“నీకు నాకు పెళ్ళంట” ట్రైలర్ విడుదల చేసిన మంచు విష్ణు

శతాబ్ది సినిమాస్ బ్యానర్ పై  హీరో కార్తిక్ శివ, హీరోయిన్ సంజనా అన్నే నటించిన చిత్రం నీకు నాకు పెళ్ళంట. కాసు శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని తాళ్లూరి మణికంఠ దర్శకత్వం వహించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను నటుడు మంచు విష్ణు విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ…కంటెంట్ బాగున్న సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయి. అదే తరహాలో నీకు నాకు పెళ్ళంట సినిమా మంచి సక్సెస్ అయ్యి అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ ఇప్పుడే చూశాను చాలా బాగుంది, చిత్ర నిర్మాత కాసు శ్రీనివాస్ రెడ్డి గారికి, డైరెక్టర్ తాళ్లూరి మణికంఠ గారికి హీరో హీరోయిన్ కార్తిక్ శివ, సంజన అన్నే అలాగే ఇతర నటీనటులకు సాంకేతిక నిపుణులకు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.
నటీనటులు:శ్యామ్ కార్తిక్, సంజనా అన్నే, ఖయ్యుమ్, వాసు ఇంటూరి, శ్రీ సుధ, ప్రియ పాలువై, దివ్య
సాంకేతిక నిపుణులు:బ్యానర్: శతాబ్ది సినిమాస్నిర్మాత: కాసు శ్రీనివాస్ రెడ్డికెమెరామెన్: ఆదిత్య మణికంఠఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డిఆర్ట్: తాళ్లూరు కృష్ణమోహన్సంగీతం: రఘు కుంచెఎగ్జిక్యూటివ్: చైతన్య

Related posts

Leave a Comment