మెప్పించే సస్పెన్స్ థ్రిల్లర్ “నిశ్శబ్దం”

స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన చిత్రం ‘నిశ్శ‌బ్దం’. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో ఈ రోజు అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా విడుదల అయింది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రాన్ని క్రితి ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ అసోసియేషన్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యానర్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ నిర్మించారు.  మరి ప్రేక్షకులును ఏ మేరకు త్రిల్ కు గురి చేసిందో చూద్దాం పదండి..

కథ : అనుష్క (సాక్షి), సోనాలి (షాలిని పాండే) ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అనుష్క తండ్రి నడిపిన ఆర్ఫాన్ స్కూల్ లోనే ఇద్దరు కలిసి పెరుగుతారు. ఇద్దరూ ఒకర్ని ఒకరు వదిలి ఉండలేరు. అయితే ఈ క్రమంలో సాక్షి జీవితంలోకి ఆంటోనీ (మాధవన్) రావడం సోనాలి తట్టుకోలేకపోతోంది. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం సోనాలి మిస్ అవ్వడం, అలాగే ఆంటోనీని ఎవరో దారుణంగా హత్య చేయడం లాంటి సంఘటనలు జరుగుతాయి. ఆంటోనీ హత్య కేసును విచారణ చేస్తున్న టీమ్ లో మహా (అంజలి) తన తెలువితేటలతో అసలు ఏం జరిగింది ? అమ్మాయిల మిస్సింగ్ కేసుకు, ఆంటోనీ మర్డర్ కేసుకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి అని కనుక్కోవడానికి ఆమె ఎన్ని రకాల ప్రయత్నాలు చేసింది. ఇంతకీ ఆంటోనీని ఎవరు చంపారు ? ఎందుకు చంపారు ? అసలు అమ్మాయిల మిస్ అవ్వడానికి కారకులు ఎవరు ? ఇంతకీ సోనాలి ఏమైపోయింది ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

 
డిఫరెంట్ కాన్సెప్ట్ తో హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో మెయిన్ సీక్వెన్స్ లో ప్లే ఇంట్రస్టింగ్ గా సాగుతూ ఆకట్టుకుంటుంది. ఇక అనుష్క, సాక్షి పాత్రలో అద్భుతంగా నటించింది. సాక్షికి వినబడదు, కనబడదు, అలాంటి పాత్రను చాలెంజింగ్‌ గా తీసుకుని మరీ అనుష్క ఈ పాత్రలో నటించిన విధానం మెచ్చుకోతగినది. ఇక ఈ పాత్ర కోసం అమెరికా సైన్ లాంగ్వేజ్‌ నేర్చుకుని మరీ బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అనుష్క. అలాగే క్లిష్టమైన కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కొన్ని హారర్ అండ్ ఎమోషనల్ సీన్స్ లోనూ అనుష్క పలికించిన హావభావాలు చాల బాగున్నాయి.

మాధవన్ – అనుష్క మధ్య కెమిస్ట్రీ మరియు అనుష్క క్యారెక్టర్ లోని షేడ్స్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఇక సినిమాలో కీలకమైన మేల్ లీడ్ గా నటించిన మాధవన్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు షాలిని పాండే, అంజలి, హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడిసన్, సుబ్బరాజు సహా అందరూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. మెయిన్ గా హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడిసన్ వల్ల సినిమాకి అంతర్జాతీయ కల వచ్చింది. ఇక సినిమాలో చాలా భాగాన్ని యుఎస్‌లో బ్యూటీఫుల్ లోకేషన్స్‌లో చిత్రీకరించడం కూడా సినిమా స్థాయిని పెంచింది.

 దర్శకుడు హేమంత్ మధుకర్ ఎంచుకున్న కథ… దానికి తగ్గట్టు రాసుకున్న స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమాను ఓ విజువల్ ఫీస్ట్ గా తీర్చి దిద్దారు. హాలీవుడ్ స్థాయిలో నెరేషన్ ఉంది. సస్పెన్షన్ త్రిల్లర్ గా మూవీని తీర్చిదిద్దడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ముఖ్యంగా హారర్ సన్నివేశాల్లో సీన్ లోని మూడ్ ని తన కెమెరా యాంగిల్స్ తో కళ్ళకు కట్టినట్టు చూపించారు కెమెరామెన్. అలాగే గిరీష్ అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. ఇక ఎడిటింగ్ కూడా బావుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. సస్పెన్స్ త్రిల్లర్ ఇష్టపడే ప్రేక్షకులను “నిశ్శబ్దం” ఆకట్టుకుంటుంది.

రేటింగ్: 3.5

Related posts

Leave a Comment