మిస్టర్ అండ్ మిస్ సినిమా రివ్యూ

రివ్యూ : మిస్టర్ అండ్ మిస్
తారాగణం : శైలేశ్ సన్నీ, జ్ఞానేశ్వరి, పవన్ రమేష్
సంగీతం : నాగ్
సినిమాటోగ్రఫీ : సిద్ధం మనోహర్
నిర్మాత : అశోక్ రెడ్డి
దర్శకత్వం : అశోక్ రెడ్డి.

ఏ కాలంలో అయినా యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ అని ఉంటాయి. ప్రేమకథ లేని సినిమా ఉండదు కాబట్టి.. ఆ కథను కాస్త జాగ్రత్తగా డీల్ చేస్తే ఆడియన్స్ చేత ప్రేమించబడటం అంత కష్టమేం కాదు. కాకపోతే ట్రెండ్ మారింది కదా. అటు ఓటిటికీ ఇటు వెండితెరకు సరిపోయేలా కథ రాసుకుంటే పాస్ అయిపోతుంది. అలా వచ్చిన సినిమానే మిస్టర్ అండ్ మిస్. ఏ వర్గం ఆడియన్స్ ను టార్గెట్ చేసుకుని వచ్చారో వారితో పాటు ఇతర ప్రేక్షకులనూ ఆకట్టుకునేలాంటి కథాంశంతో వచ్చిన సినిమా ఇది.

ఎక్కడ చదువుకున్నా ఉద్యోగం అంటే హైదరాబాదే డెస్టినేషన్ కదా. అలా గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్ వస్తాడో కుర్రాడు. వచ్చాక ఊరుకుంటాడా.. ఓ అమ్మాయిని చూసి మనసు పారేసుకుంటాడు. తనూ ఇతన్ని ప్రేమిస్తుంది. ఈ కాలం ప్రేమకదా.. ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్ లో ఉంటారు. మనసులు మాత్రమే శారీరకంగానూ కలుస్తారు. అంతా హ్యాపీ అనుకునే టైమ్ లో ఈ ఇద్దరి ఫోన్ లు పోతాయి. మరి ఆ ఫోన్స్ లో ఏముందీ.. వాటి కోసం వీరేం చేశారు.. అనేది మిగతా కథ.

మోడ్రన్ లవ్ స్టోరీస్ కు తగ్గట్టుగానే మిస్టర్ అండ్ మిస్ ట్రెండీగా కనిపించారు. వైవిధ్యమైన కథగా ఆకట్టుకుంటుంది. మంచి ఎమోషన్స్ ఉన్నాయి. మెయిన్ రోల్స్ లో చేసిన శైలేశ్, జ్ఞానేశ్వరి సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా హీరోయిన్ అందాల ఆరబోతలోనే కాదు.. మంచి నటనతోనూ ఆకట్టుకుంటుంది. పూర్తిగా రొమాంటిక్ ఎంటర్టైనర్ అయినా ఎక్కడా వల్గారిటీ లేకుండా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ కాలంలో సాధారణంగా జరిగే అంశాలను మంచి కథగా రాసుకోవడంలోనూ అతని సక్సెస్ కనిపిస్తుంది.
ఫోన్ పోవడం అనే కాన్సెప్ట్ కొత్తగా కనిపించకపోయినా.. పోయిన ఫోన్ ద్వారా ఇంటర్నెట్ లో ఏం చేస్తారు అనే అంశాలను అద్భుతంగా చెప్పాడు. చాలా వరకూ ఫోన్ అంటే అన్ని ప్రైవేట్ విషయాలనూ దాచుకుంటారు కొందరు. కానీ అందులోని వీడియోస్, ఫోటోస్ ను దొంగిలించి వేర్వేరు సైట్స్ కు అమ్ముకునే బ్యాచ్ కు సంబంధించిన స్టడీ కూడా బావుంది. ఇలాంటి కథలు ఆడియన్స్ లో.. ముఖ్యంగా యూత్ లో మంచి అవేర్ నెస్ తీసుకువస్తాయని చెప్పొచ్చు.

Rating :3/5

Related posts

Leave a Comment