
ప్రముఖ క్లాసికల్ డాన్సర్ సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశృంకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 22 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్‌తో ఈ చిత్రం మంచి ఆదరణను దక్కించుకుంది. తాజాగా ఈ చిత్రం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2021వ చిత్రోత్సవంలో ఎంపికైంది. ఇండియన్ పనోరమా సెక్షన్లో నాట్యం
సినిమా స్క్రీనింగ్ కి ఎంపిక కావడం విశేషం. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మెషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్(కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసారాల శాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నవంబర్ 20 నుంచి 28 వరకు తొమ్మిది రోజులపాటు ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో..
ఈ సినిమాను మొదలు పెట్టినదగ్గర నుండి చాలా మంది ఎందుకు మీరు సినిమా రంగం వైపు వచ్చారు అని అడిగారు. నేను ఎన్ని సమాధానాలు చెప్పిన వారు సంతృప్తి చెందలేదు. అయితే ఈ రోజు నాట్యం సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కి సెలక్ట్ అయ్యాక వారికి సమాధానం దొరికింది. ఒక మంచి సినిమా చేశామని గర్వంగా ఉంది. ఈ సినిమాని డైరెక్ట్ చేసిన రేవంత్‌కి థ్యాంక్స్. ఈ సినిమాతో మరో సారి మన తెలుగు సాంప్రదాయ నృత్య విలువని, ప్రధాన్యతని తెలియజేయడం జరిగింది. మన కూచిపూడి, మరియు సౌత్ ఇండియన్ డ్యాన్స్ మరింత మందికి చేరువవుతుంది. నాట్యం టీమ్ అందరికీ ధన్యవాదాలు అని సంధ్యారాజు అన్నారు.