MAD సినిమా సమీక్ష

కరోసా సెకెండ్ వేవ్ లాక్ డౌన్ తరువాత సినిమా హాళ్లు తెరుచుకున్నాయి. దాంతో చిన్న సినిమాలన్నీ థియేటర్లో సందడి చేస్తున్నాయి. గత రెండు వారాలుగా వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దాంతో సినిమా ప్రియులు ఆనందం వ్యక్తం  చేస్తున్నారు. ఈ పరంపరలోనే ఈ రోజు ఆరు సినిమాలు థియేటర్లో సందడి చేశాయి. అందులో ఒకటి రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘MAD’ మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “మ్యాడ్”. మోదెల టాకీస్ బ్యాన‌ర్ పై టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి ఆయన మిత్రులు నిర్మాత‌లుగా లక్ష్మణ్ మేనేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి.

కథ : మ్యాడీ (మాధవ్ చిలుకూరి) ఒక ప్లే బాయ్. అమ్మాయిలతో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మాధురి (స్పందన పల్లి) ప్రేమ అంటే రెండు మనసులు కలవాలి, శరీరాలు కాదు అని నమ్మే అమ్మాయి. పూర్తి వ్యతిరేక భావజాలం ఉన్న వీరిద్దరికీ పెళ్లి అవుతుంది. ఆపోజిట్ ఆలోచనలు మరియు భావజాలం ఉన్న వీరిద్దరి కాపురం ఎలా సాగింది ? మాధురి ఆలోచనలు ఎందుకు అలా ఉన్నాయి ? అసలు రాహుల్ అనే వ్యక్తితో ఆమె గతం ఏమిటి ? ఈ మధ్యలో మ్యాడీ ఫ్రెండ్ అరవింద్ (రజత్ రాఘవ్), అఖిలా (శ్వేతవర్మ) బోల్డ్ ప్రేమ కథ ఎలా సాగింది? చివరకు ఈ రెండు జంటల ప్రేమకథలు ఎలా ముగిశాయి? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెరపై ఈ సినిమా చూడాల్సిందే.
కథ.. కథనం విశ్లేషణ: రొమాంటిక్ ఎంర్టైనర్ మూవీస్ కి యూత్ లో మంచి క్రేజ్ వుంది. అందుకే దర్శకులు.. నిర్మాతలు ఇలాంటి సింపుల్ లైన్ తో మూవీస్ ని తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తున్నారు. అలాంటి సినిమానే ‘MAD’. దర్శకుడు లక్ష్మణ్ మేనేని రాసుకున్న కథ.. కథనం బాగుంది. దానికి తోడు ఈ సినిమాలో హీరోగా నటించిన మాధవ్ చిలుకూరి చాలా  సెటిల్డ్ గా నటించాడు. ముఖ్యంగా మొదటి భాగంలో సాగే కీలక సన్నివేశాల్లో గాని, హీరోయిన్ తో సాగే ప్రేమ సన్నివేశాల్లో గాని, అతని నటన బాగుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే భావోద్వేగాలను కూడా ఎమోషనల్ గా  పండించాడు.  రజత్ రాఘవ్ నటన చాలా బాగుంది. అతని టైమింగ్ కూడా మంచి ఫన్ ను జనరేట్ చేసింది. దాంతో సినిమా ఆద్యంతం రొమాంటిక్ ఎంర్టైనర్ గా మెప్పిస్తుంది. ప్రేక్షకులు ఎక్కడా బోర్ గా ఫీల్ అవ్వకుండా సినిమాను ఎంజాయ్ చేస్తారు. అలానే హీరోయిన్స్ గా నటించిన స్పందన పల్లి, శ్వేతవర్మల నటన సినిమాకి ప్లస్ అయింది. శ్వేతవర్మ తన నటనతోనూ… గ్లామర్ తోనూ ఆకట్టుకుంది. యూత్ కి బాగా ఎక్కేస్తుంది శ్వేతావర్మ పాత్ర. బోల్డ్ గా వున్నా… యూత్ కావాల్సిన కంటెంట్ వుండటంతో ఈ పాత్ర బాగా రిజిష్టర్ అయిపోతుంది. అలానే ఈ సినిమాలో ఫాదర్ పాత్రలో నటించిన నటుడు కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోయినా ప్రతిభావంతమైన నటనతో చాలా మంది సహాయ నటీనటులు తప పాత్రలకు న్యాయం చేశారు. దాంతో ఈ సినిమా ప్రేక్షకుల్ని ఈ వారం థియేటర్ కి వచ్చే ప్రేక్షకుల్ని అలరిస్తుందనడంలో సందేహం లేదు.
పెళ్లి… సహజీవనం మధ్య నలిగిపోయే పాత్రల మధ్య సంఘర్షణలను ఇతి వృత్తంగా చేసుకుని దర్శకుడు లక్ష్మణ్ మేనేని రాసుకున్న స్క్రీన్ ప్లే సూపర్బ్. అక్కడక్కడ బోల్డ్ కంటెంట్ వున్నా.. అది కథలో భాగమైపోవడంతో సినిమా బోరింగ్ లేకుండా ముందుకు సాగిపోతుంది. దర్శకుడు మదిలో ఆధునిక పోకడల గురించి ఏదైతో వుందో… దాన్నే తెరపై చూపించి ఆకట్టుకున్నారు. సంగీత దర్శకుడు మోహిత్ రెహ్మానియాక్ అందించిన సంగీతం బాగుంది. ఎడిటింగ్ కూడా గ్రిప్పింగ్ గా వుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. విజువల్స్  చాలా సహజంగా వున్నాయి. అత్యుత్తమ నిర్మాణ విలువలతో సినిమాను నిర్మించారు నిర్మాతలు. సరదాగా ఈవారం మ్యాడ్(మ్యారేజ్ అండ్ డివోర్స్)ని చూసి ఎంజాయ్ చేయండి.

యూత్ ని మెప్పించే “MAD”
రేటింగ్: 3/5

Related posts

Leave a Comment