విడుద‌ల‌కు సిద్ద‌మైన న‌ల్ల‌మ‌ల‌

నల్లమల అడవి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటికి భిన్నంగా ఆ అడవి చుట్టూ జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అవినీతి ఒప్పందాల నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర క‌థా క‌థ‌నాల‌తో తెర‌కెక్కుతోన్న చిత్రం న‌ల్ల‌మ‌ల‌. అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి రవి చరణ్ ‌దర్శ‌కుడు. ఆర్‌.ఎమ్‌ నిర్మిస్తున్న ఈ మూవీలోని సిద్ శ్రీ‌రామ్ పాడిన ఏమున్న‌వే పిల్లా సాంగ్ ఇప్ప‌టికే 17 మిలియ‌న్ల‌కి పైగా వ్యూస్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా ఆ పాట‌కు ల‌క్ష‌కు పైగా క‌వ‌ర్‌సాంగ్స్ రావ‌డం విశేషం.
అలాగే ఈ చిత్రంనునుండి విడుద‌లైన అన్ని పాట‌లు 1మిలియ‌న్‌కి పైగా వ్యూస్ సాధించ‌డం ఆడియ‌న్స్‌లో ఈ సినిమా క్రేజ్‌ను తెలియ‌జేస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో విడుద‌ల‌తేధిని ప్ర‌క‌టించ‌నున్నారు.

సాంకేతికంగానూ హై స్టాండర్డ్స్ లో నిలిచే ఈ మూవీకి
సినిమాటోగ్రఫీ: వేణు మురళి
సంగీతం, పాటలు: పి.ఆర్
ఎడిటర్: శివ సర్వాణి
ఆర్ట్: యాదగిరి
ఫైట్స్: నబా
విఎఫ్ఎక్స్: విజయ్ రాజ్
పి.ఆర్.వో: దుద్ది శ్రీను
నిర్మాత: ఆర్.ఎమ్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవి చరణ్

Related posts

Leave a Comment