మోసగాళ్లు సినిమా సమీక్ష

నటీనటులు : విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్, రుహి సింగ్, నవీన్ చంద్ర

సినిమాటోగ్రఫీ : షెల్డన్ చౌ

సంగీతం : సామ్ సి ఎస్

దర్శకత్వం : జెఫ్రీ గీ చిన్

నిర్మాత‌ : విష్ణు మంచు

ఓ సాలిడ్ హిట్ కోసం కొన్నాళ్లుగా చూస్తున్నాడు మంచు విష్ణు. ఇలా హిట్స్ కోసం చూస్తోన్న హీరోలు నిర్మాతలు గా మారి విజయాలు అందుకున్నారు. అలాంటి ప్రయత్నమే విష్ణు కూడా చేశాడు. కానీ మిగతావారికి భిన్నంగా ఓ రియల్ స్టోరీని తీసుకుని భారీ బడ్జెట్ పెట్టేశాడు. తారాగణం కూడా భారీగానే ఉంది. ఆ రేంజ్ లోనే ప్రమోషన్స్ కూడా చేశాడు. ప్యాన్ ఇండియన్ లెవెల్లో సినిమా విడుదల చేశాడు. ఐటి సెక్టర్ లో జరిగిన అతిపెద్ద స్కామ్ ఆధారంగా వచ్చిన ఈ మూవీ టేకాఫ్ అందుకు అనుగుణంగానే ఉంది.
చాలా సాధారణమైన కుటుంబంలో పుట్టిన అక్కా(కాజల్) తమ్ముడు(విష్ణు).. కష్టపడి చదువుకుని ఓ కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తారు. ఆ కంపెనీ సిఇవో(నవదీప్) ఇచ్చిన ఓ ఐడియా నుంచి ఈ స్కామ్ ను డెవలప్ చేస్తారు. అయితే ఇండియాలో ఉంటూ.. అమెరికన్స్ దోచేయడం ప్లాన్. మరి ఈ ప్లాన్ లో వీళ్లు ఎలా సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత పోలీస్ లకు దొరికారా లేదా అనేది మిగతా కథ.
విష్ణు ముందు నుంచీ ఈ కథపై చాలా నమ్మకంగా ఉన్నాడు. ఎందుకంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. నిర్మాతగానూ ఎక్కడా రాజీపడలేదు. వైవిధ్యమైన కథతో తను చేసిన ప్రయత్నం ఖచ్చితంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ఈ స్కామ్ కు సంబంధించిన మరీ ఎక్కువ డీటెయిలింగ్ కు వెళితే డాక్యుమెంటరీ అవుతుంది. అందుకే దర్శకుడు కూడా మరీ డీటెయిలింగ్స్ కు వెళ్లకుండా సినిమాటిక్ గానే కథనం రాసుకున్నారు. అందువల్ల ఎక్కడా బోర్ కొట్టదు. అక్కడక్కడా కథనం కాస్త స్లో అయినట్టు అనిపించినా ఓవరాల్ గా మోసగాళ్లు చూసిన వారిని మెప్పిస్తారు. దీనికి తోడు కాజల్, విష్ణుల స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోతుంది. కాజల్ అక్కగా బాగా నటించింది. ఇద్దరి మధ్య సీన్స్ అన్నీ డీసెంట్ గా ఉన్నాయి. విష్ణు హీరోయిజం చూపించకుండా పూర్తిగా కథకు సరెండర్ అయ్యాడు. వీరికి తోడు నవదీప్, నవీన్ చంద్రల నటనా అదిరిపోయింది.
ఇక టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో కనిపిస్తుందీ చిత్రం. నిర్మాతగా విష్ణు ఎక్కడా రాజీ పడలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఓ హాలీవుడ్ మూవీ రేంజ్ లో కనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. సినిమాటోగ్రఫీ సూపర్బ్.

Rating :3/5

Related posts

Leave a Comment