ప్రముఖ మోడల్స్‌తో కలర్‌ఫుల్‌గా జరిగిన ‘మీ వుమెన్ ఫ్యాషన్ షో’ సీజన్ 3

‘మీ వుమెన్ ఫ్యాషన్ షో’ సీజన్ 3 అంగరంగ వైభవంగా, మోడల్స్ ర్యాంప్ ‌వాక్‌తో కలర్ ఫుల్‌గా జరిగింది. మార్చి 21న హైదరాబాద్, బేగంపేటలోని ది మనోహర్ లగ్జరీ స్టార్ హోటల్‌లో జరిగిన ఈ ఫ్యాషన్ షో‌లో రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్ ముఖ్య అతిథిగా పాల్గొని.. మోడల్స్‌తో కలిసి ర్యాంప్ వాక్ చేశారు. న్యూట్రాన్ గ్రూప్ డైరెక్టర్స్ సాహిత్య యనమదల, సిమ్రన్. జి, శిశ్వంత్ చౌదరి ఆధ్వర్యంలో ‘మాస్టర్ బిల్డర్స్’, ‘యూనిక్ సెంటర్ క్విపో’ సంస్థల సీఈఓ సంతోష్ కుమార్ వేదుల ఈ ఫ్యాషన్ షోను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రముఖ మోడల్స్ పాల్గొన్న ఈ ర్యాంప్ వాక్ షో అతిథులను విశేషంగా అలరించింది. ప్రముఖ డిజైనర్లు రూపొందించిన డిజైన్స్‌, అలాగే మోడల్స్ సోయగాలు.. ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.

అనంతరం సంతోష్ కుమార్ వేదుల మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్ మహానగరంలో ఇటువంటి షోస్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఇది మాకు మూడో షో. ఈ విషయంలో శిశ్వంత్ చౌదరి, సాహిత్య యనమదల, సిమ్రన్ జి వంటి వారు ప్రోత్సాహం, సపోర్ట్ మరువలేనిది. మున్ముందు ఇలాంటి షోస్ మరిన్ని నిర్వహించాలని అనుకుంటున్నాం. సపోర్ట్ చేసిన అందిరికీ ధన్యవాదాలు.. రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్‌గారికి థ్యాంక్స్.. ’’ అన్నారు.

Related posts

Leave a Comment