“లవ్‌స్టోరీ” సినిమా సమీక్ష

రివ్యూ : లవ్ స్టోరీతారాగణం : నాగచైతన్య, సాయి పల్లవి, ఈశ్వరీరావు, రాజీవ్ కనకాల, దేవయాని తదితరులు,సంగీతం : పవన్ సిహెచ్సినిమాటోగ్రఫీ : విజయ్ సి కుమార్ , నిర్మతలు: నారాయణదాస్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు,దర్శకత్వం : శేఖర్ కమ్ముల

గత కొన్నాళ్లుగా తెలుగు సినిమా ఇబ్బంది పడుతోంది. పాండమిక్ కారణంగా సమస్యలు ఫేస్ చేస్తోంది. అయితే ఆ సమస్యలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే సినిమా కోసం కూడా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో చాలారోజుల నుంచి ఊరిస్తోన్న

“లవ్ స్టోరీ “తో బాక్సాఫీస్ కు కొత్త జోష్ వస్తుందని అంచనా వేశారు. మొత్తంగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఇవాళ విడుదలైంది లవ్ స్టోరీ. మొదటి నుంచి భారీ అంచనాలున్న ఈ చిత్రం అంచనాలను రీచ్ అయిందా..? లేదా చూద్దాం.. తెలంగాణలోని ఓ చిన్న గ్రామం నుంచి హైదరాబాద్ వస్తాడు రేవంత్(చైతన్య). అక్కడే ఫిట్ నెస్ సెంటర్ గా జుంబా డ్యాన్స్ నేర్పుతుంటాడు. అతను అద్దెకు ఉండే ఇళ్లు పక్కనే రేవంత్ ఊరి నుంచే జాబ్ కోసం వస్తుంది మౌనిక(సాయిపల్లవి). మౌనిక ఫ్రెండ్ వల్ల ఇద్దరికీ పరిచయం కలుగుతుంది. అప్పుడే ఇద్దరిదీ ఒకే ఊరని తెలుస్తోంది. మౌనికకు ఎంత ప్రయత్నించినా జాబ్ రాదు. దీంతో తను గొప్ప డ్యాన్సర్ అని తెలిసిన రేవంత్ ఆమెను ఒప్పించి తన పార్టనర్ గా చేసుకుంటాడు. ఇద్దరూ కలిసి జుంబా స్కూల్ ను బాగా డెవలప్ చేసి పెద్ద స్కూల్ పెడతారు. ఆ క్రమంలో ప్రేమలోనూ పడతారు. అయితే ఇద్దరివీ వేర్వేరు సామాజిక వర్గాలు. ఈ కారణంతో పాటు మౌనిక బాబాయ్(రాజీవ్ కనకాల) వల్ల మరికొన్ని సమస్యలుంటాయి. మరి అవేంటీ. ఈ వివక్షను దాటుకుని వీరు ఒక్కటయ్యారా లేక మరేవైనా సమస్యలు వచ్చాయా..? అనేది కథ. దర్శకుడు శేఖర్ కమ్ముల సమాజంలోని ఓ పెద్ద సమస్యను తీసుకుని దానికి ప్రేమకథను జోడించి అద్భుతమైన కథనం రాసుకున్నాడు. ఇండియాలో కులవ్యవస్థ ఎంతలా వేళ్లూనుకుని పోయింది అనేదానికి ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ శేఖర్ కమ్ముల తనదైన శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. దానికి ఈ లవ్ స్టోరీ ఓ గొప్ప అందాన్ని తీసుకువచ్చింది. క్యాస్ట్ అండ్ జెండర్ డిస్క్రిమిషన్ మీద ఇంత డీప్ గా చూపించిన తెలుగు సినిమా కనిపించదు. అందుకు ఆర్టిస్టుల నటన కూడా ఓ మెయిన్ కాజ్ గా చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ లో ఇద్దరి మధ్య పరిచయం, స్నేహం నుంచి ప్రేమగా కథనం నడిపించిన దర్శకుడు తర్వాత క్యాస్ట్ రీజన్ ను జోడించి స్క్రీన్ ప్లే ను ఎమోషనల్ గా మార్చాడు. మధ్యలో దుబాయ్ ఎపిసోడ్ తో పాటు ఎస్సై పాత్రలో నటించిన ఉత్తేజ్ ఎపిసోడ్ కాస్త బోర్ అనిపించినా.. మళ్లీ చివర్లో జెండర్ డిస్క్రిమిషన్, పిల్లలపై ఇంట్లోనే జరిగే అకృత్యాలను అద్భుతంగా నెరేట్ చేశాడు. ఈ ఎపిసోడ్స్ తో రెండు వివక్షలను పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేసి.. పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇచ్చాడు. ఎక్కడా హీరోయిక్ గా కథనం కనిపించదు. అది మామూలుగా శేఖర్ సినిమాల్లో చూసేదే అయినా.. ఇది మరీ నేచురల్ గా ఉండటం హైలెట్. కాకపోతే స్లో నెరేషన్ కాస్త ఇబ్బంది పెడుతుంది. నటన పరంగా చైతూకి ఇది కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అవుతుందని చెప్పొచ్చు. సాయిపల్లవి ఎప్పట్లానే అద్భుతం. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఏదో మ్యాజిక్ చేసినట్టుగా ప్రేక్షకులను తన నటనతో మంత్రముగ్దులను చేసింది. తర్వాత రాజీవ్ కనకాల మరోసారి తనకే సొంతమైన అద్భుత నటనతో భళా అనిపించాడు. ఈశ్వరీరావు, దేవయాని, ఉత్తేజ్ ల నటన పాత్రోచితంగా బావుంది. పాటలు ఆల్రెడీ హిట్. నేపథ్య సంగీతం హైలెట్. సినిమాటోగ్రఫీ రిచ్ గా కనిపిస్తుంది. దర్శకుడుగా శేఖర్ కమ్ముల ఓ మంచి కథను అదే స్థాయిలో ప్రెజెంట్ చేశాడు. చిన్న చిన్న డ్రా బ్యాక్స్ ఉన్నా..

ఇదో మస్ట్ వాచ్ సినిమా అని ఖచ్చితంగా చెప్పొచ్చు.

రేటింగ్: 3/5

– దుద్ది శ్రీను

Related posts

Leave a Comment