‘మెరిసే మెరిసే’ సినిమా సమీక్ష

హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా ‘మెరిసే మెరిసే’. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘మెరిసే మెరిసే’ చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా అలరించిందో చూద్దాం పదండి.

కథ: వెన్నెల(శ్వేత అవస్తి)… పెళ్ళైనా కూడా భర్త సంపాదన మీద కాకుండా తన సొంత కాళ్లపై జీవించాలనుకునే ఇండిపెండెంట్ అమ్మాయి. అందుకే తనకు ఇష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్ రంగాన్ని ఎంచుకుంటుంది. అయితే వెన్నెలను చేసుకోబోయే వ్యక్తికి(సంజయ్ స్వరూప్)… అతని తల్లిదండ్రులకు ఫ్యాషన్ డిజైనింగ్ రంగం ఇష్టం ఉండదు. మరి వెన్నెల తను అనుకున్న రంగంలో రాణించిందా? అందుకు సహకరించిన వారెవరు? తనకు కాబోయే భర్త… అత్తమామల రియాక్షన్ ఏంటి? చివరకు వెన్నెల ఎలాంటి డెసిషన్ తీసుకుని తన ఎంచుకున్న మార్గం వైపు వెళ్లి సక్సెస్ అయిందనేదే మిగతా కథ.

కథనం విశ్లేషణ: పెళ్లి చేసుకోబోయే ఓ యువ జంట మనస్సులు ఎలా ఉంటాయి… వారు కలిసి చేసే ప్రయాణంలో ఎలాంటి ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు… ఈకాలం అమ్మాయిలు ఎలా ఆలోచిస్తున్నారు.. వారి అభిప్రాయాలను తల్లిదండ్రులు కానీ, కట్టుకోబోయే భర్త లేదా అత్త మామలు కాబోయే కోడలు ఎలా వుండాలనుకుంటున్నారు… తదితర ఇంట్రెస్టింగ్ సీన్స్ తో కూడిన పకడ్బందీ కథా.. కథనాలతో దర్శకుడు “మెరిసే మెరిసే” మూవీని సెల్యులాయిడ్ పై చాలా రిచ్ గా ఆవిష్కరించారు. ఇప్పటికీ కొంతమంది అబ్బాయిలు లండన్ లాంటి ఆధునిక పోకడలు ఉన్న దేశంలో సెటిల్ కావడానికి సిద్ధం అవుతున్నా… తమకు కాబోయే భార్య మాత్రం వంటింటికే పరిమితం అయ్యి.. నాలుగు గోడల మధ్యే నలిగిపోవాలనే సంకుచిత తత్వంతో ఉన్నారనే సంజయ్ అనే పాత్రను బాగా చూపించారు. అలానే కొంతమంది అబ్బాయిలు ఆస్తిపాస్తులు.. మంచి బిజినెస్ లు వున్నా కూడా… వాటి మీద ఆధారపడకుండా తమకు ఇష్టమైన జీవితం లొనే సక్సెస్ ను సాధించే యువకుని పాత్రను సిద్ధు క్యారెక్టర్ లో ఆవిష్కరించి… మెప్పించారు. దినేష్ తేజ్, శ్వేతా అవస్తి, సంజయ్ స్వరూప్ లు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాటోగ్రాఫర్ విజువల్స్ ని చాలా గ్రాండ్ గా చూపించారు. సంగీతం సిచ్యుయేషన్ తగ్గట్టుగా ఉంది.. ఎడిటింగ్ గ్రిప్పింగా ఉంది. మూవీ గ్రాండియర్ లుక్ కోసం నిర్మాత ఎక్కడా రాజీపడకుండా ఖర్చు పెట్టారు.

రేటింగ్: 3/5

Related posts

Leave a Comment