“మరో ప్రస్థానం” సినిమా సమీక్ష

స‌మ‌ర్ప‌ణ‌: హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్నటీనటులు: తనీశ్‌, ముస్కాన్ సేథి, రిషిక ఖన్నా, అర్చనా సింగ్, టార్జాన్, గగన్ విహారి, అమిత్, రవికాలే, కేరాఫ్ కంచెరపాలెం రాజు సంగీతం: సునీల్ కశ్యప్ఎడిటర్: క్రాంతి (ఆర్కే) సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డిమాటలు,: వసంత కిరణ్, యానాల శివ,రచన దర్శకత్వం: జానీ

“నచ్చావులే” సినిమాతో హీరోగా  తెరంగేట్రం చేసిన తనీష్… ఆ తరువాత నానితో కలిసి “రైడ్” చేసి మంచి భవిష్యత్ కు బాటలు వేసుకుంటున్నారని ఇండస్ట్రీ అనుకుంది. కానీ ఆ తరువాత వరుసగా నటించిన చిత్రాలు ఫ్లాప్ కావడం… ఆ తరువాత పర్సనల్ ఇష్యుస్ తదితర అనవసర విషయాలతో సినిమా కథల ఎంపిక విషయంలో కొంచం గందరగోళ పరిస్థితుల్లోనే ఉన్నారనేది ఈరోజు విడుదలైన “మరో ప్రస్థానం” చూస్తే అర్థం అవుతుంది. హీరోగా దశాబ్దం పైగా అనుభవం వున్నా… ఈ సినిమాని చూస్తే మాత్రం… ఏమాత్రం సినిమాలలో అనుభవం లేని నటుడు చేశాడనేటట్టుగా ఉంది. అసలు సినిమాకు ఏమాత్రం పనికిరాని కథ… కథనాలను ఎంచుకుని ఈ సినిమాలో నటించచడం చూస్తుంటే… తనీష్ ఎంచుకునే సినిమా కథలు ఎంత డిగ్రేడ్ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. ఏమాత్రం కంటెంట్ లేని సినిమాలో నటించి… దాన్ని సింగిల్ షాట్ సినిమాగా పబ్లిసిటీ చేసుకోవడం… చాలా సిల్లీగా ఉంది. “మరో ప్రస్థానం” కథ విషయానికొస్తే….  విల‌న్ గ్యాంగ్ వ‌ర‌స హ‌త్యలు చేస్తుండ‌గా, ఆ గ్యాంగ్ లోనే వుంటూ వాటిపై స్ట్రింగ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించి వాటిని సీక్రెట్ కెమేరాలో షూట్ చేస్తారు హీరో శివ(తనీష్). దాంతో పాటు కొంత మంది విలన్ గ్యాంగ్ సభ్యులను సీక్రెట్ గా చంపుతూ ఉంటాడు. విలన్ గ్యాంగ్ అరాచకాలను బయటపెట్టే క్రమంలో జర్నలిస్ట్(భానుశ్రీ మెహ్రా) కుటుంబం విలన్ గ్యాంగ్ కి టార్గెట్ అవుతుంది. వాళ్ళను రక్షించడానికి ఓ వైపు… హీరో విలన్ గ్యాంగ్ ని మట్టు బెడుతూనే దాన్ని కూడా తన సీక్రెట్ కెమెరాలో బంధిస్తూ ఉంటాడు. ఆ కెమేరా విల‌న్‌ల‌కు దొరుకుంది. ఆ త‌రువాత ఏం జ‌రిగిందనే కథే ‘మరో ప్రస్థానం’. అసలు హీరో విలన్ గ్యాంగ్ ని చంపుతూ… వాటిని వీడియోలో ఎందుకు బంధిస్తాడో అర్థం కాని విషయం. ఓ నైట్ లో రెండు గంటల పాటు జరిగే ఈ సినిమా… ఎక్కడా క్రైం థ్రిల్లర్ అనే ఫీలింగ్ రాని… ఓ రకం సినిమా. మూవీ స్టార్టింగ్ మొదలు.. ఎండ్ వరకు… సింగిల్ షాట్ పేరుతో ఏదైతే సినిమాను రెండు గంటల పాటు… విషయం లేకుండా… క్వాలిటీ లేని విజువల్స్ తో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే ఈ అద్భుత కళాఖండం
ఈ సినిమా …. తనీష్ ఖాతాలో మరో ‘ప్రహసనం’గా వచ్చిన మూవీగా మిగిలిపోతుంది. పాపం దర్శకుడు ఏది చెప్తే అది చేసి తనిష్ చాలా పెద్ద తప్పే చేసాడు అనొచ్చు ….దర్శకుడు ఆలొచన బాగున్నా వృధా ప్రయత్నము

చివరగా : దీని కన్నా లఘు చిత్రాలు మేలు


రేటింగ్ : 1.5/5

Related posts

Leave a Comment