ఇండియన్ స్క్రీన్ పై సరి కొత్త ప్రయోగం

రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో హన్సిక మోట్వాని ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “105 మినిట్స్ “
ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనం తో చేస్తున్న “సింగిల్ షాట్” చిత్రం “105 మినిట్స్ “
“సింగిల్ షాట్” “సింగిల్ క్యారెక్టర్ ” “రీల్ టైం & రియల్ టైం ” ఈ చిత్రానికి హైలైట్స్ అని మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రం లో హన్సిక మోట్వాని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనపడబోతోందని చిత్ర దర్శకుడు రాజు దుస్సా వివరించారు.
ఈ చిత్రం తన కెరీర్ లోనే ఒక మైలురాయి గా నిలిచి పోతుంది అని చిత్ర కథానాయిక హన్సిక మోట్వాని తెలిపారు.
సినిమాటోగ్రాఫర్ దుర్గా కిషోర్ మాట్లాడుతూ ఈ సినిమా మేకింగ్ తనకు ఒక ఛాలెంజ్ అని అన్నారు
ఇలాంటి చిత్రాన్ని నా బ్యానర్ లో నిర్మించడం నాకు చాలా సంతోషంగా వుందని,చిత్ర నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా అన్ని కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని చిత్ర నిర్మాత బొమ్మక్ శివ వివరించారు

Related posts

Leave a Comment