పవర్ ప్లే సినిమా రివ్యూ

రివ్యూ : పవర్ ప్లే
తారాగణం : రాజ్ తరుణ్, హేమల్, పూర్ణ, మధునందన్, ధన్ రాజ్
సంగీతం : సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ : ఐ ఆండ్ర్యూ
నిర్మాతలు : మహీధర్, దేవేష్
దర్శకత్వం : విజయ్ కుమార్ కొండా

ఏ ఇండస్ట్రీలో అయినా లవర్ బాయ్ ఇమేజ్ అనేది మెడలో పడిన పాములాంటిది. దాన్ని వదిలించుకోవడం అంత సులభం కాదు. అలాగని ఎక్కువ కాలం మోయలేరు. ప్రస్తుతం ఆ ఇమేజ్ తోనే ఇబ్బందులు పడుతూ కొత్తదనం కోసం ప్రయత్నం చేస్తోన్న రాజ్ తరుణ్ ఓ పర్ఫెక్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో వచ్చాడు అని ప్రమోషన్స్ లో చెప్పారు. మరి వాళ్లు చెప్పినట్టుగానే సినిమా ఆకట్టుకుందా లేదా అనేది చూద్దాం..

నిరుద్యోగి అయిన విజయ్(రాజ్ తరుణ్) ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. కానీ ఉద్యోగం లేని కారణంగా పెళ్లి వరకూ వెళ్లేందుకు ఇబ్బంది పడుతుంటాడు. ఆ టైమ్ లో విజయ్ తండ్రి తను చేస్తోన్న ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఆ జాబ్ లో కొడుకును పెట్టిస్తాడు. దీంతో ఇక హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు అనుకున్న టైమ్ లో విజయ్ లైఫ్ లో ఊహించని సంఘటనలు మొదలవుతాయి. అత్యంత సామాన్యుడైన ఆ యువకుడు రాష్ట్రంలోనే చాలా పెద్ద వారి చేతిలో ఇరుక్కుంటాడు. తన ప్రమేయం లేకుండానే ప్రాబ్లమ్స్ లో పడ్డ విజయ్.. వాటి నుంచి ఎలా బయటపడ్డాడు. అసలా పెద్ద వ్యక్తులు ఎవరు..? ఎందుకు విజయ్ నే టార్గెట్ చేశారు అనేది మిగతా కథ.

సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఆరంభం కాగానే కథలోకి వెళతాయి. ఈ విషయంలో దర్శకుడు కాస్త బద్దకం చూపించినా ఓ అరగంట తర్వాత అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుంచి ఎక్కడా టెంపో తగ్గకుండా ఆకట్టుకుంటాడు. ఈ తరహా సినిమాలకు స్క్రీన్ ప్లే అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ విషయంలో దర్శకుడు చాలా వర్క్ చేశాడు. రేసీ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ను కట్టిపడేస్తాడు. ఒక్కో సీన్ తో హీరోకు వచ్చే ఇబ్బందులు ఆడియన్ కూడా రిలేట్ చేసుకునేలా మంచి కథనం రాసుకోవడంతో ఆ కథలో ప్రేక్షకులు లీనమైపోతారు. టైటిల్ కు తగ్గట్టుగానే వెండితెరపై ‘పవర్ ప్లే’ చేశాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ సీట్ ఎడ్జ్ లో కూర్చునేలా చేశాడంటే అతిశయోక్తి కాదు.
ఇక ఇప్పటి వరకూ రాజ్ తరుణ్ అనగానే కొన్ని తరహా కథలకే పరిమితం అనుకున్నవారికి.. అతను ఎలాంటి కథైనా చేయగలడు అని చెప్పేలా.. ఈ సినిమా ఓ చక్కని ఉదాహరణగా నిలుస్తుంది. తన తరహా కథ కాకపోయినా టైలర్ మేడ్ క్యారెక్టర్ లా చాలా ఈజ్ గా చేసుకుంటూ వెళ్లిపోయాడు. పైగా ఈ జానర్ దర్శకుడికి కూడా కొత్తే. ఆ కొత్తదనం సినిమాలో చూపించాలన్న వీరి తాపత్రయానికి మంచి రిజల్ట్ వచ్చింది. హీరోయిన్ కూడా మంచి ఎమోషన్స్ తో పాటు గ్లామర్ ను కూడా బాగా పండించింది. రాజ్ తరుణ్ తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సింది పూర్ణ గురించి. ఇప్పటి వరకూ ఎన్నో గ్లామర్ రోల్స్ లో మాత్రమే కనిపించిన పూర్ణ ఫస్ట్ టైమ్ ఓ పవర్ ఫుల్ రోల్ ప్లే చేసింది. తమిళ్ సినిమా ధర్మయోగిలో త్రిష పాత్రను తలపించేలా తన క్యారెక్టర్ కనిపిస్తుంది. వచ్చిన ఈ ఛాన్స్ ను పూర్ణ కూడా బాగా వాడుకుని అద్భుతంగా నటించింది. మధునందన్, ధన్ రాజ్ లవి కూడా వైవిధ్యమైన పాత్రలే. ఆ మేరకు వాళ్లూ బాగా చేశారు.
టెక్నికల్ గా సురేష్ బొబ్బిలి సంగీతం సినిమాకు బ్యాక్ బోన్ లా నిలిచింది. సినిమాను నెక్ట్స్ లెవల్లో నిలిపేలా అతని పనితనం కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఓ భారీ సినిమా స్థాయిలో ఉంది. టాలెంటెడ్ ఎడిటర్ ప్రవీణ్ పూడి పనితనం మెప్పిస్తుంది. దర్శకుడు కొన్ని ఇల్లాజికల్ సీన్స్ ను యాక్సెప్ట్ చేయించాడు. అలాగే కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీస్ ను కాస్త ఎక్కువగా వాడుకున్నాడేమో అనిపిస్తుంది.
మొత్తంగా ఈ జానర్ నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారో అవన్ని నైన్టీ పర్సెంట్ ఉన్న సినిమా పవర్ ప్లే. ఈ వీకెండ్ కు బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు.

ఫైనల్ గా : ‘పవర్ ఫుల్’ ప్లే

రేటింగ్ : 3.5/5

Related posts

Leave a Comment