డిఫ‌రెంట్ స్పై థ్రిల్ల‌ర్ గ్రే షూటింగ్ పూర్తి…

ప్ర‌తాప్ పోత‌న్‌, అర‌వింద్ కృష్ణ‌, అలీ రెజా, ఊర్వ‌శీరాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో అద్వితీయ మూవీస్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతున్న చిత్రం గ్రే. స్పై థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్‌ మ‌దిరాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కిర‌ణ్ క‌ల్లాకురి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ద స్పై హూ ల‌వ్డ్ మి అనే ట్యాగ్‌లైన్ తో తెర‌కెక్కుతోన్నఈ మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్లో గుమ్మ‌డికాయ కొట్టారు చిత్ర యూనిట్‌. త్వ‌ర‌లోనే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు ప్రారంభంకానున్నాయి. ఈ సంద‌ర్భంగా…

చిత్ర ద‌ర్శ‌కుడు రాజ్ మ‌దిరాజ్ మాట్లాడుతూ – అద్వితీయ మూవీస్ ప్రై.లి పై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతున్న `గ్రే` మూవీ షూటింగ్ ఈ రోజు పూర్త‌య్యింది. ఇదొక స్టైలిష్‌ స్పై థ్రిల్లర్ మూవీ. ట్విస్టులు ట‌ర్నుల‌తో ఆధ్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా ఉంటుంది. ప్ర‌తాప్ పోత‌న్‌, అర‌వింద్ కృష్ణ‌, అలీ రెజా, ఊర్వ‌శీరాయ్ అన్ని పాత్ర‌ల‌కి మంచి ప్రాధాన్య‌త ఉంటుంది. 20రోజుల పాటు నిర్విరామంగా హైద‌రాబాద్‌లోని ప‌లు అంద‌మైన లొకేష‌న్స్ లో షూటింగ్ జ‌రిపాం. నిర్మాత కిర‌ణ్‌గారు పూర్తి స‌హ‌కారం అందించారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్రారంభంకానున్నాయి. ఔట్‌పుట్ ప‌ట్ల మా టీమ్ అంద‌రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. త‌ప్ప‌కుండా ఒక డిఫ‌రెంట్ మూవీ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను అన్నారు.

నటీన‌టులు
ప్ర‌తాప్ పోత‌న్‌, అర‌వింద్ కృష్ణ‌, అలీ రెజా, ఊర్వ‌శీరాయ్‌, రాజ్ మ‌దిరాజు, షాని సాల్మోన్‌, న‌జియా, సిద్ధార్థ్‌

సాంకేతిక నిపుణులు
ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: రాజ్‌ మ‌దిరాజు
నిర్మాత: కిర‌ణ్ క‌ల్లాకురి
స‌హ నిర్మాత: రాజేష్ తోరేటి, రాజా వ‌శిష్ట‌, శ్రీదేవి క‌ల్లాకురి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: ఉమామ‌హేశ్వ‌ర్ చ‌ద‌ల‌వాడ‌
సినిమాటోగ్రాఫ‌ర్: ఎమ్ ఆర్ చేత‌న్ కుమార్‌
ఆర్ట్ డైరెక్ట‌ర్: రాజీవ్ నాయ‌ర్‌
మ్యూజిక్: నాగ‌రాజు తాల్లూరి
ఎడిట‌ర్: స‌త్య గిదుటూరి
మేక‌ప్: విమ‌లా రెడ్డి
యాక్ష‌న్: వింగ్ చున్‌ అంజి
ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌: సంజ‌య్‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: హేమంత్ సిరి
పీఆర్వో: శ్రీను- సిద్ధు

Related posts

Leave a Comment