క్షణక్షణం సినిమా రివ్యూ

రివ్యూ : క్షణక్షణం
తారాగణం : ఉదయ్ శంకర్, జియాశర్మ, శ్రుతి సింగ్, రవి ప్రకాష్, కోటి, రఘు కుంచె
సినిమాటోగ్రఫీ : సిద్ధార్థ కరుమూరి
ఎడిటింగ్ : గోవింద్ దత్తకవి
సంగీతం : రోషన్ సాలూరి
నిర్మాతలు : డాక్టర్ వర్లు, డాక్టర్ మన్నెం చంద్రమౌళి
దర్శకత్వం : కార్తిక్ మేడికొండ

క్షణక్షణం.. రామ్ గోపాల్ వర్మ తీసిన ఓ ఇంటెన్సివ్ డ్రామా మూవీ. అలాంటి టైటిల్ తో కొత్త సినిమా అంటే ఖచ్చితంగా
అంచనాలుంటాయి. ట్రైలర్ తో వాటిని పెంచి.. ఓ థ్రిల్లర్ మూవీ చూపిస్తాం అనేలా నమ్మకాన్ని కలిగించింది కొత్త క్షణక్షణం మూవీ
టీమ్. మరి ఈ మేరకు వీళ్లు సక్సెస్ అయ్యారా లేదా అనేది చూద్దాం..

ధనమూలమిదం జగత్ అంటారు. ఈ సినిమా కూడా డబ్బు చుట్టూనే మొదలవుతుంది. కాకపోతే అవి లేకపోవడం వల్ల ఓ అనాథ
జంట ఎన్ని ఇబ్బందులు పడ్డారు అనేది ఇక్కడ కొత్త పాయింట్. అనాథలైన సత్య(ఉదయ్ శంకర్), ప్రీతి(జియాశర్మ)ప్రేమించి పెళ్లి
చేసుకుంటారు. కానీ ప్రీతి మనీ మైండెడ్. అటు సత్య అనుకున్నది ఏదీ సక్సెస్ కాదు. పైగా ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. ఇద్దరి
మధ్య మనస్ఫర్థలు వస్తాయి. దీంతో కలిసుండలేమని నిర్ణయించుకుని విడాకులుకు అప్లై చేస్తారు. ఆ టైమ్ లోనే సత్యకు బాగా
డబ్బున్న మాయ పరిచయం అవుతుంది. ఓ రోజు సత్యను మాయ తన ఇంటికి ఇన్వైట్ చేస్తుంది. అతను వెళ్లేసరికి మాయ
చనిపోయి ఉంటుంది..? మరి మాయను ఎవరు చంపారు..? పోలీస్ లు సత్యను అరెస్ట్ చేశారా.. చివరికి సత్య, ప్రీతి విడిపోయారా
కలుసుకున్నారా అనేది మిగతా కథ.

థ్రిల్లర్ సినిమాల్లో మొదటి భాగంలో చిక్కుముడులు వేసుకుంటూ వెళతారు. తర్వాతి భాగంలో వాటిని విడదీస్తూ ప్రేక్షకుల ఊహకు
అందని విషయాలు రివీల్ చేస్తుంటారు. ఇది కూడా థ్రిల్లరే అయినా మరీ ఎక్కువ చిక్కు ముడులు కనిపించవు. అది ఆడియన్స్ కు
కొంత రిలీఫ్ ఇచ్చే అంశం. ముఖ్యంగా చివరి అరగంట సినిమా ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. దర్శకుడు కార్తీక్ గతంలో కిస్ కిస్
బ్యాంగ్ బ్యాంగ్ అనే యూత్ ఫుల్ మూవీ చేశాడు. ఈ సారి పూర్తిగా థ్రిల్లర్ కథతో వచ్చాడు. అందుకోసం తను ఎంచుకున్న ఆర్టిస్టులు
బాగా ప్లస్ అయ్యారు. ముఖ్యంగా ఉదయ్ శంకర్ బాగా నటించాడు. జియాశర్మ, శ్రుతి సింగ్ అటు గ్లామర్ పరంగా నటన పరంగా
ఆకట్టుకుంటారు.
కాకపోతే దర్శకుడు కథలోకి వెళ్లడానికి చాలా ఎక్కువ టైమ్ తీసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ లో చాలా వరకూ అనవసర
సన్నివేశాలున్నాయి. వీటిని కాస్త ట్రిమ్ చేసుకుంటే బావుండేది. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత కూడా ఓ ఇరవై నిమిషాల వరకూ
అసలు పాయింట్ లోకి ఎంటర్ కాదు కథ. కాకపోతే ఆర్టిస్టుల నటన, సినిమాటోగ్రఫీ ఆకట్టుకునలా ఉండటంతో చాలా మైనస్ లు
కనిపించకుండా పోతాయి. థ్రిల్లర్ సినిమాల్లో మెయిన్ పాయింట్ కోసం మరీ ఎక్కువ టైమ్ తీసుకున్నా ఇబ్బంది అనిపిస్తుంది. అది
క్షణక్షణంలో కనిపిస్తుంది.
మొత్తంగా చాలా గొప్ప థ్రిల్లర్ అని చెప్పలేం. కానీ ఖచ్చితంగా ఎంగేజ్ చేస్తుందని చెప్పొచ్చు. మాటలు బావున్నాయి. పాటలు
ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ పరంగా కట్ చేయాల్సినవి చాలానే ఉన్నాయి. మరి ఎందుకు వదిలేశారో.. ప్రధానంగా చాలా తక్కువ
టైమ్ లోనే పూర్తి చేసిన ఈ చిత్రంలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి.

ఫైనల్ గా : క్షణక్షణం ఉత్కంఠ కాకపోయినా.. ఖచ్చితంగా ఉత్కంఠకు గురిచేసే సినిమా..

రేటింగ్ : 3/5

Related posts

Leave a Comment