కోటి చేతుల మీదుగా “లవ్ యు రా” సినిమాలోని ఏమాయచేశావే పాట విడుదల!!

సముద్రాల సినీ క్రియేషన్స్ పతాకంపై బేబీ అన్య ఆనంద్ సమర్పణలో సముద్రాల మంత్రయ్య బాబు నిర్మిస్తున్న చిత్రం “లవ్ యు రా”.. ప్రసాద్ ఏలూరి దర్శకుడు. చిను క్రిష్ హీరోగా గీతా రతన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఇంట్రెస్టింగ్ పాయింట్ తో లవర్ స్టోరీ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా లో శేఖర్, సాయినాధ్, మధు ప్రియ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా ఈశ్వర్ పెరవళి సంగీతం, రవి బైపల్లి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. వైవిధ్యమైన ప్రేమ కథాంశంతో యూత్ ఆడియన్స్ కి నచ్చేలా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అతి త్వరలో రిలీజ్ కాబోతుంది. కాగా ఈ చిత్రంలోని “ఏమాయచేశావే” పాటను తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు కోటి రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. లవ్ యూ రా సినిమా పాటను రిలీజ్ చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. పాట చాల బాగుంది. మంచి కంపోజ్ చేశాడు సంగీత దర్శకుడు ఈశ్వర్.. వినగానే క్యాచీ గా అనిపించింది. హరిచరణ్ గారు పాడిన ఈ పాటను మీ అందరికి నచ్చుతుంది. విజువల్స్ బాగున్నాయి.. కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. సాంగ్ వింటుంటే ఫ్రెష్ అనిపించింది.. టీం అందరికి అల్ ది బెస్ట్ అన్నారు..

చిను క్రిష్, గీతికా రతన్, శేఖర్, సాయినాధ్, మధు ప్రియ, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్; ఈశ్వర్ పెరవళి, కెమెరా; రవి బైపల్లి, సుధాకర్ నాయుడు, పాటలు; రాజరత్నం బట్లూరి, కొరియోగ్రఫీ; బ్రదర్ ఆనంద్, పోస్ట్ ప్రొడక్షన్ సి2సి స్టూడియో, ప్రొడక్షన్ మేనేజర్; వి.సుధాకర్, పీఆర్ఓ; సాయి సతీష్, నిర్మాత; సముద్రాల మంత్రయ్య బాబు, దర్శకత్వం; ప్రసాద్ ఏలూరి.

Related posts

Leave a Comment