మ‌ధుర వైన్స్‌ సినిమా సమీక్ష

చిత్రం : మ‌ధుర వైన్స్‌విడుదల తేది : 22 అక్టోబర్ 2021నిడివి : 127 నిమిషాలునటీనటులు : సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ తూములూరి తదితరులుసంగీతం : కార్తిక్, జయ్ క్రిష్సినిమాటోగ్రఫీ : మోహన్ చారిఎడిటింగ్ : వర ప్రసాద్. ఎబ్యానర్: ఎస్ ఒరిజినల్స్ , ఆర్.కె.సినీ టాకీస్నిర్మాతలు: రాజేష్ కొండెపు, సృజన్ యారబోలుకథ-స్క్రీన్ ప్లే- మాటలు-దర్శకత్వం : జయకిషోర్.బిక‌థ‌: కాలేజీ డేస్ లో ఎంతో గాఢంగా ప్రేమించిన మధుర తనకి దూరమవ్వడంతో తాగుడుకి బానిసగా మరతాడు అజయ్(సన్నీ నవీన్). ఈ క్రమంలో అజయ్ కి అంజలి అనే అమ్మాయి పరిచయం అవుతుంది. అజయ్ గతం తెలుసుకునే క్రమంలో అతనితో ప్రేమలో పడుతుంది. పరిచయమైన కొన్ని రోజులకే మధుర ని మర్చిపోయి అంజలితో ప్రేమలో పడతాడు. ఇది ఇలా ఉండ‌గా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టపోయిన ఆనందరావు (సమ్మోహిత్ తూములూరి) ఫైనల్ గా త‌న ఫ్రెండ్ స‌హాయంతో త‌న‌కు ఇష్టం లేక‌పోయిన ఆర్ధికంగా నిల‌దోక్కుకోవ‌డం కోసం మధుర వైన్స్ పెట్టి మధ్యం అమ్ముతుంటాడు. త‌న ప్రియురాలి పేరుతో ఉన్న అదే వైన్‌షాప్‌లో రోజు మ‌ధ్యం తాగుతుంటాడు. అత‌న్ని ఎలా అయిన మార్చాల‌ని చూస్తుంటాడు ఆనంద‌రావు. ఇంత‌లో త‌ను ప్రేమ‌లో ప‌డింది త‌న చెల్లెలితోనే అని తెలుస్తోంది. ఫైనల్ గా అజయ్, అంజలి ప్రేమకు ఆనందరావు ఒప్పుకున్నాడా లేదా? అనేది మిగ‌తా క‌థ‌నటీనటుల పనితీరు:మొదటి సినిమా అయినప్పటికీ షార్ట్ ఫిలింస్ చేసిన అనుభవంతో హీరో సన్నీ నవీన్ బాగానే నటించాడు. సీమా చౌదరి గ్లామర్ తో ఎట్రాక్ట్ చేసింది. కొన్ని సన్నివేశాల్లో తన యాక్టింగ్ స్కిల్స్ తో ఆకట్టుకుంది. సమ్మోహిత్ తూములూరి తన పాత్రకు న్యాయం చేశాడు. మిగతా నటీనటులు పర్వాలేదనిపించుకున్నారు.సాంకేతిక వర్గం పనితీరు :సినిమాకు కార్తిక్ జయ్ క్రిష్ అందించిన మ్యూజిక్ ప్ల‌స్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా సాంగ్స్ ఆకట్టుకున్నాయి. అలాగే కొన్ని సందర్భాల్లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మోహన్ చారి.CH విజువల్స్ ఎట్రాక్ట్ చేశాయి. తన కెమెరా వర్క్ తో నేచురల్ లోకేషన్స్ ని మరింత నేచురల్ గా చూపించి సినిమాకు ప్లస్ అయ్యాడు మోహన్ చారి. వరప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు. రేటింగ్‌: 3/5

Related posts

Leave a Comment