“మిస్సింగ్” సినిమా సమీక్ష

హర్ష నర్రా. మిషా నారంగ్, నికీషా రంగ్వాలా ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం మిస్సింగ్. ఈ చిత్రాన్ని బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించారు. ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ: గౌతమ్ నర్రా(హర్ష నర్రా) ఎథికల్ హ్యాకింగ్ లో మంచి ఎక్స్ పర్ట్. అతనికి నలుగు మిత్రులు వుంటారు. వారు కూడా వివిధ వృత్తుల్లో ట్యాలెంట్ పర్సన్స్. అయితే వీళ్లంతా… ఓ వ్యక్తి ట్రాప్ లో పడి క్రైం చేస్తుంటారు. ఈ క్రమంలో వీళ్ళు శ్రుతి (నికీషా)ను కిడ్నాప్ చేయాలనుకుంటారు. కట్ చేస్తే.. గౌతమ్.. శ్రుతిని పెళ్ళి చేసుకుని… సరదాగా బయటకు వెళ్లగా హర్షను కొట్టి… శ్రుతిని కిడ్నాప్ చేస్తారు. ఇలా హఠాత్తుగా శ్రుతి కిడ్నాప్ కావడం వెనుక ఎవరున్నారనేది హర్షకు ఓ పట్టాన అర్థం కాదు. మరి హర్ష తన భార్య శ్రుతి ఆచూకీ ఎలా తెలుసుకున్నాడు? అసలు హర్ష ఎవరు? కిడ్నాప్ చేయాల్సిన శ్రుతిని పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? ఈ కిడ్నాప్ డ్రామా వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరు? దాన్ని ఎలా ఛేదించారు? అనేది తెలియాలంటే “మిస్సింగ్” మిస్ అవ్వొద్దు.


విశ్లేషణ: మిస్సింగ్.. మూవీ ఎక్కువగా స్క్రీన్ ప్లే బేస్డ్ గా తెరకెక్కింది. ప్రతి పది పదిహేను నిమిషాలకు ఓ ట్విస్ట్ తో… ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా సీరియస్ మోడ్ లో సాగిపోతుంది. ఇంతకు ముందు… హీరోకి మల్టిఫుల్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉండి… ప్రవర్తించే సీన్స్ చూసాం. ఇందులో కూడా అలాంటి ఎలిమెంట్ వున్నా… ఇది మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్ మూవీ. ఫస్ట్ హాఫ్ లో కిడ్నాప్…. వెతుకులాట తదితర వాటితో సెకెండ్ హాఫ్ పై ప్రేక్షకుల మూడ్ ని మరింత అటెన్షన్ చేసి… హీరోకి ఉన్న అసలు స్వరూపాన్ని చూపించిన విధానం బాగుంది. అలాగే క్లయిమాక్స్ దాకా కిడ్నాప్ కి అసలు సూత్రధారి ఎవరనేది సస్పెన్స్ కొనసాగించడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. చివరకు అనూహ్యమైన ట్విస్ట్ తో విలన్ ని రివీల్ చేసి.. క్లయిమాక్స్ ను ముగించిన తీరు ఆడియెన్స్ ని థ్రిల్ కు గురిచేస్తుంది.

హీరోగా నటించిన హర్ష నర్రా… మల్టీ పర్సనాలిటీ స్ప్లిట్ డిజార్డర్ వున్న రెండు వెరీయేషన్ పాత్రలను బాగా చేసాడు. . అతనికి జంటగా నటించిన నికీషా బబ్లీగా బాగా చేసింది. కెనడా ఆరిజిన్ గల అమ్మాయి అయినా తెలుగుకి తగ్గట్టుగా లిప్ సింక్ బాగా సూట్ అయ్యేలా డైలాగులు చెప్పింది. జర్నలిస్ట్ పాత్రలో నటించిన మిషా నారంగ్… జర్నలిస్ట్ మీనా పాత్రలో మెప్పించింది. ఏసీపీ త్యాగి పాత్రలో హిందీ నటుడు రామ్ దత్ మెప్పించారు. ఛత్రపతి శేఖర్ కూడా తన పరిధి మేరకు నటించి తన పాత్రకు న్యాయం చేశాడు. డాక్టర్ పాత్రలో నటుడు సూర్య.. ఎప్పటిలాగే తనకు ఇచ్చిన డాక్టర్ పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు.

దర్శకునికి ఇది డెబ్యూ మూవీనే అయినా… ఓ ఇంట్రెస్టింగ్ ప్లాట్ కి… పకడ్బందీగా స్క్రీన్ ప్లే రాసుకుని.. కథ.. కథనాలను నడిపించి విజయం సాధించారు. అనవసర కమర్షియల్ ఎలిమెంట్స్ ను జొప్పించకుండా… తాను రాసుకున్న వాటినే తెరమీద చూపించి ప్రేక్షకులకు ఓ థ్రిల్ కలిగించాలనుకున్నాడు. అందులో సక్సెస్ అయ్యారు. దానికి తోడు బీజీఎం బాగా ప్లస్ అయ్యింది. ఆల్ మోస్ట్ సినిమా మొత్తం నైట్ లోనే సాగుతుంది. అందుకు తగ్గట్టుగానే సినిమాటోగ్రఫీ ఉంది. క్వాలిటీ ఎక్కడా తగ్గలేదు. ఎడిటింగ్ బాగుంది. సినిమాకి తగ్గట్టుగా నిర్మాణ విలువలున్నాయి.

ఓ వరాల్ గా…”మిస్సింగ్” – ఒక ఎంగేజింగ్ థ్రిల్లర్

రేటింగ్: 3/5

Related posts

Leave a Comment