్ & ఔట్ కామెడీ యాక్షన్ ఏంటర్ టైనర్ “ధగఢ్ సాంబ” సినిమా రివ్యూ

‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన. బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌బాబు ప్రస్తుతం ‘ధగఢ్ సాంబ’ అనే స‌రికొత్త టైటిల్‌తో మనముందుకు వచ్చారు. బి.ఎస్. రాజు సమర్పణలో ప్రవీణ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సంపూర్ణేష్ బాబు, సోనాక్షి హీరో హీరోయిన్లుగా ఎన్.ఆర్. రెడ్డి దర్సకత్వంలో తెరకెక్కిన ”ధగడ్ సాంబ” చిత్రాన్ని నిర్మాత ఆర్ ఆర్. బీహెచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మించారు.  మే 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఏంటర్ టైన్ చేసిందో..రివ్యూలో చూద్దాం.

కథ :
ధగడ్ సాంబ (సంపూర్ణేష్ బాబు)ఒక చిన్న ప్రాబ్లమ్ వల్ల చిన్నపుడు తన ఊరి సర్పంచ్ చేతిలో  మోసపోతాడు. అలా తనలాగా ఎవ్వరూ మోసపోకూడదని హైదరాబాద్ వచ్చి మోసం చేసే ముఠాను ఒక పట్టు పడతాడు. ఈ క్రమంలో సాంబకు ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. అలా సాగుతున్న సమయంలో మనుషుల రూపంలో ఉన్న దయ్యాలలాగా అందరిని నమ్మించే ఒక ముఠా ను సాంబ ఏ విధంగా శిక్షించాడు ? ఆ ముఠా ఎటువంటి నేరాలు చేస్తుంది ? ఈ క్రమంలో సాంబకు పరిచయం అయిన అమ్మాయి చివరికి సాంబను కలుస్తుందా వంటి విషయాలు తెలియాలంటే దగఢ్ సాంబ సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు
చాలా రోజుల తరువాత సంపూ నుండి ఆడియన్స్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఇప్పటివరకు ఎక్కువగా కామెడీ రోల్ లో నటించాడు . ఇందులో మొదటి సాటి హర్రర్ వైపు అంటే సీరియస్ గా వుండే డీఫ్రెంట్ సబ్జెక్ట్ చేశాడు  హీరోయిన్ సోనాక్షి  కొత్త అమ్మాయి అయినా డ్యాన్స్ పరంగా యాక్టింగ్ పరంగా చాలా బాగా చేసింది.నటి జ్యోతి పాత్ర Dhagadh Samba movie reviewసినిమాకు అదనపు ఆకర్షణ. చలాకి చంటి, మిర్చి మాధవి, ఆనందభారతి, పిడి.రాజు పాత్రలు సినిమా కథలో వచ్చి సినిమా పూర్తి అయ్యే వరకు మనతో ఉండి నిలిచిపోతాయి. జబర్దస్త్ అప్పారావు పాత్ర సినిమాకు మరో హైలెట్, సంపూర్ణేష్, అప్పారావు కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి.

విశ్లేషణ
దర్శకుడు ఎన్.ఆర్.రెడ్డి ఎంచుకున్న పాయింట్ బాగుంది. సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి చివరివరకు ప్రేక్షకులను ఏంటర్ టైన్ చేసే విధంగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు.కొబ్బరి మట్ట, సింగం 123, పెదరాయుడు వంటి సినిమాలో భారీ డైలాగ్స్ వున్నా ఈ సినిమాలోని డైలాగ్స్ డీఫ్రెంట్ గా ఉంటాయి. ఈ సినిమాలో సెంటిమెంట్ తో పాటు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ ఫైట్స్ మరియు ఎన్నో.. ట్విస్ట్ టర్న్స్ తో ప్రేక్షకులను ఈ సినిమా మెస్మరైజ్ చేస్తుంది. దర్శకుడికి ఈ సినిమా మొదటి చితమైనా చాలా చక్కగా తెరకెక్కించాడు. ‘దగడ్ సాంబ’ సినిమా ద్వారా దర్శకుడుకి మంచి గుర్తింపు లభిస్తుంది. ముజీర్ మాలిక్ కెమెరా వర్క్ గురించి చెప్పనవసరం లేదు . రాజు మాస్టర్ అసిస్టెంట్స్  ఫైట్స్ , యాక్షన్స్ సీన్స్ సినిమాకి ప్లస్‌ పాయింట్స్ , డేవిడ్.జి పాటలతో పాటు నేపధ్య సంగీతం బాగా ఇచ్చాడు. ఎడిటర్ కె.ఎ. వై.పాపారావు ఎడిటింగ్ నీట్ గా ఉంది.భారీ సినిమాలు, ఆర్.ఆర్ ప్రవీణ క్రియేషన్స్ పై ఈ సినిమాను నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఖర్చుకు వెనుకాడకుండా  నిర్మించారు, ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. ఈ ‘ధగడ్ సాంబ’ సినిమాను పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేయచ్చు. చూసిన వారందరికీ తప్పక నచ్చుతుంది.

రేటింగ్ :3/5

Related posts

Leave a Comment