“మిషన్ 2020” మూవీ రివ్యూ

సినిమా : “మిషన్ 2020”
రివ్యూ రేటింగ్ : 3.25/5
సమర్పణ – హనీ బన్నీ క్రియేషన్స్,
బ్యానర్ – మధు మృదు ఎంటర్ టైన్ మెంట్స్,
నటీనటులు – నవీన్ చంద్ర, నాగబాబు, జయప్రకాష్, సత్య ప్రకాష్, చలాకీ చంటి, సమీర్, స్వాతి శర్మ తదితరులు
నిర్మాతలు – కుంట్లూర్ వెంకటేష్ గౌడ్, కె వి ఎస్ఎస్ ఎల్ రమేష్ రాజు,
దర్శకత్వం – కరణం బాబ్జి.
సంగీతం – ర్యాప్ రాక్ షకీల్,
ఎడిటర్: ఎస్ బి ఉద్ధవ్,
సినిమాటోగ్రఫీ – వెంకట్ ప్రసాద్,

మనం ప్రతి రోజూ అను నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలపై సినిమాలు తెరకెక్కించాలంటే గట్స్ కావాలి. అలాంటి ధైర్య సాహసాలు ప్రదర్శించిన కొత్త సినిమా మిషన్ 2020.హనీ బన్నీ క్రియేషన్స్ సమర్పణలో మధు మృదు ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నవీన్ చంద్ర, నాగబాబు, జయప్రకాష్, సత్య ప్రకాష్, చలాకీ చంటి, సమీర్, స్వాతి శర్మ నటీనటులుగా కరణం బాబ్జి దర్శకత్వంలో కుంట్లూర్ వెంకటేష్ గౌడ్ మరియు కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు లు సంయుక్తంగా కలసి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్  29 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ చిత్రం ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి.

కథ
నిజాయితీ గల పోలీస్ అధికారి జయంత్ (నవీన్ చంద్ర). నేరం రుజువు అయితే నేరస్తులకు తనదైన శైలిలో గుణపాఠాలు చెబుతుంటాడు. చట్టంలోని లొసుగులు ఉపయోగించిన శిక్ష నుంచి తప్పించుకునే దుర్మార్గులైన నేరస్తులను ఎన్ కౌంటర్ చేసేస్తుంటాడు. ఎలాగైనా న్యాయాన్ని కాపాడాలి, సమాజాన్ని రక్షించాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. బాగా చదువుకునే ప్రకాష్ అతని మిత్రబృందానికి అశ్లీల వీడియోల చూస్తూ వాటి  వ్యసనానికి లోనవుతారు. ఈ అశ్లీల వీడియోలు చూసిన మత్తులో తమ స్నేహితురాలైన స్వాతి అనే అమ్మాయిపై అత్యాచారం చేస్తారు.ఈ రేప్ కేసును పోలీస్ అధికారిగా ఉన్న జయంత్ (నవీన్ చంద్ర) ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. మరి ఆ రేప్ చేసిన విద్యార్థులను పోలీస్ అధికారి జయంత్ కనిపెట్టి ఎలా పట్టుకున్నాడు?,వాళ్లకు ఎలాంటి శిక్ష పడేలా చేశాడు ?. ఆవేశంలో చేసిన ఒక తప్పు నలుగురు విద్యార్థుల జీవితాలను ఎలాంటి ప్రమాదంలో పడేసింది అనేది మిగిలిన కథ.

నటీ,నటుల పనితీరు
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ జయంత్ పాత్రలో నవీన్ చంద్ర నటన ఆకట్టుకుంది. మంచిని కాపాడాలనే తన ఆవేశం, అమాయకులను రక్షించి, దుర్మార్గుల ఆటకట్టించేందుకు అతను చేసిన ప్రయత్న నవీన్ చంద్ర నటనలో కనిపించింది. ఒక ఎమోషనల్, పైర్ బ్రాండ్ పోలీస్ ఆఫీసర్ కు ఉండాల్సిన భావోద్వేగాలను పలికించాడు నవీన్ చంద్ర. నాగబాబు, జయ ప్రకాష్, సత్య ప్రకాష్ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. సమీర్, చలాకీ చంటి పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి.

సాంకేతిక నిపుణుల పనితీరు
టీనేజ్ లో తెలిసీ తెలియని వయసులో కొందమంది యూత్ కు ఈ అశ్లీల వీడియోలు ఓ వ్యసనంలా మారాయి. వాటి ప్రభావంతో జీవితంలో దిద్దుకోలేని తప్పులు చేస్తున్నారు. ఇలాంటి యువత పట్ల సమాజం స్పందించే తీరు కూడా ప్రశ్నించాల్సిన విషయమే. దర్శకుడు బాబ్జి ఈ విషయాన్ని కూడా ఆలోచింప జేసేలా రూపొందించాడు.సమాజం మారాలంటే మార్పు మన నుంచే మొదలవ్వాలని చెప్పిన విధానం బాగుంది. యువత పోర్న్ వీడియోల మత్తులో పడి భవిష్యత్ ను ఎలా పాడుచేసుకుంటున్నారు అనే అంశంతో  దర్శకుడు చాలా చక్కగా తెరకెక్కించాడు. ఇలాంటి మంచి కాన్సెప్ట్ పాయింట్ తో ప్రేక్షకులను ఆలోచింపజేసేలా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు కరణం బాబ్జి. శ్రీ రాపాక స్పెషల్ సాంగ్ మాస్ కు ట్రీట్ ఇస్తుంది. ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు సందేశాన్ని షుగర్ కోటెడ్ గా చెప్పేందుకు దర్శకుడికి ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాలో పెట్టక తప్పలేదు. అవన్నీ మిషన్ 2020 సినిమాను ఎంగేజింగ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా మార్చాయి. సాంకేతికంగా ఉన్నంతగా ఉందీ సినిమా. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, ఎస్ బి ఉద్ద‌వ్ ఎడిటింగ్, ర్యాప్ రాక్ షకీల్ సంగీతం సినిమా కథను తెరపై ఎలివేట్ చేయడంలో తమ వంతు బలాన్నిచ్చాయి.కుంట్లూర్ వెంకటేష్ గౌడ్ మరియు కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు కలిసి చేసిన ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదని ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. మంచి కాన్సెప్ట్ తో తీసిన “మిషన్ 2020” సినిమా చూసిన  ప్రేక్షకులందరికీ తప్పక నచ్చుతుంది.

రేటింగ్ 3/5

Related posts

Leave a Comment