“ఊరికి ఉత్త‌రాన‌” సినిమా రివ్యూ

నరేన్, దీపాలి శర్మ జంటగా నటించిన సినిమా ఊరికి ఉత్తరాన. ఈ చిత్రాన్ని ఈగల్ ఐ ఎంటైర్ టైన్మెంట్స్  బ్యానర్ పై వనపర్తి వెంకటయ్య , రాచాల యుగంధర్ సంయుక్తంగా నిర్మించారు. సతీష్ అండ్ టీమ్ దర్శకత్వం వహించారు. ఇందులో ఇతర పాత్రల్లో రామరాజు, మల్లేశం ఫేం ఆనంద చక్రపాణి, ఫణి, జగదీష్ లు నటించారు. ఈ చిత్రం ఈరోజే విడుదల అయింది. ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ చిత్రం ఎలా ఆకట్టుకుందో చూద్దాం..

కథ: వరంగల్ జిల్లాలోని ఓ గ్రామంలో శంకర్ పటేల్(రామరాజు) గ్రామ పెద్ద. ఆయన ప్రేమ వివాహాలకు దూరం. పెద్దలు కుదిర్చిన పెళ్లినే చేసుకోవాలని ఓ కట్టుబాటు విధిస్తాడు. దాన్ని అతిక్రమించిన వారికి శిక్ష విధిస్తాడు. అలాంటి శంకర్ పటేల్ మేన కోడలు శైలు(దీపాలి శర్మ) అదే గ్రామానికి చెందిన కరెంట్ రాజు(నరేన్) కూడా అదే కాలేజ్ లో చేరతాడు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టంగా వున్నా.. దాన్ని ఎప్పుడూ బర్గతపరచరు. కట్ చేస్తే.. వీళ్ళిద్దరూ హైదరాబాద్ లో చార్మినార్ చూడటానికి వస్తారు. అయితే హఠాత్తుగా శైలు ట్రైన్ లో తప్పిపోతుంది. మరో వైపు ఊళ్ళో వీళ్ళిద్దరూ లేచిపోయారనే పుకారు పుడుతుంది. మరి తప్పిపోయిన శైలు ఆచూకి లభించిందా? అలా ఎందుకు ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది? వీళ్ళకి శంకర్ పటేల్ ఎలాంటి శిక్ష విధించాడు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలకు ఇప్పటికీ డిమాండ్ వుండనడానికి ఊరికి ఉత్తరాన సినిమా కథను బట్టే అర్థం అవుతుంది. ఎంత ప్రపంచం టెక్నాలజీ చుట్టూ తిరిగినా ఊళ్ళో కట్టు బాట్లు మారలేదని చెప్పడానికి దర్శకుడు సతీష్ ఎంచుకున్న కథ… దాన్ని నడిపించడానికి ఎంచుకున్న హీరో నరేన్, హీరోయిన్ దీపాలి శర్మల పాత్రలను చూస్తే తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగా రాసుకున్న స్క్రీన్ ప్లే సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే సాగిపోతుంది. సినిమా ఆద్యంతం హిలేరియస్ కామెడీ పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బ ఎంటర్టైన్ చేస్తుంది. ఎక్కడ బోరింగ్ లేకుండా రాసుకున్న సీన్స్ అన్నీ మంచి ఫీల్ గుడ్ అనిపిస్తాయి.
దర్శకుడు సతీష్ అండ్ టీమ్ రాసుకున్న కథ, కథనాలు బాగున్నాయి. ఎక్కడా బోరింగ్ లేకుండా బాగా నవ్వించాడు. డైలాగ్స్ బాగున్నాయి. భీమ్స్ సంగీతం బాగుంది. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. గ్రామీణ వాతావరణం, పట్టణ వాతావరణం బాగా చూపించారు.

రేటింగ్: 3/5

Related posts

Leave a Comment