గ్యాంగ్ స్టర్ గంగ రాజు…సినిమా సమీక్ష

నటీనటులు: లక్ష్ చదలవాడ, వేదిక ద‌త్త‌, వెన్నెల కిషోర్‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, గోప‌రాజు ర‌మ‌ణ‌, నిహార్ క‌పూర్‌, రాజేశ్వ‌రి నాయ‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, ర‌వితేజ‌ న‌న్నిమాల‌, స‌మ్మెట గాంధీ, రాజేంద్ర‌, అను మాన‌స‌, లావ‌ణ్య రెడ్డి, అన్న‌పూర్ణ త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం: ఇషాన్ సూర్య‌
నిర్మాత‌: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్
సినిమాటోగ్ర‌ఫీ: క‌ణ్ణ పి.సి.
సంగీతం: సాయి కార్తీక్‌
ఎడిట‌ర్‌: అనుగోజు రేణుకా బాబు
ఫైట్స్‌: డ్రాగ‌న్ ప్ర‌కాశ్‌
కొరియోగ్రాఫ‌ర్స్‌: భాను, అనీష్‌
పి.ఆర్‌.ఓ: సాయి స‌తీశ్‌, ప‌ర్వ‌త‌నేని రాంబాబు

లక్ష్ చదలవాడ, వేదిక ద‌త్త‌ జంటగా నటించిన చిత్రం గ్యాంగ్ స్టర్ గంగరాజు. చరణ్ విలన్ గా నటించాడు. తెలుగు సినిమా పరిశ్రమకు భారీ విజయాలు అందించిన నిర్మాత చదలవాడ కృష్ణమూర్తి కుటుంబం నుంచి వచ్చిన లక్ష్… గ్యాంగ్‌స్టర్ గంగరాజులో ఫుల్ మాస్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్‌కు ముందే వచ్చిన టీజర్లు, ట్రైలర్లు మంచి బజ్ క్రియేట్ చేశాయి. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం అలరించిందో చూద్దాం పదండి.

కథ: దేవరలంక గ్రామంలో బాధ్యతలేకుండా అల్లరిగా తిరిగే యువకుడు గంగరాజు. చిన్నతనంలో తల్లి చనిపోవడంతో గారాబంగా పెరుగుతాడు. రైల్వేలో ఉద్యోగం చేసిన తండ్రి రిటైర్మెంట్ కావడంతో డిపార్ట్‌మెంట్ చేత సన్మానం పొందుతాడు. అలా సన్మానం అందుకొన్న తండ్రి… సిద్దప్ప అనే గ్యాంగ్‌స్టర్ చేతిలో తీవ్ర అవమానానికి గురికావడాన్ని గంగరాజు తట్టుకోలేకపోతాడు. సిద్దప్పకు తగిన గుణపాఠం నేర్పాలని వెళ్తాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో సిద్దప్ప హత్య తన మీద పడటంతో గంగరాజు గ్యాంగ్‌స్టర్‌గా మారుతాడు. మరి గ్యాంగ్ స్టర్ గా మారిన గంగరాజు జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది? సిద్దప్ప ఎలా చనిపోయాడు? బసిరెడ్డితో గంగరాజకున్న వైరుధ్యం ఏమిటి? ఈ కథలో బసిరెడ్డి (చరణ్), నర్సారెడ్డి (శ్రీకాంత్ అయ్యంగార్) పాత్రలు ఏమిటి? గ్యాంగ్‌స్టర్ ఠాకూర్ (వెన్నెల కిషోర్) రోల్ ఏమిటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ: మాస్‌ హీరోగా ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో లక్ష్‌‌ కోసం రెగ్యులర్ కథను ఎంచుకొన్నప్పటికి… అనేక ట్విస్టులు, హాస్యంతో గాంగ్‌స్టర్ గంగరాజును కొత్తగా ఆవిష్కరించారు. ఇషాన్ రాసుకొన్న కథ… దాన్ని నడిపించేందుకు రాసుకున్న స్క్రీన్ ప్లే కొత్తగా ఉంది. ఇంటర్వెల్‌కు ముందు వరకు హీరోను కథ నడిపితే.. ఇంటర్వెల్ తర్వాత హీరోనే కథను నడపడం ఇందులో స్పెషల్‌. దర్శకుడు ఇషాన్ సూర్య మాస్ పల్స్ తెలిసిన వాడు అనుకుంటా. యాక్షన్ ఎపిసోడ్స్ బాగా చిత్రీకరించాడు.

వలయం చిత్రంతో మంచి మార్కులు కొట్టేసిన లక్ష్.. గ్యాంగ్‌స్టర్ గంగరాజు సినిమాతో పూర్తిస్థాయిలో మాస్ హీరోగా ఆకట్టుకొన్నాడు. బాడీ లాంగ్వేజ్, పాత్ర పరంగా యాటిట్యూడ్, ఫైట్స్, పాటలతో మరోసారి ఆకట్టుకొన్నాడు. మాస్ గెటప్‌తో మంచి అనుభవం ఉన్న నటుడిగా తన పాత్రలో ఒదిగిపోయాడు. కొత్తవాడైనప్పటికీ… తొణుకు బెణుకు లేకుండా తెరపైన రాణించాడు. ఎమోషనల్ సీన్లలో, రొమాంటిక్ సీన్లలో మంచి ఫెర్ఫార్మెన్స్ కనబరిచాడు. బోయపాటి శ్రీను లాంటి సినిమాల్లో సెట్ అయ్యే పర్సనాలిటీ అతనిది. రౌద్రం బాగా పండించగలడు. యువ హీరోయిన్ వేదిక దత్త ఇన్స్‌పెక్టర్‌గా బాగా చేసింది. ఆమె నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో మెరిసింది. వెన్నెల కిషోర్ తన మార్కు స్టయిల్ ప్రదర్శించాడు. బసిరెడ్డిగా చరణ్ దీప్ పర్ఫార్మెన్స్ అదుర్స్ అని చెప్పొచ్చు. చరణ్ మెయిన్ విలన్ పాత్రలో ఔరా అనిపించాడు. హీరో తండ్రిగా గోపరాజు రమణ ఎమోషన్స్ సీన్స్ బాగా పండించాడు. శ్రీకాంత్ అయ్యంగార్ ఫన్‌తో కూడిన విలనిజాన్ని చూపించి మెప్పించాడు. మిగితా క్యారెక్టర్లలో నటించిన వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

గ్యాంగ్‌స్టర్ గంగరాజ్ సినిమాకు సాంకేతిక విభాగాల పనితీరు బాగుంది. కణ్ణ సినిమాటోగ్రఫి బాగుంది. సాయి కార్తీక్ మ్యూజిక్, పాటలు సన్నివేశాలను ఎలివేట్ చేశాయి. డ్రాగన్ ప్రకాశ్ డిజైన్ చేసిన ఫైట్స్‌ మాస్‌గా ఉన్నాయి. రేణుకా బాబు ఎడిటింగ్ బాగుంది. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ అనుసరించిన నిర్మాణ విలువలు వల్ల సినిమా చాలా రిచ్‌గా, క్లాస్‌గా ఉంది.

ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, రొమాంటిక్, యాక్షన్ అంశాలు కలబోసిన మాస్ ఎంటర్‌టైనర్ గ్యాంగ్‌స్టర్ గంగరాజు. రెగ్యులర్ కథైనప్పటికీ.. తెర మీద ఆవిష్కరించిన తీరు వినూత్నంగా ఉంది. మాస్ హీరోగా మారడానికి అన్ని అంశాలు లక్ష్‌లో కనిపించాయి. రూరల్ నేటివిటి, మాస్ సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పక నచ్చుతుంది. లక్ష్ చేసిన మాస్ ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకొంటునడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. గో అండ్ వాచ్ ఇట్..!!!

చివరిగా : ఫుల్ మాస్ గంగరాజు.

రేటింగ్: 3/5

Related posts

Leave a Comment